19.5 C
Hyderabad
Friday, November 27, 2020

బీజేపీ నేతలు కేంద్రం నుంచి నయా పైసా తేలేదు: కేటీఆర్

హైదరాబాద్ లో వర్షాలపై విపక్షాలు బురద రాజకీయం చేస్తున్నాయని మండిపడ్డారు మంత్రి కేటీఆర్. ఇన్నేళ్ల పాలనలో బీజేపీ, కాంగ్రెస్ హైదరాబాద్ కు ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. కనీసం నాలాల ఆక్రమణలను కూడా ఆపలేకపోయారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్న బీజేపీ నేతలు కేంద్రం నుంచి కనీసం ఒక్క రూపాయి కూడా తేలేకపోయారని కేటీఆర్ ఫైర్ అయ్యారు. పైగా అధికారుల దగ్గరకు వెళ్లి చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. వరద బాధితుల కోసం సీఎం కేసీఆర్ తక్షణ సాయం కింద 550 కోట్ల రూపాయలు ఇచ్చారని గుర్తు చేశారు. ఇప్పటికే చాలామందికి వరదసాయం అందించామన్న కేటీఆర్.. ఇంకా మిగిలిన బాధితులకు కూడా సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. అటు దుబ్బాకలో బీజేపీ కనీసం డిపాజిట్ కూడా దక్కదన్నారు మంత్రి కేటీఆర్.

- Advertisement -

Latest news

Related news

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్

ఆస్ట్రేలియాలో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియాపై టాస్ గెలిసి ఆసీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. కరోనా వైరస్ నేపథ్యంలో చాలా రోజుల తరువాత టీమిండియా బ్లూజెర్సీతో మైదానంలో కనిపిస్తోంది.ఈ మ్యాచ్‌లో టాస్...

దేశంలో 93 లక్షలు దాటిన కరోనా కేసులు

దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. బాధితుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. గడిచిన 24గంటల్లో 43 వేల 082 కొత్త కేసులు వెలుగులోకి రాగా.. మొత్తం కేసుల సంఖ్య 93లక్షల 09వేల...

పీవీ, ఎన్టీఆర్‌కు పురస్కారాలేవి?

దేశ ప్రధానమంత్రి పదవిని అధిష్ఠించిన తొలి తెలంగాణ బిడ్డ పీవీ నరసింహారావు. భారతదేశ అణువిధాన పితామహుడు, ఆర్థికసంస్కరణల సారథి అయిన పీవీ నరసింహారావుకు ఈ దేశంలో దక్కాల్సిన గౌరవం దక్కలేదు....

నిఖార్సయిన హిందుత్వానికి నిర్వచనం కేసీఆర్‌

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఓ గొప్ప హిందువు. సీఎం కేసీఆర్‌ చేసే యజ్ఞయాగాది క్రతువులు తాను ఎలాంటివారో చెప్పక్కనే చెబుతాయి. కేసీఆర్‌ చేపట్టిన ఏ పనిలోనైనా...