29.3 C
Hyderabad
Monday, March 1, 2021

భారత్ లో 24 గంటల్లో 9,983 మందికి కరోనా

భారత్‌లో కరోనా తీవ్రత రోజురోజుకీ  పెరుగుతోంది. లాక్‌ డౌన్‌ సడలింపులతో రోజూ 10వేల వరకు కొత్త కేసులు నమోదు అవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 9,983 కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 2,56,611కి చేరుకుంది. ఒకే రోజులో 206 మంది ప్రాణాలు కోల్పోవడంతో మరణాల సంఖ్య 7,135కి చేరుకున్నట్టుగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. పది రాష్‌ర్టాల్లో మరణాలు, కేసుల సంఖ్య అంతకంతకు పెరుగుతుండడంతో భయాందోళనకు గురి చేస్తుంది. మహారాష్ట్ర, తమిళనా డు, ఢిల్లీ, గుజరాత్‌, రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, పశ్చిమబెంగాల్‌, కర్ణాటక, బీహార్‌ లో మరణాల సంఖ్య ఎక్కువగా ఉంది. ఇక ఢిల్లీ, తమిళనాడు, రాజస్థాన్‌, కర్ణాటక, మహారాష్ట్రల్లో అత్యధిక కేసులు రికార్డు అవుతున్నాయి.

- Advertisement -

Latest news

Related news