21.4 C
Hyderabad
Friday, October 23, 2020

మందిరం,మసీదులను విశాలంగా పునఃనిర్మిస్తాం- సీఎం కేసీఆర్‌

తెలంగాణ సెక్రటేరియట్ పాత భననాల కూల్చివేత సందర్భంగా అక్కడున్న దేవాలయం, మసీదులకు కొంత ఇబ్బంది కలగడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్‌ విచారాన్ని, బాధను వ్యక్తం చేశారు. సెక్రటేరియట్ స్థలంలోనే ఇప్పుడున్న దానికన్నా ఎక్కువ విస్తీర్ణయంలో, విశాలంగా దేవాలయం, మసీదులను పూర్తి ప్రభుత్వ ఖర్చుతో నిర్మిస్తామని సిఎం ప్రకటించారు. తెలంగాణ సెక్రటేరియట్ పాత భవనాలను కూల్చివేసి, కొత్త భవన సముదాయం నిర్మించడానికి ప్రభుత్వం పూనుకున్నదని సీఎం కేసీఆర్‌ చెప్పారు.  అక్కడున్న ఎత్తయిన భవనాలు కూల్చే సందర్భంలో పక్కనే ఉన్న ప్రార్థనా మందిరాలపైన శిథిలాలు పడి కొంత నష్టం జరిగిందనే విషయం తనకు తెలిసిందన్న సీఎం కేసీఆర్‌… ఇలా జరగడం పట్ల తాను ఎంతో బాధపడుతున్నానని చెప్పారు. ఇలా జరిగి ఉండాల్సింది కాదన్నారు.

పాత భవనాల స్థానంలో కొత్తవి నిర్మించడమే ప్రభుత్వ ఉద్దేశ్యం తప్పా.. ప్రార్థనా మందిరాలకు ఇబ్బంది కలిగించడం ప్రభుత్వ ఉద్దేశం కాదన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్‌. దేవాలయం, మసీదు నిర్వాహకులతో తానే స్వయంగా  త్వరలోనే సమావేశమవుతానన్నారు. వారి అభిప్రాయాలు తీసుకుని, కొత్త సెక్రటేరియట్ భవన సముదాయంతో పాటుగా ప్రార్థనా మందిరాలను నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు.  తెలంగాణ రాష్ట్రం సెక్యులర్ రాష్ట్రమన్న ముఖ్యమంత్రి.. ఎట్టి పరిస్థితుల్లోనూ లౌకిక స్పూర్తిని కొనసాగిస్తామని ప్రకటించారు.కాకతాళీయంగా జరిగిన సంఘటనను  అందరూ సహృదయంతో అర్థం చేసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌  కోరారు.

- Advertisement -

Latest news

Related news

రాజస్థాన్‌పై హైదరాబాద్‌ విజయం

దుబాయ్‌ వేదికగా రాజస్తాన్‌ రాయల్స్‌ తో జరిగిన మ్యాచ్‌ లో సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ ఆల్‌ రౌండ్‌ పర్‌ఫామెన్స్‌ తో అదరగొట్టింది. ఫ్లే ఆఫ్స్‌ ఆశలు సజీవంగా ఉండాలంటే తప్పక...

రాజ‌శేఖ‌ర్ త్వ‌ర‌గా కోలుకోవాలి…చిరు ట్వీట్

క‌రోనాతో ప్రైవేట్ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న రాజ‌శేఖ‌ర్‌కు సంబంధించి తాజాగా హెల్త్ బులిటెన్ విడుద‌లైంది.  రాజ‌శేఖ‌ర్  ఆరోగ్యం నిల‌క‌డ‌గానే  ఉంద‌ని, చికిత్స‌కు స్పందిస్తున్నార‌ని వైద్యులు తెలిపారు. అలానే త‌న తండ్రి...

సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన మలయప్ప స్వామి

తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా.. ఏడవరోజు మలయప్ప స్వామి సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. సప్త ఆశ్వాలను కలిగిన సూర్యప్రభపై శ్రీనివాసుడు వజ్రకవచం ధరించి...

బీహార్‌ లో బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్‌

బీహార్ లో పోలింగ్‌ దగ్గర పడుతున్న వేళ బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోను రిలీజ్‌ చేసింది. పాట్నాలో మేనిఫెస్టోను విడుదల చేసిన కేంద్ర మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ ..ప్ర‌జ‌ల‌కు సుప‌రిపాల‌న అందించ‌డమే...