24.3 C
Hyderabad
Wednesday, November 25, 2020

మక్కల కొనుగోళ్లపై సీఎం కేసీఆర్ ఆరా..

ఊహించని రీతిలో వ్యవహరించడం సీఎం కేసీఆర్ కు పరిపాటి. ఆయన తీసుకునే నిర్ణయాలు ప్రజలకు అందుతున్నాయా లేదా అని ముఖ్యమంత్రి కేసీఆర్ చెక్ చేసుకుంటూ ఉంటారు. ఈ నేపథ్యంలో మొక్కజొన్న రైతుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని మక్కలకు ప్రభుత్వం మద్ధతు ధర ప్రకటించింది. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో క్వింటాల్ మక్కలకు 1850 రూపాయలు చెల్లిస్తూ.. రైతుల నుంచి సేకరిస్తోంది. అయితే మక్కల కొనుగోళ్లపై ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న సీఎం కేసీఆర్..ప్రజా ప్రతినిధులకు ఫోన్ చేసి స్థానికంగా కొనుగోళ్లపై ఆరా తీస్తున్నారు. ఇందులో భాగంగ జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కు ఫోన్ చేసి నియోజకవర్గంలో మక్కల కొనుగోళ్లపై ఆరా తీశారు.
జగిత్యాల రూరల్ మండలం అంతర్గాంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్..రైతులతో మాట్లాడుతున్నారు. ఈ సమయంలో సీఎం కేసీఆర్ సంజయ్ కుమార్ కు ఫోన్ చేశారు. జగిత్యాల నియొజకవర్గం పరిధిలో ధాన్యం కొనుగోళ్లు ఎలా ఉన్నాయి? మక్కల కొనుగోలు ఎలా జరుగుతుందని అడిగి తెలుసుకున్నారు. ట్రేడర్స్..ధాన్యం, మక్కలను కొంటున్నారా? ఏమైనా ఇబ్బందులున్నాయా? నియోజకవర్గంలో ధాన్యం దిగుబడి ఎంత ఉండే అవకాశాలున్నాయి? మక్కసాగు విస్తీర్ణమెంత ? ఎంత దిగుబడి ఉండొచ్చు? అని అడిగారు. నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఎంత ధాన్యం, మక్కలు కొనుగోళ్లు చేశారంటూ ఆరా తీశారు. పూర్తి వివరాలను సేకరించి తెలియజేయాలని ఆదేశించారు. ధాన్యం, మక్కల కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని సూచించారు. మక్కను మార్కెట్ యార్డుల్లో, కొన్ని చోట్ల కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు చేస్తామని ఎమ్మెల్యే సంజయ్ ..సీఎం కేసీఆర్ కు వివరించారు. ప్రైవేట్ ట్రేడర్స్ కొనుగోలు చేస్తున్నారని..వారు క్వింటాల్ మక్కకు 1200 నుంచి 1600 వరకు చెల్లిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో మాత్రం క్వింటాల్ మక్కకు 1850 మద్ధతు ధర చెల్లిస్తున్నాయని వివరించారు.

సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు జగిత్యాల నియోజకవర్గంలో ప్రైవేటు ట్రేడర్స్, మార్కెట్ యార్డుల ఆధ్వర్యంలో కొనుగోలు చేసిన మక్కల వివరాలను ఎమ్మెల్యే సంజయ్ కుమార్..సీఎం కార్యాలయానికి అందించారు. జగిత్యాల నియొజకవర్గంలో ప్రైవేటు ట్రేడర్స్ 3500 క్వింటాళ్ల మొక్కలను కొనుగోలు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ సంస్థల ద్వారా 3600 క్వింటాళ్ల మక్కలను కొన్నట్లు అధికారులకు వివరించారు.

- Advertisement -

Latest news

Related news

భారత్‌ లో 92లక్షలు దాటిన కరోనా కేసులు

భారత్‌ లో కరోనా తీవ్రత కొనసాగుతోంది. దేశంలో బాధితుల సంఖ్య 92లక్షలు దాటింది. నిన్నటికి నిన్న 44 వేల 376 కొత్త కేసులు వెలుగులోకి రాగా.. మొత్తం కేసుల సంఖ్య...

అహ్మద్‌ పటేల్‌ మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు అహ్మద్ పటేల్ మరణం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అహ్మద్ పటేల్ తో తనకున్న అనుబంధాన్ని గుర్తు...

తమిళనాడు, పుదుచ్చేరిలో భారీ నుంచి అతి భారీ వర్షాలు

నివర్‌ తుపాను తీవ్ర రూపం దాల్చింది. దీని ప్రభావంతో తమిళనాడు. పుదుచ్చేరిలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలు, ఈదురు గాలులతో తీర ప్రాంతాలు అతలాకుతలం...

అహ్మద్‌ పటేల్‌ మృతి పట్ల ప్రధాని మోదీ దిగ్భ్రాంతి

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అహ్మద్‌ పటేల్‌ మృతిపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌పార్టీ బలోపేతానికి పటేల్‌ చేసిన కృషిని కొనియాడారు. ఆయన చాలా కాలంపాటు ప్రజా...