24.1 C
Hyderabad
Tuesday, November 24, 2020

మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు

తూర్పు మధ్య బంగాళాఖాతం దాని పరిసరప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతున్నది. దాని ప్రభావంతో రాష్ట్రంలో వచ్చే రెండురోజులపాటు పలుచోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వానలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ప్రధానంగా ములుగు, వరంగల్‌ రూరల్‌, వరంగల్‌ అర్బన్‌, యాదాద్రి భువనగిరి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్‌, సూర్యాపేట, నల్లగొండ, నాగర్‌కర్నూల్‌, వనపర్తి, జనగామ జిల్లాల్లో ఒకటి రెండుచోట్ల భారీ వర్షాలు, శుక్రవారం అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని పేర్కొన్నారు. అల్పపీడన ప్రభావంతో వాతావరణం వర్షాలకు అత్యంత అనుకూలంగా మారిందన్నారు. నైరుతి రుతుపవనాలు నిలకడగా విస్తరిస్తున్నాయని తెలిపారు. ప్రస్తుతం తమిళనాడులో చాలాప్రాంతాలు, కర్ణాటక, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో నైరుతి విస్తరించినట్టు వెల్లడించారు.   

అల్పపీడన ప్రభావంతో  రాష్ట్రంలోని పలు జిల్లా ల్లో వర్షం కురిసింది. ఈదురుగాలుల దాటికి  పలు ప్రాంతా ల్లో చెట్లు నేలకూలాయి. నిర్మల్‌ జిల్లా దస్తురాబాద్‌, ఆదిలాబాద్‌ జిల్లా జైనథ్‌, నార్నూర్‌, భీంపూర్‌ మండలాల్లోని పలు గ్రామాల్లో  భారీ వర్షం కురిసింది. మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో అక్కడక్కడా భారీ వర్షం కురిసింది. మందమర్రి సోమగూడెం రోడ్డులో చొప్పరిపల్లి సమీపంలో భారీ వృక్షం నేలకొరిగింది.  ఉమ్మడి నిజామాబాద్‌ , సిద్దిపేట జిల్లాల్లోని పలు మండలాల్లో భారీ వాన పడింది. మెదక్‌, సంగారెడ్డి పట్టణంలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది.

ఇకఖమ్మం జిల్లా ఎడతెరిపిలేని వర్షంతో తడిసి ముద్దవుతోంది. మధిర , సత్తుపల్లి నియోజకవర్గాల్లో పలు మండలాలలో భారీ వర్షం కురిసింది. ఎర్రుపాలెం , వేంసూరు , బోనకల్ తో పాటు పలు మండలాల్లో మోస్తరు వర్షం కురిసింది.  ఇల్లందు , భద్రాచలం , పాల్వంచలో మోస్తరు వర్షం కురిసింది.. గార్ల , బయ్యారం మండలాలో కూడా జోరు వాన పడింది . అటు నల్లగొండ జిల్లా కేంద్రంతో పాటు మునుగోడు, చండూరు, కనగల్‌, గుర్రంపోడు, సూర్యాపేట జిల్లాలోని మునగాల, నాగారం మండలాల్లో వర్షం కురిసింది. వరంగల్‌, హన్మకొండలో ఎడతెరిపిలేన వర్షంతో నగరం తడిసిముద్దయ్యింది. మహబూబాబాద్‌ జిల్లా గార్ల, బయ్యారం, కురవి మండలాల్లో వర్షం కురిసింది.

అటు  గ్రేటర్‌లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.  రాగల మరో మూడు రోజులు గ్రేటర్‌లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.  గ్రేటర్‌ పరిధిలోని అబ్దుల్లాపూర్‌మెట్‌లో అత్యధికంగా 7.8 సెంటీమీటర్లు, అత్యల్పంగా మైలార్‌దేవ్‌పల్లిలో 1.0 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు టీఎస్‌డీపీఎస్‌ అధికారులు వెల్లడించారు.

- Advertisement -

Latest news

Related news

హైదరాబాద్‌ ని దేశంలోనే సేఫెస్ట్‌ సిటీగా తీర్చిదిద్దం

హైదరాబాద్‌లో పటిష్టమైన శాంతి భద్రతలు ఉన్నాయని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. హైదరాబాద్‌ మహానగరాన్ని దేశంలోనే సేఫెస్ట్‌ సిటీగా తీర్చిదిద్దుతున్నామన్నారు. ఈ మేరకు దేశంలో ఉన్న...

దక్షిణ భారతదేశంలోనే తొలి వేస్ట్‌ ఎనర్జీ ప్లాంట్‌ను ఏర్పాటు చేసినం

ప్రధాని నరేంద్ర మోదీ కంటే ముందుగానే సీఎం కేసీఆర్‌ స్వచ్ఛ్‌ హైదరాబాద్‌ కార్యక్రమాన్ని చేపట్టారని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. పారిశుధ్య నిర్వాహణలో హైదరాబాద్‌ దేశంలోనే ముందుందన్నారు . జీహెచ్‌ఎంసీ పరిధిలో...

ఆరేండ్లలో తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందింది- మంత్రి కేటీఆర్

ఆరేండ్లలో తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందిందని అన్నారు మంత్రి కేటీఆర్. స్వరాష్ట్రం ఏర్పడక ముందు హైదరాబాద్ లో ఉన్న అనిశ్చిత వాతావరణం ఇప్పుడు లేదని...

నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

దేశీయ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. గురువారం ఉదయం. ఉదయం 9.30 సమయంలో సెన్సెక్స్‌ 156 పాయింట్లు కోల్పోయి 44,023 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 37 పాయింట్ల నష్టంతో 12,900 వద్ద...