తెలంగాణ, దక్షిణ చత్తీస్ గఢ్ పరిసరాల్లో కొనసాగుతున్న అల్పపీడన ప్రభవంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది.హైదరాబాద్ లో రెండు గంటల్లో 11 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది.
బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, ఎర్రగడ్డ,ఎస్సార్ నగర్, ఖైరతాబాద్, అమీర్ పేట్, బేగంపేట్, సికింద్రాబాద్,కంటోన్మెంట్, ఆల్వాల్ లో భారీ వర్షం పడింది.మల్కాజ్ గిరి, తార్నాక, నాచారం, ఉప్పల్, మేడిపల్లిలో వాన కురిసింది. కోఠి, అబిడ్స్, నాంపల్లి, దిల్ షుక్ నగర్, ఎల్బీనగర్, హయత్ నగర్, సైదాబాద్, సంతోష్ నగర్, కంచన్ బాగ్, చాంద్రయణగుట్ట, లాల్ దర్వాజ, ఛత్రినాక, మంగల్ హట్, రాజేంద్రనగర్, మైలార్ దేవ్ పల్లి, అత్తాపూర్ లో భారీ వర్షం పడింది.
అటు ఉమ్మడి పాలమూరు, వికారాబాద్, యాదాద్రి భువనగిరి తదితర జిల్లాల్లో ఎడతెరపి లేకుండా వాన కురిసింది. వరదతో వాగులు ఉప్పొంగి ప్రవహించగా, చెరువులు అలుగులు పారుతున్నాయి. వికారాబాద్ జిల్లాలోని తాండూర్, పరిగి , కొడంగల్, పెద్దెముల్ ధారూర్ ప్రాంతాల్లో వర్షం పడింది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో నుంచి ఏకధాటిగా వర్షం కురిసింది. వనపర్తి, నాగర్కర్నూల్ జిల్లాలో కుండపోత కురిసింది. జోగుళాంబ గద్వాల, నారాయణపేట, మహబూబ్నగర్ జిల్లాలో భారీ వర్షం పడింది. నాగర్కర్నూల్ జిల్లాలో 60 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. దుందుభీ వాగు ఉద్ధృతంగా పారడంతో డిండి ప్రాజెక్టు నిండింది. చెరువులు నిండి మత్తడి పోస్తున్నాయి. వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.
జగిత్యాల జిల్లాలో భారీ వర్షం కురిసింది. జగిత్యాల పట్టణంతో పాటు.. పలు మండలాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వాన పడింది. భారీ వర్షానికి కాలనీలు జలమయమయ్యాయి. పొలాసలో నీరు తాగేందుకు చెరువులోకి దిగిన 20 బర్లు మత్తడి ప్రవాహంలో కొట్టుకుపోయాయి. ఇటీవల కురిసిన వానలతో ఎల్లమ్మ చెరువు మత్తడి దుంకుతున్నది..
మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో లోతట్లు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు.