28.6 C
Hyderabad
Wednesday, July 8, 2020

మరో రెండ్రోజులు వానలు

తెలంగాణలో మరో రెండు రోజులు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఈ నెల 8  వరకు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురువొచ్చని వాతావరణ కేంద్రం పేర్కొన్నది. మరోవైపు, నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి. ఇప్పటికే కేరళ మొత్తంతోపాటు పలు ప్రాంతాల్లో విస్తరించాయి. ఇవాళ్టి నుంచి ఆదివారం వరకు మధ్య అరేబియా సముద్రం, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, ఆగ్నేయ, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని పలు ప్రాంతాల్లోకి విస్తరించే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది.

అటు విదర్భ ప్రాంతంలో వాయుగుండం అల్పపీడనంగా మారింది. దీని ప్రభావంతో గ్రేటర్‌ హైదరాబాద్‌లో మూడ్రోజులు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని  వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దీని ప్రభావంతోనే గురువారం సాయంత్రం గ్రేటర్‌లోని పలుచోట్ల వర్షం కురిసింది. సికింద్రాబాద్‌ పాటిగడ్డలో అత్యధికంగా 1.1 సెంటీమీటర్లు, ఖైరతాబాద్‌, జూబ్లీహిల్స్‌లోని శ్రీనగర్‌కాలనీ, కీసరలోని దమ్మాయిగూడలో ఒక సెం.మీ. చొప్పున వర్షపాతం నమోదైందని టీఎస్‌డీపీఎస్‌ అధికారులు వెల్లడించారు.

- Advertisement -

Latest news

కరోనా మరణాల సంఖ్య తగ్గించడంపై కేజ్రీవాల్‌ సర్కార్‌ ఫోకస్‌

రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులు, మరణాలు దేశ రాజధాని ఢిల్లీని వణికిస్తున్నాయి. దీంతో కరోనా మృతుల సంఖ్యను తగ్గించడంపై కేజ్రీవాల్‌ ప్రభుత్వం దృష్టి పెట్టింది. గడిచిన రెండు వారాల్లో చనిపోయిన...

Related news

కరోనా మరణాల సంఖ్య తగ్గించడంపై కేజ్రీవాల్‌ సర్కార్‌ ఫోకస్‌

రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులు, మరణాలు దేశ రాజధాని ఢిల్లీని వణికిస్తున్నాయి. దీంతో కరోనా మృతుల సంఖ్యను తగ్గించడంపై కేజ్రీవాల్‌ ప్రభుత్వం దృష్టి పెట్టింది. గడిచిన రెండు వారాల్లో చనిపోయిన...

ఉత్తరప్రదేశ్‌ లో పెరుగుతున్న కరోనా కేసులు

ఉత్తర ప్రదేశ్‌ లో కరోనా తీవ్రత అంతకంతకు పెరగుతోంది. గడిచిన 24గంటల్లో రికార్డు స్థాయిలో 1346కొత్తకేసులు వెలుగులోకి వచ్చాయి.నిన్నటికి నిన్న 18మంది మృతి చెందగా మరణాల సంఖ్య 827కు చేరింది....

హిమాచల్‌ ప్రదేశ్‌ లో వికాస్‌ దూబే అనుచరుడి ఎన్‌ కౌంటర్‌

కాన్పూర్ గ్యాంగస్టర్ వికాస్ దూబే అనుచరుడు పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. హిమాచల్ ప్రదేశ్ లోని హమీర్ పూర్ లో అమర్ దూబేను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో...

24 గంటల్లో 22,752 కరోనా కేసులు

 భారత్‌ లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. రికార్డు స్థాయిలో నమోదు అవుతున్న కేసులు భయాందోళనకు గురి చేస్తున్నాయి. గడిచిన 24గంటల్లో 22వేల752 కొత్త కేసులు నమోదవడంతో మొత్తం కేసుల...