31.2 C
Hyderabad
Wednesday, July 8, 2020

మహమూద్‌ అలీకి ఈద్‌ శుభాకాంక్షలు చెప్పిన మంత్రులు

హైదరాబాద్‌: రాష్ట్రంలో రంజాన్‌ వేడుకలు నిరాడంబరంగా జరుగుతున్నాయి. రంజాన్‌ పండుగ జరుపుకుంటున్న ముస్లిం సోదరులకు రాష్ట్ర మంత్రులు శుభాకాంక్షలు తెలిపారు. కరోనా నేపథ్యంలో ఇంట్లోనే ఉండి ప్రార్థనలు, పండుగ వేడుకలు జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ఆబ్కారి శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ హోం మంత్రి మహమూద్‌ అలీ ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. పరమత సహనానికి, గంగాజమున తెహజీబ్‌కు ప్రతీక రంజాన్‌ అని, ఏ పండుగైనా మానవాళికి మంచిని బోధిస్తుందని మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి రంజాన్‌ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. అందరి ఇళ్లలో ఆనందం, శుభం కలగాలని కోరుకుంటున్నాని ఆమె చెప్పారు. ముస్లింలకు అల్లా సుఖశాంతులు ప్రసాదించాలని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఆకాంక్షించారు. కరోనా నేపథ్యంలో ఇండ్లవద్దే ప్రార్థనలు చేసి ఈద్‌ వేడుకలు జరుపుకోవాలని, కరోనా వైరస్‌ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి నిరంజన్‌ రెడ్డి అన్నారు. మత సామరస్యానికి ప్రతీక రంజాన్‌ అని మంత్రి మల్లారెడ్డి అన్నారు. ముస్లిం సోదరులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రజలు, ముస్లింలకు రంజాన్‌ శుభాకాంక్షలు తెలిపారు మంత్రి జగదీశ్‌రెడ్డి. 

కరోనా నేపథ్యంలో రంజాన్‌ పండుగను ఇండ్లలోనే జరుపుకోవాలని స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి సూచించారు. ప్రపంచం మొత్తం బాగుండేలా ప్రార్థించాలని కోరారు.

- Advertisement -

Latest news

గ్రీన్ ఇండియా ఛాలెంజ్…మొక్కలు నాటిన రాకింగ్ రాకేష్

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 3వ విడతలో భాగంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో పౌండర్ రాఘవ విసిరిన గ్రీన్ చాలెంజ్...

Related news

గ్రీన్ ఇండియా ఛాలెంజ్…మొక్కలు నాటిన రాకింగ్ రాకేష్

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 3వ విడతలో భాగంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో పౌండర్ రాఘవ విసిరిన గ్రీన్ చాలెంజ్...

చెట్లును రక్షించకపోతే…. గాలిని కొనుక్కోవాల్సిందే

చెట్లను కాపాడుకోకపోతే, భవిష్యత్తులో గాలిని కూడా కొనుక్కునే రోజులు వచ్చే ప్రమాదముందని మంత్రి కేటీఆర్‌ హెచ్చరించారు. తెలంగాణలోని హరిత శాతాన్ని పెంచేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి అని అన్నారు. ప్రతి...

తెలంగాణ అస్థిత్వాన్ని దెబ్బతీస్తే ఊరుకోం

సొంత గడ్డకు ద్రోహం చేయడమే తెలంగాణ కాంగ్రెస్ నేతల నైజమని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై విషం...

వరుసగా ఆరో రోజు..అదే జోరు

వరుసగా ఆరో రోజు స్టాక్‌ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్‌ 86 పాయింట్ల లాభంతో 36వేల 743 వద్ద కొనసాగుతుండగా.. నిఫ్టీ 22 పాయింట్లు...