22.4 C
Hyderabad
Tuesday, October 27, 2020

మహిళా సంఘాలకు కొవిడ్‌-19 రుణాలు

వికారాబాద్ : కరోనా  నేపథ్యంలో సామాన్యులు ఇబ్బందులు పడకుండా బ్యాంకుల ద్వారా మహిళా సంఘాలకు కొవిడ్‌-19 రుణాలు అందజేసేందుకు సెర్ప్‌ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.  మండలంలో 1100లకు పైగా మహిళా సంఘాలున్నాయి. అందులో కొవిడ్‌-19 బ్యాంకు రుణాలకు అర్హత ఉన్న 859 మహిళా సంఘాలకు రుణాలు అందించాలని  అధికారులు   నిర్ణయించారు.   గ్రామాల్లో ఇప్పటికే   మహిళా సంఘాలకు రుణాలు అందించేందుకు సెర్ప్‌ సిబ్బంది బ్యాంకులకు డాక్యుమెంట్లు సమర్పించారు.  మండలంలో ఎస్‌బీఐతో పాటు తెలంగాణ గ్రామీణ బ్యాంకు, చౌడాపూర్‌, ముజాహిద్‌పూర్‌ తెలంగాణ గ్రామీణ బ్యాంకులు రుణాలు అందిస్తున్నాయి.

ప్రతి సభ్యురాలికి రూ. 5వేలు రుణం..

మహిళా సంఘాల్లోని ప్రతి మహిళకు రూ. 5వేల కొవిడ్‌ రుణం అందించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. సిబ్బంది బ్యాంకులకు మహిళా సంఘాలకు సంబంధించి డాక్యుమెంట్‌ అందజేస్తుండటంతో బ్యాంకర్లు కూడా రుణాలు మంజూరు చేస్తున్నారు. దీంతో మహిళా సంఘంలోని ప్రతి మహిళకు రూ.5 వేల రుణం  అందుతుంది. కాగా తీసుకున్న రుణాలు 18 వాయిదాల్లో చెల్లించాల్సి ఉంటుంది. ప్రతి నెల రూ. 300 తీసుకున్న కొవిడ్‌ రుణానికి వాయిదా చెల్లించాలి. 

- Advertisement -

Latest news

Related news

జియాగూడలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ప్రారంభించిన మంత్రి కేటీఆర్

హైదరాబాద్ జియాగూడలోని పేదలకు ప్రభుత్వం దసరా కానుక అందజేసింది. అంబేద్కర్ నగర్ లో ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇండ్లను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. 840 రెండు పడక...

దేశంలో 79లక్షలు దాటిన కరోనా కేసులు

భారత్ లో కరోనా తీవ్రత తగ్గుతుందని తెలిపింది కేంద్ర ఆరోగ్యశాఖ. దేశవ్యాప్తంగా బాధితుల సంఖ్య 79లక్షలకు చేరువైంది. గత 24గంటల్లో 45వేల 149కొత్త కేసులు నమోదు అయితే.. మొత్తం కేసుల...

పాకిస్థాన్‌లో భూకంపం

పాకిస్థాన్‌లో ఇవాళ‌ తెల్లవారుజామున భూకంపం సంభవించింది. దీనితీవ్ర‌త రిక్టర్ స్కేలుపై 4.8గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ ప్ర‌క‌టించింది. ఈరోజు ఉద‌యం 4.14 గంటలకు భూకంపం సంభవించింద‌ని, భూ...