28.4 C
Hyderabad
Thursday, October 1, 2020

మాజీ ఎంపీ నంది ఎల్లయ్య కన్నుమూత

కాంగ్రెస్ కురువృద్ధ నేత, బడుగు- బలహీన వర్గాల గొంతుకను బలంగా వినిపించిన మాజీ ఎంపీ నంది ఎల్లయ్య ఇక లేరు. ఆయన కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆరోగ్యం విషమించడంతో చికిత్స పొందుతూ కన్నుమూశారు.

దళిత సామాజిక వర్గానికి చెందిన నంది ఎల్లయ్య 1942 లో హైదరాబాద్ లో జన్మించారు. మెట్రిక్యులేషన్ వరకు చదువుకున్నారు. కాంగ్రెస్ తో ఆయన రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. 1977లో తొలిసారి సిద్దిపేట నుంచి గెలిచి లోక్ సభలో అడుగు పెట్టారు నంది ఎల్లయ్య. అనంతరం 1980లో మరోసారి కాంగ్రెస్ తరపున పోటీచేసి విజయం సాధించారు. 1984లో ఓడిపోయినా.. 1989 లో సిద్దిపేట నుంచి మూడో పర్యాయం గెలుపొందారు. ఆ తర్వాత 1991, 1996 లోనూ అదే స్థానం నుంచి గెలిచి సత్తా చాటారు. ఆ తర్వాత మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ఆయనకు అక్కడ్నుంచి పోటీ చేసే అవకాశం రాలేదు. దీంతో కాంగ్రెస్ అధిష్టానం రాజ్యసభ సభ్యుడిగా అవకాశం కల్పించింది. రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగాను ఎన్నికయ్యారు. మధ్యలో ఒకసారి ఎమ్మెల్సీగాను సేవలందించారు. 2014 ఎన్నికల్లో నాగర్ కర్నూల్ నుంచి కాంగ్రెస్ ఎంపీగా మరోసారి విజయం సాధించారు. మొత్తంగా ఆరుసార్లు లోక్ సభ, రెండుసార్లు రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించడంతో పాటు ఒకసారి ఎమ్మెల్సీగాను పనిచేశారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఆయన ప్రముఖ దళిత నేతగా గుర్తింపు పొందారు. ఆ మంచిపేరే ఆయనను కాంగ్రెస్ అగ్రనేతలకు దగ్గర చేసింది. మచ్చలేని రాజకీయ నాయకుడిగా పేరున్న నంది ఎల్లయ్యకు పార్టీలకతీతంగా పలువురు నేతలతో మంచి సంబంధాలున్నాయి. అయితే కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆరోగ్యం విషమించడంతో తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు.

నంది ఎల్లయ్య మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా ఎల్లయ్య మృతిపై ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

- Advertisement -

Latest news

యూపీలో శాంతి భద్రతలు అదుపుతప్పాయి: మాయావతి

వ‌రుస అత్యాచార ఘ‌ట‌న‌ల‌పై బీఎస్పీఅధినేత్రి మాయావ‌తి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. యూపీలో శాంతి భ‌ద్ర‌త‌లు అదుపు త‌ప్పాయ‌ని ఆరోపించిన ఆమె.. బీజేపీ పాల‌న‌లో నేర‌స్తులు రెచ్చిపోతున్నారన్నారు. వరుస ఘటనలకు బాధ్యత వహిస్తూ...

Related news

యూపీలో శాంతి భద్రతలు అదుపుతప్పాయి: మాయావతి

వ‌రుస అత్యాచార ఘ‌ట‌న‌ల‌పై బీఎస్పీఅధినేత్రి మాయావ‌తి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. యూపీలో శాంతి భ‌ద్ర‌త‌లు అదుపు త‌ప్పాయ‌ని ఆరోపించిన ఆమె.. బీజేపీ పాల‌న‌లో నేర‌స్తులు రెచ్చిపోతున్నారన్నారు. వరుస ఘటనలకు బాధ్యత వహిస్తూ...

లైంగిక వేధింపుల కేసులో పోలీసుల ముందుకు అనురాగ్‌ కశ్యప్‌

లైంగిక వేధింపుల కేసులో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న బాలీవుడ్ ఫిల్మ్ డైర‌క్ట‌ర్ అనురాగ్ క‌శ్య‌ప్ ..  ముంబైలోని వెర్సోవా పోలీసుల ముందు హాజరయ్యారు. న‌టి పాయల్ ఘోష్  ఆరోపణలతో పలు విషయాలపై...

రాష్ట్రపతికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్

రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ 75వ వసంతం లోకి అడుగుపెట్టిన సందర్భంగా సీఏం కేసీఆర్ రాష్ట్రపతికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్ గారికి హార్థిక జన్మదిన శుభాకాంక్షలు....

దేశంలో 24 గంటల్లో 86,821 కరోనా కేసులు

దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా కరోనా మరణాల సంఖ్య లక్షకు చేరువైంది. నిన్నటికి నిన్న 1వెయ్యి 181 మంది మృతి చెందగా.. ఇప్పటి వరకు కరోనా కాటుకు బలైనవారి సంఖ్య 98వేల678...