22.6 C
Hyderabad
Thursday, August 13, 2020

ముఖ్యమంత్రి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాను: హోం మంత్రి మహమూద్ అలీ

తెలంగాణ నూతన సెక్రటేరియట్ నిర్మాణంలో భాగంగా కొత్త మసీదును, దేవాలయాన్ని నిర్మించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తీసుకున్న నిర్ణయాన్ని  స్వాగతిస్తున్నానని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ తెలిపారు. ప్రస్తుతం పాత సెక్రటేరియట్  భవనంలో ఉన్న మసీదు ,దేవాలయాల కన్నా పెద్ద స్థాయిలో వాటిని నిర్మించేందుకు సెక్యులర్ నాయకుడైన ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవడం దీనికి సంబంధించి త్వరలోనే నిర్వాహకులతో మాట్లాడేందుకు సమావేశాలు నిర్వహించనుండడం పట్ల హోంమంత్రి హర్షం వ్యక్తం చేశారు. నూతన సెక్రటేరియట్  భవనాన్ని అధునాతన స్థాయిలో నిర్మించడం పట్ల అది ప్రజలకు మరింత ఉపయోగకరంగా ఉంటుందని హోం మంత్రి అన్నారు. నూతన భవనం లో సాంకేతిక, ఇతర సౌకర్యాలు తో కూడిన సదుపాయాలు ఉండడం వల్ల ప్రజలకు, ప్రభుత్వ ఉద్యోగులకు ప్రయోజనకరమని హోం మంత్రి తెలియజేశారు.మసీదు, దేవాలయాలు కూడా భారీ ఎత్తున నిర్మించాలని ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాన్ని హోం శాఖ మంత్రి  మహమ్మద్  మహమూద్ అలీ స్వాగతించారు.

- Advertisement -

Latest news

పారదర్శక పన్నుల విధాన వేదికను లాంచ్‌ చేసిన ప్రధాని మోడీ

దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. పన్నుల వ్యవస్థలో సంస్కరణలు తెచ్చేందుకు పారదర్శక పన్నుల విధాన వేదికను అందుబాటులోకి తెచ్చింది. ఈ కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్‌...

Related news

పారదర్శక పన్నుల విధాన వేదికను లాంచ్‌ చేసిన ప్రధాని మోడీ

దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. పన్నుల వ్యవస్థలో సంస్కరణలు తెచ్చేందుకు పారదర్శక పన్నుల విధాన వేదికను అందుబాటులోకి తెచ్చింది. ఈ కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్‌...

టాంజానియాలో భారీ భూకంపం..

టాంజానియాలో భారీ భూకంపం సంభవించింది. దారస్‌ ఎస్‌ సలామ్‌ కి 80కిమీ దూరంలో 30 నిమిషాల వ్యవధిలో రెండు సార్లు భూప్రకంపనలు వచ్చాయి. రిక్టర్‌ స్కేల్‌ పై తీవ్రత 6.0గా...

మేధా రైల్ కోచ్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేసిన మంత్రి కేటీఆర్

రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి కొండకల్ వద్ద 100 ఎకరాలు  ఎనిమిది వందల కోట్ల వ్యయంతో చేపట్టిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్...

హెచ్‌1బీ వీసాల విషయంలో వెనక్కి తగ్గిన ట్రంప్‌

అధ్యక్ష ఎన్నికలు దగ్గర పడుతుండడంతో ట్రంప్‌ కాస్త మెత్తబడ్డారు. ఇన్నాళ్లు హెచ్‌1బీ వీసాల విషయంలో కఠినంగా వ్యవహరించిన ఆయన కార్పొరెట్‌ దిగ్గజాల వ్యతిరేకతతో దిగొచ్చారు. నీషేదం గడవు కంటే ముందే ...