31.2 C
Hyderabad
Wednesday, July 8, 2020

ముఖ్యమంత్రి మాటకే జైకొడుతామని ప్రతిజ్ఞ

నమస్తే తెలంగాణ నెట్‌వర్క్‌: అన్నదాతల మేలుకోరి ప్రభుత్వం ప్రతిపాదించిన నియంత్రిత పంటల సాగు విధానానికి రాష్ట్రవ్యాప్తంగా మద్దతు పెరుగుతున్నది. విభిన్న పంటల సేద్యానికి ‘సారు’ చెప్పిన బాటలో తాము ‘సాగు’తామంటూ ఊరుమ్మడిగా తీర్మానాలు చేస్తున్నారు. ప్రభుత్వం చెప్పిన పంటవేసి గిట్టుబాటు ధర పొందుతామంటూ ప్రతిజ్ఞలు చేస్తున్నారు. సోమవారం వివిధ జిల్లాల్లోని 149 గ్రామాల రైతులు తమ సంపూర్ణ మద్దతు తెలుపగా.. మంగళవారం ఏకంగా 204 పల్లెలు తామూ నియంత్రిత సాగుకుసై అని ప్రకటించాయి. ఈ మేరకు సంగారెడ్డి జిల్లాలో 103 గ్రామాలు,  సిద్దిపేట- 70, మెదక్‌-17,  కరీంనగర్‌-4, సూర్యాపేట -4, జగిత్యాల-3, కామారెడ్డి-2, నాగర్‌కర్నూల్‌లో ఒకగ్రామం ప్రభుత్వం సూచించిన పంటలే సాగు చేస్తామంటూ తీర్మానించాయి. 

ఊరూరా.. తీర్మానాల జోరు 

నియంత్రిత పంటల సాగు విధానానికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ గ్రామాలన్నీ ఏకమవుతున్నాయి. సీఎం కేసీఆర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్‌ నియోజకవర్గం రాష్ట్రానికే ఆదర్శంగా నిలిచింది. ఈ నియోజకవర్గ పరిధిలోని 173  గ్రామాల రైతులు నియంత్రిత సేద్యానికి మద్దతుగా మూకుమ్మడి తీర్మానాలు చేసి అధికారులకు అందించారు.  మంగళవారం సిద్దిపేట జిల్లాలో 70 గ్రామాలు మద్దతు పలుకగా అందులో సిద్దిపేట నియోజకవర్గంలో 18, దుబ్బాకలో 13, హుస్నాబాద్‌లో 08, జనగామలో 07 గ్రామాలతోపాటు గజ్వేల్‌ నియోజకవర్గంలోని 24 గ్రామాల రైతులు ప్రతిజ్ఞ చేశారు. సంగారెడ్డి జిల్లాలో 103 గ్రామ పంచాయతీలు మద్దతుగా ఏకగ్రీవ తీర్మానం చేశాయి. మెదక్‌ జిల్లాలో 17 గ్రామాల ప్రజలు సైతం ప్రతిజ్ఞ చేశారు. గజ్వేల్‌ నియోజకవర్గ పరిధిలోని దాతర్‌పల్లి, చిన్నకోడూరు మండలం గోనెపల్లిలో ఆర్థికమంత్రి తన్నీరు హరీశ్‌రావు నూతన సాగు విధానంపై రైతులకు అవగాహన కల్పించారు.  చేర్యాల, కొమురవెల్లిలో జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, గజ్వేల్‌ నియోజకవర్గంలో సిద్దిపేట జెడ్పీ చైర్‌పర్సన్‌ వేలేటి రోజాశర్మ, ఎఫ్‌డీసీ చైర్మన్‌ వంటేరు ప్రతాప్‌రెడ్డి, డీసీసీబీ చైర్మన్‌ చిట్టి దేవేందర్‌రెడ్డి రైతులకు అవగాహన కల్పించారు.  

సర్కారు చెప్పినట్లు వింటం

రాష్ర ్టప్రభుత్వం సూచించినట్టు నియంత్రిత పద్ధతిలో సాగుచేస్తామని కరీంనగర్‌ రైతులు ప్రతినబూనుతున్నారు. మంగళవారం కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ మండలం ధర్మరాజుపల్లి, వీణవంక మండలం మామిడాలపల్లి, జమ్మికుంట మండలం కేశవాపూర్‌, ఇల్లందకుంట మండలకేంద్రాల్లో రైతులు ప్రభుత్వ నిర్ణయానికి ప్రతిజ్ఞచేసి మద్దతు తెలిపారు. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం జైన, తిమ్మాపూర్‌, కథలాపూర్‌ మండలం బొమ్మెన.. కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం కోర్పోల్‌, కోటగిరి మండలం రాంపూర్‌లో రైతులు ప్రతిజ్ఞ చేశారు. సూర్యాపేట జిల్లా సూర్యాపేట మండలంలోని పిల్లలమర్రి, మునగాల మండలం నేలమర్రి, కోదాడ, మద్దిరాల మండలకేంద్రాల్లో రైతులు నియంత్రిత సాగు విధానం పాటిస్తామని ప్రతిజ్ఞ చేసి సర్కారుకు అండగా నిలుస్తామని ప్రకటించారు.

మక్కలు వేయం

సీఎం కేసీఆర్‌ సూచనలు పాటిస్తామని.. వానకాలంలో మక్కలు సాగుచేయమని నాగర్‌కర్నూల్‌ జిల్లా తిమ్మాజిపేట రైతులు ప్రకటించారు. మంగళవారం గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద సర్పంచ్‌ వేణుగోపాల్‌గౌడ్‌ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించి ముఖ్యమంత్రి నిర్ణయానికి మద్దతు పలికారు.  

- Advertisement -

Latest news

గ్రీన్ ఇండియా ఛాలెంజ్…మొక్కలు నాటిన రాకింగ్ రాకేష్

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 3వ విడతలో భాగంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో పౌండర్ రాఘవ విసిరిన గ్రీన్ చాలెంజ్...

Related news

గ్రీన్ ఇండియా ఛాలెంజ్…మొక్కలు నాటిన రాకింగ్ రాకేష్

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 3వ విడతలో భాగంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో పౌండర్ రాఘవ విసిరిన గ్రీన్ చాలెంజ్...

చెట్లును రక్షించకపోతే…. గాలిని కొనుక్కోవాల్సిందే

చెట్లను కాపాడుకోకపోతే, భవిష్యత్తులో గాలిని కూడా కొనుక్కునే రోజులు వచ్చే ప్రమాదముందని మంత్రి కేటీఆర్‌ హెచ్చరించారు. తెలంగాణలోని హరిత శాతాన్ని పెంచేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి అని అన్నారు. ప్రతి...

తెలంగాణ అస్థిత్వాన్ని దెబ్బతీస్తే ఊరుకోం

సొంత గడ్డకు ద్రోహం చేయడమే తెలంగాణ కాంగ్రెస్ నేతల నైజమని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై విషం...

వరుసగా ఆరో రోజు..అదే జోరు

వరుసగా ఆరో రోజు స్టాక్‌ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్‌ 86 పాయింట్ల లాభంతో 36వేల 743 వద్ద కొనసాగుతుండగా.. నిఫ్టీ 22 పాయింట్లు...