31.2 C
Hyderabad
Wednesday, July 8, 2020

మూడు నెలలుగా రేషన్‌ తీసుకోని వారికి ఒకే సారి 3 వేలు

గత మూడు నెలలుగా రేషన్‌ తీసుకోని దాదాపు 2 లక్షల మంది తెల్ల రేషన్‌ కార్డుదారులకు కూడా ఆర్థిక సాయాన్ని ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఎప్రిల్‌, మే నెలలకు నిరుపేదలకు ప్రభుత్వం అందించిన నెలకు రూ.1500 లను ఒకేసారి రూ.3000 అందించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ మొత్తాన్ని వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం లేదా పోస్టాఫీస్‌ ద్వారా వారికి అందజేయనున్నారు. జనవరి నుంచి మార్చి వరకు మూడు నెలలు రేషన్‌ దుఖానాలలో 12 కిలోల ఉచిత బియ్యం తీసుకోని వారికి ఆర్థిక సాయం రూ.1500 ఇవ్వకూడదని గతంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

అయితే ప్రస్తుతం అప్పుడు బియ్యం తీసుకోని వారికి కూడా ఆర్థిక సహాయం చేయాలని హైకోర్టు సూచనలతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ఈ మొత్తాన్ని లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. ఇందులో భాగంగా మరో 2.08 లక్షల మంది ప్రజలు ఈ ఆర్థిక సాయాన్ని పొందనున్నారు. దీనికోసం ప్రభుత్వం అదనంగా 62.4 కోట్లు విడుదల చేసింది. ఇప్పటికే 74 లక్షల మందికి ప్రభుత్వం రూ.2227 కోట్ల రూపాయలను అందజేసింది.

- Advertisement -

Latest news

గ్రీన్ ఇండియా ఛాలెంజ్…మొక్కలు నాటిన రాకింగ్ రాకేష్

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 3వ విడతలో భాగంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో పౌండర్ రాఘవ విసిరిన గ్రీన్ చాలెంజ్...

Related news

గ్రీన్ ఇండియా ఛాలెంజ్…మొక్కలు నాటిన రాకింగ్ రాకేష్

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 3వ విడతలో భాగంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో పౌండర్ రాఘవ విసిరిన గ్రీన్ చాలెంజ్...

చెట్లును రక్షించకపోతే…. గాలిని కొనుక్కోవాల్సిందే

చెట్లను కాపాడుకోకపోతే, భవిష్యత్తులో గాలిని కూడా కొనుక్కునే రోజులు వచ్చే ప్రమాదముందని మంత్రి కేటీఆర్‌ హెచ్చరించారు. తెలంగాణలోని హరిత శాతాన్ని పెంచేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి అని అన్నారు. ప్రతి...

తెలంగాణ అస్థిత్వాన్ని దెబ్బతీస్తే ఊరుకోం

సొంత గడ్డకు ద్రోహం చేయడమే తెలంగాణ కాంగ్రెస్ నేతల నైజమని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై విషం...

వరుసగా ఆరో రోజు..అదే జోరు

వరుసగా ఆరో రోజు స్టాక్‌ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్‌ 86 పాయింట్ల లాభంతో 36వేల 743 వద్ద కొనసాగుతుండగా.. నిఫ్టీ 22 పాయింట్లు...