28.4 C
Hyderabad
Thursday, October 29, 2020

మైలార్ దేవ్ పల్లిలో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి: సీపీ సజ్జనార్

భారీ వర్షాలతో అతలాకుతలమైన మైలార్ దేవ్ పల్లిలో ప్రస్తుతం సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయని కలెక్టర్ అమోయ్‌ కుమార్, సైబరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. రేపటి వరకు అన్ని పనులు పూర్తై.. ప్రజలకు అందుబాటులోకి వస్తాయన్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మైలార్ దేవ్ పల్లిలోని పల్లెచెరువును కలెక్టర్ అమోయ్ కుమార్, సైబరాబాద్ సీపీ సజ్జనార్ సందర్శించి, పరిస్థితిని పరిశీలిస్తున్నారు. తీసుకోవాల్సిన చర్యలను దగ్గరుండీ సమీక్షిస్తున్నారు. నిన్నమొన్నటి భారీ వర్షాలు, వరదలకు పల్లెచెరువు కట్ట కోతకు గురి కాగా… ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమై తక్షణం రక్షణ చర్యలు తీసుకోవడంతో గండం గడిచింది. ప్రస్తుతం అక్కడ ఇంకా నిలిచి ఉన్న నీటిని తొలగించడంతోపాటు పల్లె చెరువు కట్ట, రోడ్ల పనులు జరుగుతున్నాయి. మునుపటి పరిస్థితులు నెలకొనేలా అధికారులు, పోలీసులు, ఇతర సిబ్బంది కృషి చేస్తున్నారు. 

- Advertisement -

Latest news

Related news

ఎమ్మెల్సీగా ప్ర‌మాణ‌స్వీకారం చేసిన క‌ల్వ‌కుంట్ల‌ క‌విత

నిజా‌మా‌బాద్‌ స్థానిక సంస్థల ఎమ్మె‌ల్సీగా కల్వ‌కుంట్ల కవిత గురు‌వారం మ‌ధ్యాహ్నం ప్రమాణం స్వీకారం చేశారు. శాస‌న‌స‌మం‌డలి దర్బార్ హాల్‌లో మధ్యాహ్నం 12.45 గంట‌లకు మండలి చైర్మన్‌ గుత్తా సుఖేం‌ద‌ర్‌‌రెడ్డి.. ఆమె...

ధ‌ర‌ణి పోర్ట‌ల్‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్

ధరణి పోర్టల్ ను సీఎం కేసీఆర్  ప్రారంభించారు. రాష్ట్ర ప్రజానీకం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ధరణి పోర్టల్ నేటి నుంచి అందుబాటులోకి రాబోతున్నది. రెవెన్యూ సేవలను సులభంగా, పారదర్శకంగా అందించాలనే...

స‌మాజ్‌వాదీ పార్టీతో ఇక ఎలాంటి పొత్తులు ఉండ‌వు

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌ లో ఎస్పీ, బీఎస్పీల మిత్రుత్వానికి ఫుల్‌ స్టాప్ ప‌డింది. స‌మాజ్‌వాదీ పార్టీతో ఇక ఎలాంటి పొత్తులు ఉండ‌వ‌ని బీఎస్పీ అధినేత్రి మాయావ‌తి ప్ర‌క‌టించారు. గ‌త లోక్‌స‌భ ఎన్నిక‌ల స‌మ‌యంలో...

చెన్నై నగరాన్ని అతలాకుతలం చేస్తోన్న భారీ వర్షాలు

భారీ వర్షాలు చెన్నై నగరాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. బుధవారం రాత్రి నుంచి మహానగరంలో ఎడతెరపిలేకుండా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. తిరువాన్మియూర్, మైలాపూర్, రాయపెట్ట, అడయార్‌ లలో వర్షాలు కురుస్తున్నాయి. కుండపోతగా...