18 C
Hyderabad
Friday, November 27, 2020

యాదాద్రి ఆలయ నిర్మాణ పనులపై సీఎం సమీక్ష

దేశంలోని ప్రతిష్టాత్మక పుణ్యక్షేత్రాల స్థాయిలో యాదాద్రిని తీర్చిదిద్దుతున్నామన్నారు సీఎం కేసీఆర్.  ప్రపంచ వ్యాప్తంగా భక్తులు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్ర ప్రారంభం ఎప్పుడు జరుగుతుందా అని ఆసక్తితో ఎదురు చూస్తున్నారని చెప్పారు.  కరోనా పరిస్థితుల నుంచి రాష్ట్రం కోలుకుంటున్నదని..ఆలయ నిర్మాణాలకు సంబంధించి ఆర్థిక వనరులను ప్రభుత్వం ఎప్పటికప్పుడు అందజేస్తున్న నేపథ్యంలో పనుల్లో వేగం పెరగాల్సి ఉందని సీఎం సూచించారు. రెండు మూడు నెలల్లో యాదాద్రిని ప్రారంభించుకునే దిశగా  ఆలయ అధికారులు పూనుకోవాల్సి ఉందనన్నారు. యాదాద్రి ఆలయంతోపాటు పరిసరాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలని సూచించారు. యాదాద్రి ఆలయ నిర్మాణ పనుల పురోగతిపై సీఎం కేసీఆర్‌ ప్రగతిభవన్‌లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, సీఎస్ సోమేశ్ కుమార్ తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.

యాదాద్రి దేవాలయ ప్రాంగణంతోపాటు టెంపుల్ టౌన్, కాటేజీల నిర్మాణాలు, బస్టాండ్ తదితర పలు నిర్మాణాల పురోగతి గురించి సీఎం చర్చించారు. యాదాద్రి చుట్టుపక్కల పరిసర ప్రాంతాల సుందరీకరణ, లాండ్ స్కేపింగ్ అంశాలు ఎలా వుండాలో అధికారులకు వివరించారు. గుట్టమీదికి బస్సులు వెళ్ళే మార్గాల నిర్మాణం, వీఐపీ కార్ పార్కింగ్ నిర్మాణం, కళ్యాణ కట్ట, పుష్కరిణీ ఘాట్లు, బ్రహ్మోత్సవ, కళ్యాణ మండపాల నిర్మాణాలపై సీఎం సమీక్షించారు. పోలీస్ అవుట్ పోస్టు, అన్నప్రసాదం కాంప్లెక్స్, షాపింగ్ కాంప్లెక్స్, నిర్మాణాల పురోగతిని సమీక్షించారు. క్యూలైన్ కాంప్లెక్స్ నిర్మాణం సహా ఆలయ తుదిమెరుగులకు అయోధ్య, అక్షరధామ్ వంటి పుణ్యక్షేత్రాలకు మెరుగులు దిద్దిన అనుభజ్జులైన శిల్పులతోనే పనులు చేయించాలని అధికారులను సీఎం ఆదేశించారు.

ప్రస్తుతం ఉన్న ఆర్టీసీ బస్టాండ్ డిపో స్థలాన్ని దేవాలయ నిర్మాణ అవసరాలకోసం వినియోగించుకుంటున్న నేపథ్యంలో ఆర్టీసీ బస్టాండు నిర్మాణం కోసం గుట్ట సమీపంలో  ఏడు ఎకరాల స్థలాన్ని కేటాయిస్తున్నట్టు సీఎం ప్రకటించారు. ఈ మేరకు రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌కు ఫోన్ చేసి బస్టాండు నిర్మాణ పనులను ఆలయ నిర్మాణ నియమాలను అనుసరించి ఆధ్యాత్మికత  ఉట్టిపడేలా నిర్మించుకోవాలని తెలిపారు. అందుకు ఆరఅండ్‌బీ మంత్రిత్వ శాఖతో సమన్వయం చేసుకుని పనులు ప్రారంభించాలన్నారు. 11 ఎకరాల స్థలంలో మూడువేలకు పైగా కార్లు పట్టేలా పార్కింగు ఏర్పాటు చేయాలన్నారు సీఎం కేసీఆర్.

పూర్తిగా వెజిటేరియన్ ఫుడ్ అందించే ఫుడ్ కోర్టులను నిర్మించాలని, ఇందులో సౌత్ ఇండియన్ వంటకాలతో పాటు నార్త్ ఇండియన్,  అంతర్జాతీయ కాంటినెంటల్ భక్తులకోసం వంటకాలను అందించాలన్నారు సీఎం కేసీఆర్. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కు అత్యంత సమీపంలో ఉండడంతో, యాదాద్రి పుణ్యక్షేత్రానికి ప్రాధాన్యత మరింతగా పెరుగుతుందని, దేశ విదేశాలనుంచి హైదరాబాద్ కు వచ్చిన పర్యాటక భక్తులు యాదాద్రిని దర్శించే అవకాశాలుంటాయని సీఎం తెలిపారు. ఎక్కడ ఖాళీ జాగ కనిపిస్తే అక్కడ పెద్ద పెద్ద చెట్లతో భవిష్యత్తు పచ్చదనం శోభిల్లే విధంగా మొక్కలను నాటాలన్నారు. వేప, రావి, సిల్వర్ వోక్ తదితర ఎత్తుగా పెరిగే చెట్ల ను నాటాలన్నారు. యాదాద్రికి చేరువలో వున్న గండి చెరువును అత్యద్భుతమైన లాండ్ స్కేపింగుతో వాటర్ ఫౌంటెన్లతో తీర్చిదిద్దాలన్నారు. బ్రహ్మోత్సవాలు తెప్పోత్సవాలను నిర్వహించుకునేందుకు వీలైన విధంగా సుందరీకరణ పనులుండాలన్నారు. పంచనారసింహ స్వామి మూర్తులను తీర్చిదిద్దాలన్నారు.

యాదాద్రి టెంపుల్ సిటీలో 250 డోనార్ కాటేజీలను అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దాలని సీఎం అన్నారు. ప్రతి యాభై కాటేజీలకు ప్రత్యేక డిజైన్లతో భక్త ప్రహ్లాద సహా అమ్మవార్ల పేర్లను కాటేజీలకు పెట్టుకోవాలన్నారు.  కుటుంబాలతో దర్శనానికి వచ్చే భక్తజనానికి ప్రశాంతత కల్పించే విధంగా,  యాదాద్రి పుణ్యక్షేత్ర పునర్దర్శనం పట్ల భక్తులకు ఆసక్తి పెరిగే విధంగా విశాలమైన పచ్చని స్థలాల్లో  వాటిని నిర్మించాలన్నారు. ప్రెసిడెన్షియల్ సూట్ నిర్మాణంపై సీఎం ఆరా తీసారు. వీఐపీలతోపాటు సామాన్యుల దాకా బసచేసేందుకు వీలయ్యే రీతిలో వివిధ రకాల కాటేజీలను నిర్మించాలన్నారు. వేలాది మంది హాజరయ్యే విధంగా కళ్యాణ మండపాల నిర్మాణాలుండాలన్నారు. పుణ్యక్షేత్ర ప్రాంగణంలో ఆధ్యాత్మిక ప్రసంగాలు,  స్వాములతో ప్రవచనాలను కొనసాగించేందుకు లక్షలాది మంది కూర్చునే విధంగా తొంభై ఎకరాల్లో భక్తి ప్రాంగణాన్ని నిర్మించాలని సిఎం చెప్పారు. దేవాలయ విమాన గోపురాన్ని బంగారు తాపడంతో తీర్చిదిద్దాలన్నారు. రింగు రోడ్డు నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టరును సీఎం కేసీఆర్ ఆదేశించారు.   

- Advertisement -

Latest news

Related news

కేంద్రం ఇచ్చే నిధులపై తెలంగాణ బతకడం లేదు: ఎంపీ నామా

కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటోందని తెరాప లోక్ సభ పక్ష నేత నామ నాగేశ్వర్ రావు ఆరోపించారు.  తెలంగాణ భవన్ లో ఏర్ఫాటు  చేసిన మీడియా సమావేశాం లో...

గుజరాత్ లోని కోవిడ్ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం, ఆరుగురు మృతి

గుజరాత్ లోని రాజ్ కోట్ లోని ఉదయ్ శివానంద్ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదంలో మంటల దాటికి ఆరుగురు మృత్యువాత పడ్డారు, ప్రమాద సమయంలో ఆస్పత్రిలో 33 మంది...

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్

ఆస్ట్రేలియాలో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియాపై టాస్ గెలిచి ఆసీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. కరోనా వైరస్ నేపథ్యంలో చాలా రోజుల తరువాత టీమిండియా బ్లూజెర్సీతో మైదానంలో కనిపిస్తోంది.ఈ మ్యాచ్‌లో టాస్...

దేశంలో 93 లక్షలు దాటిన కరోనా కేసులు

దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. బాధితుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. గడిచిన 24గంటల్లో 43 వేల 082 కొత్త కేసులు వెలుగులోకి రాగా.. మొత్తం కేసుల సంఖ్య 93లక్షల 09వేల...