యాసంగిలో అమలు చేయాల్సిన నిర్ణిత పంటల సాగు విధానం, గ్రామాల్లోనే పంటల కొనుగోలు చేయడంపై శనివారం ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించనున్నరు. మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రారంభయ్యే సమావేశంలో వ్యవసాయ, పౌరసరఫరాల శాఖల మంత్రులు, సీనియర్ అధికారులు పాల్గొంటారు. యాసంగిలో ఏ పంట వేయాలి? ఏ పంట వేయొద్దు? ఏ పంట వేస్తే లాభం? ఏ పంట వేస్తే నష్టం? తదితర అంశాలపై సమీక్ష నిర్వహిస్తారు.
కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున మక్కలను దిగుమతి చేసుకుంటోంది. దీని వల్ల దేశంలో మక్కల కొనుగోలుపై ప్రభావం చూపనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మక్కల సాగుపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ విషయంపై కూడా విస్త్రతంగా చర్చ జరుగుతుందని సీఎం చెప్పారు. కరొనా ముప్పు ఇంకా తొలిగిపోనందున రైతుల ఆరోగ్యాన్ని కాపాడడం కోసం గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి వ్యవసాయ ఉత్పత్తలను కోనుగోలు చేయాలని నిర్ణయించారు. ఈ కొనుగోళ్లకు సంబంధించిన ఏర్పాట్లను ముఖ్యమంత్రి ఈ సమావేశంలో సమీక్షిస్తారు.
అటు కరోనా నేపథ్యంలో గత యాసంగి పంటలను గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి సేకరించడం జరిగిందని సీఎం కేసీఆర్ గుర్తు చేశారు. ఇంకా కరోనా ముప్పు తొలగలేదు కాబట్టి..వర్షా కాలం పంటలను కూడా గ్రామాల్లోనే కేంద్రాలు ఏర్పాటు చేసి కొనుగోలు చేయనున్నారు. 6 వేల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోళ్లు జరపాలని సీఎంకేసీఆర్ ఆదేశించారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వ పరంగా అన్ని ఏర్పాట్లు చేయాలన్నరు. పంటలు కొనుగోలు చేసిన తర్వాత వీలైనంత తక్కువ సమయంలో రైతులకు డబ్బులు చెల్లించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. అన్ని ఏర్పాట్లను వెంటనే పూర్తి చేయాలన్నరు సీఎం కేసీఆర్.
మరో వైపు రేపు సాయంత్రం 5 గంటలకు ప్రగతి భవన్ లో రాష్ట్ర కేబినెట్ భేటీ కానుంది. ఈ సమావేశంలో యాసంగిలో అమలు చేయాల్సిన నిర్ణిత పంట సాగు విధానం, ధాన్యం కొనుగోలుపై కేబినెట్ లో చర్చించే అవకాశం ఉంది.