23.2 C
Hyderabad
Tuesday, October 20, 2020

రానున్న మూడు రోజుల పాటు తెలంగాణలో భారీ వర్షాలు

బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం తీవ్రరూపం దాల్చింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. దీని ప్రభావంతో మరో మూడు రోజులు పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఉమ్మడి వరంగల్, ఖమ్మం, యాదాద్రి, నల్గొండ, సూర్యపేట జిల్లాల్లో ఉరుములతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. వాతావరణశాఖ హెచ్చరికలతో ప్రభుత్వం అప్రమత్తం అయింది.  ఆయా జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేసింది. ఎలాంటి పరిస్థితి అయినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సూచించింది.

మరోవైపు పశ్చిమ నైరుతీ రుతుపవనాల తిరోగమనం జాప్యంతో వర్షాకాలం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇక బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం ఏపీలోని కాకినాడకు 360 కిమీ దూరంలొ కేంద్రీకృతమయ్యింది. ఇది తీరం దాటే సమయంలో భారీవర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం తీవ్రరూపం దాల్చి వాయుగుండంగా మారడంతో  రానున్న మూడు రోజుల్లో రాష్ట్రం లోని పలు జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు పడనున్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. దీంతో పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఉమ్మడి వరంగల్, ఖమ్మం, యాదాద్రి, నల్గొండ, సూర్యపేట జిల్లాల్లో ఉరుములతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఆయా జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేసింది.

పశ్చిమ నైరుతీ రుతుపవనాల తిరోగమనం జాప్యం తో వర్షాకాలం ఇంకా కొనసాగుతూనే ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం ఏపీలోని కాకినాడకు 360 కిమీ దూరంలొ కేంద్రీకృతమయ్యింది. మంగళవారం ఉదయం తీరం దాటనుండటంతో భారీ వర్షాలు రాబోయే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

- Advertisement -

Latest news

Related news

నాలుగో రోజు వరద ప్రాంతాల్లో మంత్రి కేటీఆర్ పర్యటన

వరద ప్రభావిత ప్రాంతాల్లో వరుసగా నాలుగో రోజు పర్యటిస్తున్నారు మంత్రి కేటీఆర్. రాజేంద్రనగర్ లో పర్యటించిన మంత్రి వరదల్లో చనిపోయిన వారి కుటుంబసభ్యులకు ఐదు లక్షల రూపాలయ ఎక్స్ గ్రేషియా...

ఓఆర్ఆర్ పై ట్రామా కేంద్రాలు, అంబులెన్స్ లను ప్రారంభించిన మంత్రి కేటీఆర్

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఓఆర్ఆర్ పై 10 ట్రామా కేంద్రాలు, 10 అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్ అంబులెన్స్ లను మంత్రి కేటీఆర్ ప్రాంరంభించారు. దీంతో ఓఆర్ఆర్ పై  పూర్తి స్ధాయి...

భారత్‌లో 74 లక్షలు దాటిన కరోనా కేసులు

దేశంలో కరోనా వైరస్ తీవ్రత తగ్గుముఖం పట్టింది. అక్టోబరు తొలి 15 రోజుల్లో కరోనా కొత్త కేసులలో 18%, మరణాల్లో 19% తగ్గుదల కనిపించింది. నిన్నటికి నిన్న 62వేల  212కొత్త...

ఏడు నెలల తరువాత తెరుచుకున్న శబరిమల

శబరిమల ఆలయం తెరుచుకుంది. ఏడునెలల తరువాత ఇవాళ్లి నుంచి భక్తులను స్వామి వారి దర్శనానికి అనుమతిస్తున్నారు.  అయ్యప్ప యాత్రకు కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది కేరళ ప్రభుత్వం. ఆలయంలోకి ప్రవేశించాలనుకునే...