19.4 C
Hyderabad
Monday, November 30, 2020

రామాపురంలో డీసీఎం బోల్తా…20 మందికి గాయలు

నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం రామాపురం సమీపంలో పెళ్లి బృందంతో వెళుతున్న డీసీఎం వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. బోల్తా పడిన డిసిఎంలో 30 మంది పెళ్లి బృందం ఉండగా అందులో 20 మందికి తీవ్రగాయాలు కాగా. నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను కొల్లాపూర్ ఆస్పత్రికి తరలించారు పరిస్థితి విషమంగా ఉన్న వారిని మహబూబ్ నగర్, హైదరాబాద్ తరలించారు. కొల్లాపూర్ మండలం ఎల్లూరులో రేపు ఉదయం జరిగే వివాహానికి గద్వాల్ జిల్లా జమ్మిచెడు గ్రామం నుంచి పెళ్లి కుమారుడుతో పాటు అతని బంధువులు డీసీఎంలో ఎల్లూరు వస్తుండగా రామాపురం వద్ద వాహనం అదుపుతప్పి బోల్తా పడటంతో ఈ సంఘటన జరిగింది.

- Advertisement -

Latest news

Related news

ఇక్కడ బతికేవారంతా మా బిడ్డలే : సీఎం కేసీఆర్‌

ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లో చర్చ జరగాలి. నాయకుల పనితీరును చూసి విచక్షణతో ఆలోచించి ఓటు వేయాలని' సీఎం కోరారు.

ఆలోచించి.. అభివృద్ధికే ఓటేయండి : సీఎం కేసీఆర్

మన చారిత్రక నగరాన్ని కాపాడుకునేందుకు అందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఓటేయాలని కోరారు.

మనకు చెప్పే మొఖమా వాళ్లది? : సీఎం కేసీఆర్‌

ఎల్‌ఐసీ, బీహెచ్‌ఈఎల్‌, రైల్వేలు ఎందుకు అమ్ముతున్నారని ప్రశ్నిస్తే.. దాడులు చేసేందుకు.. మాయలు చేసి.. మాటలు చెప్పేందుకు ఎక్కడెక్కడి నుంచో హైదరాబాద్‌కు నాయకులు తరలి వస్తున్నారని సీఎం ముఖ్యమంత్రి తెలిపారు.

వరద సాయాన్ని అడ్డుకోవడం విజ్ఞతనా?

బీజేపీ, కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో ఎలాంటి సాయం చేయలేదు. దేశ చరిత్రలో ఏ ప్రభుత్వం చేయని విధంగా ఆరున్నర లక్షల కుటుంబాలకు వరద సాయం అందజేశామని ముఖ్యమంత్రి తెలిపారు.