24.7 C
Hyderabad
Sunday, July 5, 2020

రాష్ట్రంలో 12 వేలు దాటిన కరోనా కేసులు

రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. నిన్న ఒక్కరోజే 985 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోనే 774 ఉన్నాయి. రంగారెడ్డి జిల్లాలో 86, మేడ్చల్‌-53, వరంగల్‌ అర్బన్‌-20, మెదక్‌-9, ఆదిలాబాద్‌-7, నాగర్‌కర్నూల్‌, నిజామాబాద్‌, రాజన్నసిరిసిల్ల-6 చొప్పున నమోదు అయ్యాయి. అటు సిద్దిపేట, జయశంకర్‌ భూపాలపల్లి, ఖమ్మం-3 చొప్పున, ములుగు, జగిత్యాల, యాదాద్రిభువనగిరి-2 చొప్పున, వికారాబాద్‌, మహబూబ్‌నగర్‌, నల్లగొండ జిల్లాల్లో-1 చొప్పున కేసులు నమోదయ్యాయి. వైరస్‌ కారణంగా ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 75వేల 308 మందికి పరీక్షలు చేయగా, 12వేల 349 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. మొత్తం 237 మంది మరణించినట్టు వైద్యారోగ్యశాఖ బులెటిన్‌లో పేర్కొన్నది.

హైద్రాబాద్ లో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువ కావడంతో పాతబస్తీలో పలుచోట్ల స్వచ్చందంగా బంద్ పాటిస్తున్నారు. చార్మినార్ సమిపంలొని లాడ్ బజార్ మర్చంట్ అసోసియేషన్ తరపున 15 రొజులపాటు దుకాణాలను మూసివేయనున్నట్లు వ్యాపారులు తెలిపారు. చార్మినార్ చుట్టు ఉన్న ఇస్లామిక్ బుక్స్ షాపు యజమానులు సైతం స్వచ్చందంగా దుకాణాలు మూసి వేశారు. అటు పత్తర్ ఘట్టీ ప్రాంతంలోని వస్త్ర వ్యాపారులు సైతం షాపులను బంద్ చేశారు. దీంతో చార్మినార్ ప్రాంతం నిర్మానుష్యంగా మారింది.

అటు సికింద్రాబాద్‌ రాణిగంజ్ లో ఈ నెల 28 నుంచి వచ్చే నెల 5 వరకు 8 రోజుల పాటు స్వచ్చందంగా షాపులను మూసివేస్తున్నట్లు మర్చెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు జనార్ధన్ మూర్తి తెలిపారు. కరోనా కట్టడి కోసం రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు జనార్ధన్ మూర్తి తెలిపారు. దీంతో దాదాపు 5 వేల షాపులు మూతపడనున్నాయి.

రాష్ట్రంలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. మాస్కులు, శానిటైజర్లు తప్పక ఉపయోగించాలని కోరుతున్నారు.

- Advertisement -

Latest news

కంటోన్మెట్‌ ప్రాంతంలో కూడా సంక్షేమ కార్యక్రమాలు

నగరంలోని కంటోన్మెంట్‌ భూములను ఆక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ హెచ్చరించారు. కంటోన్మెంట్‌ అభివృద్ధిపై సీఎం కేసీఆర్‌ ప్రత్యేక దృష్టి సారించారని చెప్పారు. మంత్రి మల్లారెడ్డితో...

Related news

కంటోన్మెట్‌ ప్రాంతంలో కూడా సంక్షేమ కార్యక్రమాలు

నగరంలోని కంటోన్మెంట్‌ భూములను ఆక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ హెచ్చరించారు. కంటోన్మెంట్‌ అభివృద్ధిపై సీఎం కేసీఆర్‌ ప్రత్యేక దృష్టి సారించారని చెప్పారు. మంత్రి మల్లారెడ్డితో...

రౌడీ షీటర్ వికాస్ దూబే ఇంటిని కూల్చివేసిన అధికారులు

ఉత్తరప్రదేశ్‌లో ఎనిమిది మంది పోలీసుల మృతికి కారణమైన రౌడీ షీటర్ వికాస్ దూబే ఇంటిని కూల్చివేశారు అధికారులు. కాన్పూర్‌లో నిన్న వికాస్ దూబే కోసం వెళ్లిన పోలీసులపై అతని గ్యాంగ్...

చైనాలో పర్యటించనున్న డబ్లూహెచ్‌వో బృందం

కరోనా వైరస్ ఎక్కడ పుట్టింది? ఎలా పుట్టిందనే వివరాలు తెలుసుకునేందుకు డబ్లూహెచ్‌వో బృందం రంగంలోకి దిగనుంది. వైరస్ తొలుత వెలుగుచూసిన చైనాలోని వుహాన్‌లో డబ్లూహెచ్‌వో టీం పర్యటించనుంది. వచ్చే వారంలో...

కరోనా వ్యాప్తిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక ప్రకటన

ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతున్న కరోనా వ్యాప్తిపై వివరాలను అందించడంలో చైనా ఆలస్యం చేసిందనే వివాదం నేపథ్యంలో  డబ్ల్యూహెచ్ఓ కీలక ప్రకటన చేసింది. కోవిడ్‌ పై సమాచారం చైనాలోని ప్రపంచ ఆరోగ్య సంస్థ కార్యాలయమే తెలియజేసిందని...