19.5 C
Hyderabad
Friday, November 27, 2020

రాష్ట్రాన్ని వణికిస్తున్న చలి

రాష్ట్రంపై చలి పంజా విసురుతున్నది. నవంబర్‌ రెండోవారంలోనే కనిష్ఠ ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతున్నాయి. ఈశాన్య దిశనుంచి వీస్తున్న చలిగాలులతో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా నవంబర్‌కు సంబంధించిన పదేండ్ల రికార్డులు పరిశీలిస్తే.. 2017లో నవంబర్‌ 28, 29, 30 తేదీల్లో ఆదిలాబాద్‌ జిల్లాలో అత్యల్పంగా 6.8 డిగ్రీలు రికార్డయ్యింది. ఇదే ఇప్పటివరకు అత్యల్పం. నిన్న వికారాబాద్‌ జిల్లా మర్పల్లిలో 7.1 డిగ్రీల రికార్డు స్థాయి కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. గత పదేండ్లలో నవంబర్‌ మూడోవారం నుంచి ఉష్ణోగ్రతలు బాగా తగ్గాయని, కానీ ఈ ఏడాది రెండోవారంలోనే తగ్గుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.

హైదరాబాద్‌లో 2016 తర్వాత మరోసారి 12.4 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. గతంలో 2012, 2016లోనూ నవంబర్‌ 11వ తేదీల్లో 12.4 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదు అయినట్టు అధికారులు తెలిపారు. మరోవైపు వికారాబాద్‌ జిల్లా మర్పల్లిలో 7.1 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైనట్టు టీఎస్‌డీపీఎస్‌ వెల్లడించింది. మోమిన్‌పేట్‌, సంగారెడ్డి జిల్లా కోహీర్‌లలో 7.2 డిగ్రీలు, అటు జహీరాబాద్‌, న్యాల్‌కల్‌లలో 7.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కామారెడ్డి జిల్లా మద్నూర్‌ మండలం డోంగ్లీలో 8.1, డిగ్రీలు, సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం నల్లవల్లి, కామారెడ్డి జిల్లా గాం ధారి మండలం రామలక్ష్మణపల్లిలో 8.2 డిగ్రీలు, ఆదిలాబాద్‌ జిల్లా భీంపూర్‌, తాంసిలలో 8.5, రాజన్నసిరిసిల్ల జిల్లా వీర్నపల్లి, కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లా సిర్పూర్‌, మెదక్‌ జిల్లా శివంపేట్‌, ఆదిలాబాద్‌ జిల్లా బేలలో 9.3 డిగ్రీల చొప్పున కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

శ్రీలంక తీరానికి దగ్గరలో.. నైరుతి బంగాళాఖాతం నుంచి ఉత్తర కోస్తా ఆంధ్ర తీరం సమీపంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంవరకు 1.5 కిలోమీటర్ల ఎత్తు మేర ఉపరితల ద్రోణి కొనసాగుతున్నది. దీని ప్రభావంతో రాష్ట్రంవైపు నేడు, రేపు తేమగాలులు వీచే అవకాశం ఉన్నది.

- Advertisement -

Latest news

Related news

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్

ఆస్ట్రేలియాలో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియాపై టాస్ గెలిచి ఆసీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. కరోనా వైరస్ నేపథ్యంలో చాలా రోజుల తరువాత టీమిండియా బ్లూజెర్సీతో మైదానంలో కనిపిస్తోంది.ఈ మ్యాచ్‌లో టాస్...

దేశంలో 93 లక్షలు దాటిన కరోనా కేసులు

దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. బాధితుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. గడిచిన 24గంటల్లో 43 వేల 082 కొత్త కేసులు వెలుగులోకి రాగా.. మొత్తం కేసుల సంఖ్య 93లక్షల 09వేల...

పీవీ, ఎన్టీఆర్‌కు పురస్కారాలేవి?

దేశ ప్రధానమంత్రి పదవిని అధిష్ఠించిన తొలి తెలంగాణ బిడ్డ పీవీ నరసింహారావు. భారతదేశ అణువిధాన పితామహుడు, ఆర్థికసంస్కరణల సారథి అయిన పీవీ నరసింహారావుకు ఈ దేశంలో దక్కాల్సిన గౌరవం దక్కలేదు....

నిఖార్సయిన హిందుత్వానికి నిర్వచనం కేసీఆర్‌

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఓ గొప్ప హిందువు. సీఎం కేసీఆర్‌ చేసే యజ్ఞయాగాది క్రతువులు తాను ఎలాంటివారో చెప్పక్కనే చెబుతాయి. కేసీఆర్‌ చేపట్టిన ఏ పనిలోనైనా...