27.5 C
Hyderabad
Thursday, July 16, 2020

రాష్ట్రాలకు కేంద్రం షాక్

కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు పన్నుల విషయంలో మరోసారి ఝలక్ ఇచ్చింది. రాష్ర్టాలకు ఇవ్వాల్సిన పన్ను ల వాటాలో కేంద్రం మళ్లీ కోత విధించింది. ఏప్రిల్‌ మాదిరిగా మే నెలలో కూడా కేంద్ర పన్నుల్లో రాష్ర్టాలకు రావాల్సిన వాటాలో 17.81 శాతం వరకు నిధులకు కత్తెర వేసింది. కరోనా విపత్కర  సమయంలో ఈ నెలలోనైనా పూర్తిస్థాయిలో నిధులను విడుదల చేస్తారని ఆశించిన రాష్ర్టాలకు నిరాశే  మిగిలింది. కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటాను కేంద్ర ఆర్థికశాఖ విడుదలచేసింది. మొత్తం 28 రాష్ట్రాలకు కలిపి రూ.46,038కోట్లు కేటాయించింది. అందు లో తెలంగాణకు రూ.982 కోట్లు విడుదలయ్యాయి.

అటు రాష్ర్టాలకు ఇవ్వాల్సిన పన్నుల వాటాను కేంద్ర ప్రభుత్వం వార్షిక బడ్జెట్‌లోనే అంచనా వేసుకుంటుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2020-21లో అన్ని రాష్ట్రాలకు కలిపి చెల్లించాల్సింది 7.84 లక్షల కోట్లకుపైగా ఉంటుందని అంచనావేసింది. ఆ మొత్తాన్ని రాష్ర్టాలకు 14 వాయిదాలలో చెల్లిస్తుంది. ప్రతి ఏడాది ఫిబ్రవరి వరకు ఒక్కో భాగం చొప్పున చెల్లించి, మార్చి నెలలో మిగిలిన మొత్తం మూడు భాగాలను ఒకేసారి ఇస్తుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో తెలంగాణకు రూ.16,716 కోట్ల అంచనాను ఖరారు చేసింది. ఈ మొత్తాన్ని రూ.1,194 కోట్ల చొప్పున 14 వాయిదాలలో చెల్లించాలి. కానీ గత రెండు నెలలుగా కేంద్రం 982 కోట్లు మాత్రమే ఇస్తూ చేతులు దులుపుకుంటున్నది. దీంతో రెండునెలల్లో రాష్ట్ర ఖజానాకు రూ.424 కోట్ల గండిపడింది. రావాల్సిన వాటాలో 17.81 శాతం నిధులకు కోత విధించినట్టు కేంద్ర ఆర్థికశాఖ తన లెక్కల్లో చూపింది.

అటు.. పది లక్షలలోపు జనాభా ఉన్న పురపాలక సంఘాలకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ నిధులను విడుదలచేసింది. అన్ని మున్సిపాలిటీలకు 5,025కోట్లు విడుదలయ్యాయి. ఇందులో రాష్ర్టానికి వంద కోట్ల 25 లక్షల రూపాయలు విడుదలయ్యాయి. వీటిని స్టేట్‌ ఫైనాన్స్‌ కమిషన్‌ ద్వారా ఆయా మున్సిపాలిటీలకు వారం రోజులలోపు పంపిణీ చేయాలని కేంద్ర ఆర్థిక శాఖ సూచించింది.

- Advertisement -

Latest news

టర్కీ లో కూలిన విమానం…ఏడుగురు మృతి

టర్కీలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. మిలట్రీ విమానం కుప్పకూలి ఏడుగురు భద్రతా సిబ్బంది మృతి చెందారు. మిలిటెంట్లతో పోరాడుతున్న క్రమంలో 2,200 అడుగుల ఎత్తులో పర్వతంపై నుంచి కుప్పకూలింది.ఈ...

Related news

టర్కీ లో కూలిన విమానం…ఏడుగురు మృతి

టర్కీలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. మిలట్రీ విమానం కుప్పకూలి ఏడుగురు భద్రతా సిబ్బంది మృతి చెందారు. మిలిటెంట్లతో పోరాడుతున్న క్రమంలో 2,200 అడుగుల ఎత్తులో పర్వతంపై నుంచి కుప్పకూలింది.ఈ...

బీహార్‌ లో వరద ఉధృతికి కూలిన బ్రిడ్జ్

బీహార్ ను భారీ వ‌ర్షాలు ముంచెత్తుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో నదులు ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తున్నాయి. వ‌ర‌ద ఉధృతి ఎక్కువ అవ‌డంతో గోపాల్ గంజ్ లో గండ‌‌క్ న‌దిపై...

మధ్యప్రదేశ్‌ లో దారుణం….దళిత దంపతులపై పోలీసులు దాడి

చేతికొచ్చిన పంటను అధికారులు బుల్డోజర్‌ తో నాశనం చేయడాన్ని తట్టుకోలేకపోయిన భార్యభర్తలు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నాం చేశారు. మధ్య ప్రదేశ్‌ లోని గుణ జిల్లాలో పంటను పసిబిడ్డగా భావించి...

ముఖంపై చిరునవ్వు కన్నా మాస్కే అందం: చిరంజీవి

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. రోజురోజుకు రికార్డు స్థాయిలో నమోదు అవుతున్న కొత్త కేసులతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో మెగాస్ఠార్‌ చిరంజీవి మాస్కులపై...