22.9 C
Hyderabad
Sunday, September 27, 2020

రాష్ట్ర కీర్తి ప్రతిష్టలను, సంస్కృతిని ప్రతిబింబించేలా నూతన సచివాలయం

నూతన సచివాయం నిర్మాణంపై సీఎం కేసీఆర్‌ ప్రగతిభవన్‌లో సమీక్ష నిర్వహించారు. కొత్తగా నిర్మించే సెక్రటేరియట్‌ భవన సముదాయం తెలంగాణ ప్రతిష్టను ఇనుమడింపజేసేలా రూపొందాలని సీఎం కేసీఆర్‌ అన్నారు. అదే సందర్భంలో రాష్ట్ర పరిపాలనా కేంద్రానికి ఉండాల్సిన అన్ని సౌకర్యాలు, సదుపాయాలు ఉండాలని ఆయన అభిలాషించారు. నూతన భవన సముదాయం రాష్ట్ర కీర్తి ప్రతిష్టలను, సంస్కృతిని ప్రతిబింభించడంతో పాటు పూర్తి సౌకర్యవంతంగా ఉండాలని సీఎం కేసీఆర్‌ అధికారులకు తెలిపారు. ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, ప్రధాన కార్యదర్శి, కార్యదర్శులంతా అందులోనే తమ విధులు నిర్వర్తించేలా ఉండాలని చెప్పారు. సెక్రటేరియట్‌ సమీపంలోనే అన్ని ప్రభుత్వ శాఖల విభాగాధిపతుల కార్యాలయాల సముదాయాన్ని కూడా నిర్మిస్తామన్నారు.

కొత్త సెక్రటేరియట్ బాహ్యరూపం ఎంత హూందాగా, గొప్పగా ఉంటుందో.. లోపల కూడా అంతే సౌకర్యవంతంగా అన్ని వసతులతో ఉండాలని సీఎం కేసీఆర్‌ చెప్పారు. మంత్రులు, కార్యదర్శుల చాంబర్లు, సమావేశ మందిరాలు, సిబ్బంది కార్యాలయాలు, లంచ్‌హాల్స్‌, సెంట్రలైజ్డ్‌ స్ట్రాంగ్‌ రూమ్‌, రికార్డు రూములు తదితరాలు ఎలా ఉండాలో నిర్ణయించాలని అధికారులను ఆదేశించారు. సెక్రటేరియట్ ప్రాంగణంలో ప్రార్థనా మందిరాలు, బ్యాంకు, క్రష్‌, విజిటర్స్‌ రూమ్‌, పార్కింగ్, భద్రతా సిబ్బంది నిలయం తదితర ఏర్పాట్లు ఎక్కడ ఎలా ఉండాలో నిర్ణయించాలని చెప్పారు. సౌకర్యాలు, సదుపాయాల విషయంలో తుది నిర్ణయం తీసుకొని టెండర్లు పిలవాలని అధికారులను ఆదేశాంచారు. ఈ సమావేశంలో రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌ శర్మ, సీఎస్‌  సోమేష్‌కుమార్‌, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Latest news

కరోనా మరణాల సంఖ్య 20లక్షలు దాటే అవకాశం ఉంది: డ‌బ్ల్యూహెచ్‌ఓ

ప్రపంచవ్యాప్తంగా కరోనా మరణమృదంగం కొనసాగుతోంది. బాధితుల సంఖ్య 3కోట్ల 28లక్షలకు చేరువ కాగా.. మృతుల సంఖ్య 9లక్షల 94వేలకు చేరింది. అయితే ప్రపంచదేశాలు మేల్కొనకపోతే .. మరణాల సంఖ్య 20లక్షలు...

Related news

కరోనా మరణాల సంఖ్య 20లక్షలు దాటే అవకాశం ఉంది: డ‌బ్ల్యూహెచ్‌ఓ

ప్రపంచవ్యాప్తంగా కరోనా మరణమృదంగం కొనసాగుతోంది. బాధితుల సంఖ్య 3కోట్ల 28లక్షలకు చేరువ కాగా.. మృతుల సంఖ్య 9లక్షల 94వేలకు చేరింది. అయితే ప్రపంచదేశాలు మేల్కొనకపోతే .. మరణాల సంఖ్య 20లక్షలు...

ముగిసిన ఏస్.పీ బాలసుబ్రహ్మణ్యం అంత్యక్రియలు

సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానుల అశ్రునయనాల మధ్య తమిళనాడు ప్రభుత్వ లాంఛనాలతో  బాలు అంత్య‌క్రియ‌లు తిరువ‌ళ్ళూరు జిల్లా తామ‌రైపాక్కం ఫాం హౌజ్‌లో నిర్వ‌హించారు. కొవిడ్‌ నేపథ్యంలో నిన్న రాత్రే బాలు...

దేశంలో 24 గంటల్లో 85,352 కరోనా కేసులు

భారత్ లో కరోనా వ్యాప్తి రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. దేశంలో కేసుల సంఖ్య 59 లక్షల మార్క్‌ దాటింది. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 85వేల352 కేసులు నమోదు...

ఎన్సీబీ ముందుకు దీపికా పడుకోణె

బాలీవుడ్ డ్రగ్స్ కేసు పూటకో మలుపు తిరుగుతుంది. రియా ఇచ్చిన సమాచారంతో .. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో నిన్నటికి నిన్న టాలీవుడ్‌ బ్యూటీ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ను విచారించింది....