27.9 C
Hyderabad
Tuesday, September 29, 2020

రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు

ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా పేరూరులో అత్యధికంగా 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలంలో కిన్నెరసాని, మల్లన్నవాగు, నిండుగా పారుతున్నాయి. పాల్వంచ, కొత్తగూడెం లో మొర్రేడు వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నది. ఖమ్మం నగరం తోపాటు రూరల్‌ మండలంలోని పలుచోట్ల వాన పడింది. కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లా చింతలమానేపల్లి మండలంలోని పలు వాగులు ఉప్పొంగాయి.

అటు  నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లోని పలు మండలాల్లో చిరుజల్లుల నుంచి ఓ మోస్తరు వర్షం కురిసింది. మహబూబాద్‌ జిల్లాలో భారీగా వర్షం కురిసింది. పట్టణ శివారు మున్నేరు వాగు బయ్యారం మండలంలోని పెద్ద చెరువు పొంగి ప్రవహిస్తున్నాయి. వరంగల్‌ అర్బన్‌, జనగామ జిల్లాల్లో జల్లులు పడ్డాయి. కరీంనగర్‌ జిల్లాలో నిన్న సాయంత్రం వర్షం కురిసింది. వరంగల్‌ రూరల్‌ జిల్లా చెన్నారావుపేటలో భారీ వర్షం పడింది. గ్రేటర్‌ హైదరాబాద్‌లో ఆదివారం ఉదయం నుంచి పలుచోట్ల తేలికపాటి వర్షం కురిసింది. 

వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఆదివారం ఉదయం అల్పపీడనంగా మారింది. ఈ ప్రభావంతో ఇవాళ రేపు రాష్ట్రంలోని చాలాచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం  తెలిపింది ప్రధానంగా ఉమ్మడి ఆదిలాబాద్‌,ఉమ్మడి కరీంనగర్‌,ఉమ్మడి వరంగల్‌,ఖమ్మం.భద్రాది కొత్తగూడెం జిల్లాల్లో ఒకటిరెండు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. రాగల రెండ్రోజులు గ్రేటర్‌ హైదరాబాద్‌లోని పలుచోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వాతావరణ అధికారులు తెలిపారు.

- Advertisement -

Latest news

ఐదేండ్ల మా పనితీరుకు నిదర్శనంగా ప్రగతి నివేదిక ఉండబోతుంది: మంత్రి కేటీఆర్

జీహెచ్‌ఎంసీలో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రజల్లోకి మరింత పెద్ద ఎత్తున తీసుకెళ్లాలని కార్పొరేటర్లకు మంత్రి కేటీఆర్‌ పిలుపునిచ్చారు. జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు, మంత్రులు, ఎమ్మెల్యేలతో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. గత ఐదేండ్లలో...

Related news

ఐదేండ్ల మా పనితీరుకు నిదర్శనంగా ప్రగతి నివేదిక ఉండబోతుంది: మంత్రి కేటీఆర్

జీహెచ్‌ఎంసీలో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రజల్లోకి మరింత పెద్ద ఎత్తున తీసుకెళ్లాలని కార్పొరేటర్లకు మంత్రి కేటీఆర్‌ పిలుపునిచ్చారు. జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు, మంత్రులు, ఎమ్మెల్యేలతో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. గత ఐదేండ్లలో...

అక్టోబర్ 9 నుంచి బతుకమ్మ చీరలు పంపిణీ

తెలంగాణ ఆడబిడ్డలకు బ‌తుక‌మ్మ పండుగ‌కు చిరు కానుక‌గా రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ చీర‌ల‌ను పంపిణీ చేస్తోందని మంత్రి కేటీఆర్ తెలిపారు. బేగంపేట హ‌రిత ప్లాజాలో ఏర్పాటు చేసిన బ‌తుక‌మ్మ చీర‌ల...

న‌వంబ‌ర్ 3న‌ దుబ్బాక ఉప ఎన్నిక‌

మెద‌క్ జిల్లాలోని దుబ్బాక ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుద‌లైంది. ఈ మేర‌కు కేంద్ర ఎన్నిక‌ల సంఘం షెడ్యూల్‌ను విడుద‌ల చేసింది. న‌వంబ‌ర్ 3న దుబ్బాక నియోజ‌క‌వ‌ర్గానికి పోలింగ్ నిర్వ‌హించ‌నున్నారు. 10న...

బాబ్రీ మ‌సీదు కూల్చివేత కేసులో రేపు తుది తీర్పు

బాబ్రీ మ‌సీదు కూల్చివేత కేసులో రేపు సీబీఐ ప్రత్యేక కోర్టు తుదితీర్పు వెలువరించనుంది.ఈ కేసులో రేపు బీజేపీ సీనియ‌ర్ నేత‌లు ఎల్ కే అద్వానీ, ముర‌ళీ మ‌నోహ‌ర్ జోషి, క‌ళ్యాణ్...