21.2 C
Hyderabad
Saturday, November 28, 2020

రెచ్చగొడితే బుద్ధి చెప్తాం

సీఎంలతో ప్రధాని నరేంద్రమోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా భారత్‌-చైనా సరిహద్దులో జరిగిన ఘర్షణను సీఎం కేసీఆర్‌ ప్రస్తావించారు. దేశ రక్షణపై ఏ మాత్రం రాజీపడవద్దని, కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం, రాష్ట్ర ప్రజలు పూర్తి మద్దతుగా నిలుస్తారని సీఎం కేసీఆర్ స్పష్టంచేశారు. చైనా అయినా, మరో దేశమైనా సరే.. భారతదేశ సార్వభౌమత్వం విషయంలో జోక్యం చేసుకుంటే ప్రతిఘటించాల్సిందేననన్నారు. ముష్కరులకు తగిన సమాధానం చెప్పాలని అన్నారు. దేశ రక్షణ విషయంలో ఎవరూ రాజకీయం చేయాల్సిన అవసరం లేదన్నారు. ఇది దేశమంతా ఒక్కతాటిపై నిలవాల్సిన సమయమని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. వీడియో కాన్ఫరెన్స్‌ ప్రారంభంలో ప్రధానమంత్రితో పాటు ముఖ్యమంత్రులందరూ లఢఖ్‌ ప్రాంతంలో జరిగిన ఘర్షణలో అమరులైన సైనికులకు రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళి అర్పించారు.

లడఖ్‌లోని గల్వాన్‌ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో అమరులైన వీర జవాన్ల త్యాగాలను వృథా కానివ్వమని ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించారు. భారతదేశం ఎప్పుడూ శాంతినే కోరుకుంటుందని, రెచ్చగొడితే మాత్రం ప్రతిఘటన అత్యంత తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు. సరిహద్దు సమస్యపై చర్చించేందుకు రేపు సాయంత్రం 5గంటలకు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తున్నట్టు ప్రధాని మోదీ తెలిపారు. దేశంలోని అన్నిపార్టీల అధ్యక్షులు ఈ సమావేశంలో పాల్గొనాలని కోరారు.

దేశ రక్షణలో ప్రాణాలు కోల్పోయిన సైనికుల త్యాగాలను స్మరిస్తూ దేశం గర్విస్తున్నదన్నారు ప్రధాని. భారతదేశ ముద్దుబిడ్డలు గల్వాన్‌ లోయలో మాతృభూమిని రక్షిస్తూ అమరులయ్యారని కొనియాడారు. భారత్‌ శాంతినే కోరుకుంటుందని… కానీ రెచ్చగొడితే మాత్రం ఎలాంటి పరిస్థితుల్లో అయినా తగిని రీతిలో సమాధానమివ్వగలమని స్పష్టం చేశారు. సైనికుల త్యాగాలను వృథా కానివ్వమని దేశానికి హామీ ఇస్తున్నామన్నారు. దేశ ఐక్యత, సార్వభౌమత్వమే అత్యంత ప్రధానమని ప్రధాని స్పష్టంచేశారు. దేశాల మధ్య ఏర్పడే విబేధాలు వివాదాలుగా మారకూడదని ప్రధాని అన్నారు. తాము ఎవరినీ రెచ్చగొట్టమని… కానీ దేశ సార్వభౌమత్వం, సమగ్రత విషయంలో రాజీపడమన్నారు. సార్వభౌమత్వం, సమగ్రత రక్షణలో సమయం వచ్చినప్పుడు శక్తిసామర్ధ్యాలను నిరూపించుకుంటామన్నారు. త్యాగం, ధృడచిత్తం భారత జాతి లక్షణాలని… శౌర్యప్రతాపాలు  జాతి వ్యక్తిత్వం అని ప్రధాని పేర్కొన్నారు.

అటు గాల్వన్ వ్యాలీలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో వీర మరణం పొందిన భారత జవాన్ల వివరాలు ఆర్మీ విడుదల చేసింది. వారి భౌతిక కాయాలకు లఢక్ లోని లేహ్ మిలిటరీ ఆస్పత్రిలో ఆర్మీ అధికారులు నివాళులు అర్పించారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానాలు, వాహనాల్లో అమర జవాన్ల పార్థీవ దేహాలను వారి స్వస్థలాలకు తరలించారు. మృతుల్లో తెలంగాణకు చెందిన కల్నల్ సంతోష్ బాబుతో పాటు.. బెంగాల్, బీహార్, చత్తీస్ గఢ్, తమిళనాడు తదితర రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారు. తమ బిడ్డల మరణ వార్త తెలిసి వారి కుటుంబాలు కన్నీరు మున్నీరు అవుతున్నాయి.

- Advertisement -

Latest news

వరద సాయాన్ని అడ్డుకోవడం విజ్ఞతనా?

వరద సాయాన్ని అడ్డుకోవడం విజ్ఞతనా?

బీజేపీ, కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో ఎలాంటి సాయం చేయలేదు. దేశ చరిత్రలో ఏ ప్రభుత్వం చేయని విధంగా ఆరున్నర లక్షల కుటుంబాలకు వరద సాయం అందజేశామని ముఖ్యమంత్రి తెలిపారు.

Related news

వరద సాయాన్ని అడ్డుకోవడం విజ్ఞతనా?

బీజేపీ, కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో ఎలాంటి సాయం చేయలేదు. దేశ చరిత్రలో ఏ ప్రభుత్వం చేయని విధంగా ఆరున్నర లక్షల కుటుంబాలకు వరద సాయం అందజేశామని ముఖ్యమంత్రి తెలిపారు.

దోబీ ఘాట్‌లకు, సెలూన్లకు ఉచిత విద్యుత్ : సీఎం కేసీఆర్

రజకులకు దోబీ ఘాట్‌లు ఉచిత కరెంటు అందిస్తాం. దోబీ ఘాట్‌లో ఉండే మోటార్లకు కరెంటు బిల్లు కట్టాల్సిన అవసరం లేదు. సెలూన్లకు ఉచిత విద్యుత్‌ అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని ముఖ్యమంత్రి చెప్పారు.

హైదరాబాద్‌ ప్రజలు చైతన్యవంతులు : సీఎం కేసీఆర్

ఎన్నికలు వస్తుంటాయి.. పోతుంటాయి. కానీ.. ఓట్లు వేసే ప్రజలు విచక్షణా జ్ఞానంతో ఆలోచించి ఓట్లు వేయాలని ముఖ్యమంత్రి ప్రజలకు సూచించారు.

హైదరాబాద్‌ మద్దతు.. టీఆర్‌ఎస్‌కే

టీఆర్‌ఎస్‌ గ్రేటర్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎల్బీనగర్‌లో నిర్వహించిన బహిరంగ సభకు ప్రజలు భారీ ఎత్తున హాజరయ్యారు. ముఖ్యమంత్రి వేదిక పైకి రాగానే.. కార్యకర్తలు, అభిమానులు చప్పట్లు, కేరింతలతో ఈలలు వేస్తూ.. సభలు ఉత్సాహం నింపారు. టీఆర్‌ఎస్‌ గ్రేటర్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎల్బీనగర్‌లో నిర్వహించిన బహిరంగ సభకు ప్రజలు భారీ ఎత్తున హాజరయ్యారు. ముఖ్యమంత్రి వేదిక పైకి రాగానే.. కార్యకర్తలు, అభిమానులు చప్పట్లు, కేరింతలతో ఈలలు వేస్తూ.. సభలు ఉత్సాహం నింపారు. సభకు వచ్చిన ప్రజలకు అభివాదం చేసిన కేసీఆర్‌ను చూసిన ప్రజలు చేతులెత్తి.. చప్పట్లు కొడుతూ తమ మద్ధతు తెరాసకే అని  తెలియజేశారు.