29.6 C
Hyderabad
Saturday, January 23, 2021

రేపటి నుంచి బతుకమ్మ చీరల పంపిణీ

బతుకమ్మ చీరెల పంపిణీకి రంగం సిద్ధమైంది. అర్హులైన కోటిమంది మహిళలకు రేపటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా చీరలు అందించనున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. తెల్లరేషన్ కార్డులో  పేరుండి, 18 ఏండ్లు నిండిన ఆడపడుచులకు చీరలను అందిస్తారు. మరమగ్గాలపై తయారు చేసిన 98.50 లక్షల చీరలు ఇప్పటికే 33 జిల్లాలకు చేరాయి.  ఈసారి 287 డిజైన్లతో ఆకర్షణీయంగా చీరలను తయారు చేశారు. బంగారు, వెండి జరీతో తీర్చిదిద్దారు. చీరల తయారికి 317 కోట్లు వెచ్చించారు.

 కరోనా నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకొని చీరెలను పంపిణీ చేయా లని జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. – ఈ మేరకు స్వయం సహాయక సంఘాల ద్వారా భౌతిక దూరాన్ని పాటిస్తూ చీరెలను ఇంటింటికీ పంపిణీ చేయనున్నారు. తెలంగాణ ఆడపడుచులు ఇంటింటా ఎంతో ఉత్సా హంగా జరుపుకొనే బతుకమ్మ పండుగకు పెద్దన్నగా, మేన మామ, తండ్రిగా సీఎం కేసీఆర్ బతుకమ్మ చీరెలను అందిస్తున్నారు. బతుకమ్మ చీరెల తయారీ, పంపిణి వెనుక ముఖ్య మంత్రి ద్విముఖ వ్యూహం అనుసరించారు. 

బతుకుమ్మ చీరలను  సిరిసిల్ల, ఘర్షకుర్తి, వరంగల్ లో మరమగ్గాలపై తయారుచేయించారు. మరమగ్గ నేతన్నలకు ఉపాధి కల్పించటం, అదే సమయంలో ఆడపడుచులకు చిరుకానుక అందించటం ముఖ్యమంత్రి  కేసీఆర్ ఉద్దేశం. ఈ చీరెల తయారీతో ఆరు నెలలపాటు 15వేల మంది నేతన్నలకు రెండు షిప్టుల్లో పనిదొరికింది

- Advertisement -

Latest news

Related news

ముత్తూట్ చోరీని ఛేదించిన సైబరాబాద్ పోలీసులు

తమిళనాడు హోసూరులోని ముత్తూట్‌ ఫైనాన్స్‌ చోరీ కేసును సైబరాబాద్ పోలీసులు చేధించారు. ఈ చోరీకి పాల్ప‌డిన ఎనిమిది మంది స‌భ్యుల ముఠా‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి  25...

ఆర్జీవీ ‘డీ కంపెనీ’ ట్రైలర్ రిలీజ్

డైరెక్టర్ రామ్‌ గోపాల్‌వర్మ రూపొందిస్తున్న  ‘డీ కంపెనీ- అండర్ వరల్డ్ ఎంటర్ ప్రైజ్`  ట్రైలర్ రిలీజ్ అయింది. శనివారం ఈ సినిమా ట్రైలర్ ని తన ట్విటర్లో విడుదల చేశారు....

ఢిల్లీ ఎయిమ్స్ కు లాలూ

ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం మరింత క్షీణించింది. మెరుగైన చికిత్స  అందించేందుకు వీలుగా ఆయన్ను ఢిల్లీలోని ఎయిమ్స్ కు తరలించనున్నారు. ఆయన గత కొంత కాలంగా శ్వాసకోశ...

‘బర్నింగ్ స్టార్’ కు గాయాలు

టాలీవుడ్ 'బర్నింగ్ స్టార్' సంపూర్ణేశ్ బాబు ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. శనివారం 'బజార్ రౌడీ' అనే సినిమా క్లైమాక్స్ షూటింగ్‌లో.. ఎత్తు నుంచి బైక్ పై కిందకు దూకాల్సిన...