29.8 C
Hyderabad
Tuesday, January 26, 2021

రైతుని రాజుగా చూడాలన్నదే సీఎం కేసీఆర్‌ లక్ష్యం : మంత్రి ఎర్రబెల్లి

జనగామ : రైతే రాజు అనడం కాదు. నిజంగా రైతుని రాజుగా చూడాలన్నదే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ లక్ష్యమని రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. నియంత్రిత పద్దతిలో పంటలు సాగు చేయాల్సిన అవసరం, రైతులు తమ ఉత్పత్తుల ద్వారా మంచి ధరలు పొంది లాభపడాల్సిన ఆవశ్యక్తపై జనగామ జిల్లాలో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌ రెడ్డి, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ బోడకుంటి వెంకటేశ్వర్లు, జడ్పీ చైర్మన్‌, ఎంపీలు, ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, తాటికొండ రాజయ్య, జిల్లా రైతు సమన్వయ సమితి చైర్మన్‌, సభ్యులు, జిల్లా కలెక్టర్‌, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… ప్రభుత్వం చెప్పిన విధంగా లాభసాటి పంటలు వేసి రైతులు బాగు పడాలనేది సీఎం కేసీఆర్‌ సంకల్పమన్నారు.

ఏయే ప్రాంతాలలో ఏయే పంటలు వేస్తే లాభసాటిగా ఉంటుందో ప్రభుత్వమే నిర్ణయిస్తుందన్నారు. వ్యవసాయశాఖ వద్ద శాస్త్రవేత్తలు రూపొందించిన పంటల ప్రణాళిక సిద్ధంగా ఉందన్నారు. ప్రభుత్వం సూచించిన పంటలు వేస్తేనే రైతుబంధు వంటి ప్రయోజనాలు అందుతాయన్నారు. ప్రభుత్వమే రైతులకు పెట్టుబడులు పెట్టి, రాయితీలు ఇచ్చి, రుణమాఫీలు చేసి, ఏ పంటలు వేయాలో చెప్పి, వాటికి డిమాండ ఎలా ఉందో, మార్కెట్‌ ఎలా ఉంటుందో ముందే నిర్దారించి రైతులను ప్రోత్సహిస్తున్న కేసీఆర్‌ లాంటి సీఎం గానీ, టీఆర్‌ఎస్‌ లాంటి ప్రభుత్వం గానీ, తెలంగాణ వంటి రాష్ట్రం గానీ దేశంలోనే కాదు చరిత్రలో కూడా లేదని మంత్రి పేర్కొన్నారు.  

- Advertisement -

Latest news

Related news

59 టాప్ చైనా యాప్‌ల‌పై శాశ్వత నిషేధం!

టిక్‌టాక్‌, ప‌బ్‌జీ, వీచాట్ స‌హా 59 టాప్ చైనా యాప్‌ల‌పై కేంద్ర ఎల‌క్ట్రానిక్స్, ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ మంత్రిత్వ శాఖ‌ శాశ్వత నిషేధం విధించిన‌ట్లు సమాచారం. డేటా నిబంధనలు పాటించడం లేదని...

ఇద్దరు సీనియర్ అధికారులపై ఎస్ఈసీ బదిలీ వేటు

ఏపీ పంచాయతీ ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో నిర్లక్ష్యం వహించిన పంచాయతీరాజ్‌ శాఖ అధికారులపై ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ కొరడా ఝలిపించారు. సీనియర్‌ అధికారులు గోపాలకృష్ణ ద్వివేది, గిరిజా శంకర్‌పై బదిలీ...

లద్ధాఖ్‌లో రిపబ్లిక్ డే.. ఫోటోస్ చూశారా?

దేశవ్యాప్తంగా రిపబ్లిక్ డే వేడుకలు గ్రాండ్‌గా జరుగుతున్నాయి. ఢిల్లీలోని రాజ్‌పథ్‌లో పరేడ్ వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి. ఇదే టైంలో గడ్డ కట్టే మైనస్ డిగ్రీల చలిలో లద్ధాఖ్ లో కూడా...

మోదీ తలపాగా వెరీ స్పెషల్.. ఎవరిచ్చారంటే..

భారత 72వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో  ప్రధాని నరేంద్ర మోదీ ధరించిన తలపాగా(టర్బన్) అందర్నీ విశేషంగా ఆకర్షించింది. నేషనల్ వార్ మెమోరియల్ వద్ద అమరవీరులకు శ్రధ్ధాంజలి ఘటించే సమయంలోను.. ఆ...