27.4 C
Hyderabad
Monday, July 13, 2020

రైతును రాజు చేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యం

మహబూబాబాద్ : వ్యవసాయం అంటే దండగ కాదు పండగ చేయాలని, రైతును రాజు చేయాలని సీఎం కేసీఆర్ నిత్యం ఆలోచిస్తున్నారని గిరిజన సంక్షేమ, స్త్రీ – శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్దేశించిన నియంత్రిత సాగు పై రైతులకు అవగాహన కల్పించేందుకు మహబూబాబాద్ జిల్లా, బయ్యారం మండలం, గౌరారం గ్రామంలో నిర్వహించిన రైతు సదస్సులో ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాతూ రాష్ట్ర ఎండలు తీవ్రంగా ఉన్నాయి. రోహిణి రాగానే నార్లు పోసుకుంటాం.అయితే ఒకప్పుడు కరెంట్ కష్టాలతో పంటలు సరిగా పండకపోయేది. నేడు సీఎం కేసీఆర్ వల్ల ఇప్పుడు కరెంట్ పోవడమనేదే లేదు.వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంట్, రైతు బంధు ద్వారా పెట్టుబడి, నీటి తీరువా రద్దు చేసి పుష్కలమైన నీరు అందిస్తూ రైతులు ఆర్థికంగా ఎదిగేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు.

ఇక్కడ కొంతమందికి రైతు బంధు రావడం లేదన్నారు. రైతు బంధు రానివారందరికి వచ్చేలా చూడాలని కలెక్టర్ కు సూచించారు. సీతారామ ప్రాజెక్టును మరింత ముందుకు తీసుకొచ్చి బయ్యారం చెరువును నింపాలని సీఎం కేసీఆర్ ని కోరానని, ఒక టీఎంసీ నీటి సామర్ధ్యం తో ఈ చెరువు సామర్ధ్య పెంచాలని నిర్ణయించినట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ ఆలోచన మేరకు ప్రభుత్వం సూచించిన పంటలు ఈ వానాకాలంలో వేసి రైతులు సంతోషంగా ఉండాలన్నారు. సీతారామా ప్రాజెక్టు ను బయ్యారం వరకు తెచ్చి నీళ్ళు అందిస్తాం. కావున అధికారులు సూచించిన పంటలే వేయాలని రైతులను కోరారు. 

- Advertisement -

Latest news

ఉపాధి, ఇతర రంగాలపై కరోనా ‌తీవ్ర ప్రభావం చూపింది- ఆర్‌బీఐ గవర్నర్

దేశంలో వందేళ్లలో ఎన్నడూలేని పరిస్థితులు నెలకొన్నాయని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. ఎస్‌బీఐ బ్యాంకింగ్‌, ఎకనమిక్‌ కాన్‌క్లేవ్‌లో పాల్గొన్న ఆయన, ప్రస్తుత సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు ఆర్‌బీఐ అన్ని...

Related news

ఉపాధి, ఇతర రంగాలపై కరోనా ‌తీవ్ర ప్రభావం చూపింది- ఆర్‌బీఐ గవర్నర్

దేశంలో వందేళ్లలో ఎన్నడూలేని పరిస్థితులు నెలకొన్నాయని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. ఎస్‌బీఐ బ్యాంకింగ్‌, ఎకనమిక్‌ కాన్‌క్లేవ్‌లో పాల్గొన్న ఆయన, ప్రస్తుత సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు ఆర్‌బీఐ అన్ని...

అంబర్‌పేట ఫ్లైఓవర్‌ నిర్మాణం త్వరలో పూర్తి:మంత్రి కేటీఆర్

లాక్‌డౌన్‌తో మార్చి నెల నుంచి ఇప్పటివరకు జీహెచ్‌ఎంసీలో నాలుగు రెట్ల వేగంతో పనులను పూర్తిచేశామని, తొమ్మిది నెలల్లో జరగాల్సిన పనులు లాక్‌డౌన్‌ వల్ల రెండు నెలల్లోనే పూర్తయ్యాయని మంత్రి కేటీఆర్‌...

జమ్మూకాశ్మీర్ లో ఎన్ కౌంటర్, ఇద్దరు ఉగ్రవాదులు హతం

జమ్మూకశ్మీర్‌ లో ఉగ్రవాదులకు చెక్‌ పెడుతున్నాయి భద్రతా బలగాలు. ఉత్తర కశ్మీర్‌ లోని నౌగామ్‌ సెక్టార్‌ లోకి అక్రమంగా చొచ్చుకువచ్చిన ఇద్దరు టెర్రరిస్టులను మట్టుబెట్టాయి. ఉగ్రవాదుల మృతదేహాల వద్ద రెండు...

జపాన్‌లో వరదలు….66మంది మృతి

నేపాల్‌, జపాన్‌ దేశాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. నేపాల్‌ లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వరదలు పోటెత్తుతున్నాయి.వరదల దాటికి వేలాది ఇండ్లు కొట్టుకుపోయాయి. దీనికి తోడు కొండచరియలు విరిగిపడుతుండడంతో...