24.7 C
Hyderabad
Sunday, July 5, 2020

రైతుబంధుపై దుష్ప్రచారం నమ్మొద్దు

రైతుబంధు పథకంపై కాంగ్రెస్‌ నేతలు చేస్తున్న దుష్ప్రచారాన్ని నమ్మొద్దని మంత్రి కేటీఆర్‌ రైతులకు విజ్ఞప్తి చేశారు. రంగనాయకసాగర్‌ నుంచి ముస్తాబాద్‌ మండలానికి గోదావరి జిలాలు చేరుకున్న సందర్భంగా బదనకల్‌ చెరువు వద్ద గోదావరి జలాలకు మంత్రి కేటీఆర్‌ హారతి ఇచ్చారు.  రైతు బంధు పథకం కింద గతంలో వచ్చినంత సొమ్ము ఈ ఏడాది కూడా రైతులకు అందుతుందని స్పష్టం చేశారు. సముద్రమట్టానికి 680 మీటర్ల ఎత్తులో ఉన్న ప్రాంతానికి సీఎం కేసీఆర్‌ గోదావరి జలాలు తీసుకొచ్చారని వివరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 660 చెరువులను గోదావరి జలాలతో నింపుతామని హామీ ఇచ్చారు.   జలకళతో రైతులతో పాటు కులవృత్తులవారు కూడా బాగుపడుతున్నారని వివరించారు. రైతుల బాగు కోసం సూచించిన పంటలసాగుపై కొందరు విమర్శలు చేయడం తగదన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం 60 ఏళ్లలో చేయని పనిని సీఎం కేసీఆర్‌ ఆరేళ్లలో చేసి చూపించారని మంత్రి కేటీఆర్‌ అన్నారు.

- Advertisement -

Latest news

కంటోన్మెట్‌ ప్రాంతంలో కూడా సంక్షేమ కార్యక్రమాలు

నగరంలోని కంటోన్మెంట్‌ భూములను ఆక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ హెచ్చరించారు. కంటోన్మెంట్‌ అభివృద్ధిపై సీఎం కేసీఆర్‌ ప్రత్యేక దృష్టి సారించారని చెప్పారు. మంత్రి మల్లారెడ్డితో...

Related news

కంటోన్మెట్‌ ప్రాంతంలో కూడా సంక్షేమ కార్యక్రమాలు

నగరంలోని కంటోన్మెంట్‌ భూములను ఆక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ హెచ్చరించారు. కంటోన్మెంట్‌ అభివృద్ధిపై సీఎం కేసీఆర్‌ ప్రత్యేక దృష్టి సారించారని చెప్పారు. మంత్రి మల్లారెడ్డితో...

రౌడీ షీటర్ వికాస్ దూబే ఇంటిని కూల్చివేసిన అధికారులు

ఉత్తరప్రదేశ్‌లో ఎనిమిది మంది పోలీసుల మృతికి కారణమైన రౌడీ షీటర్ వికాస్ దూబే ఇంటిని కూల్చివేశారు అధికారులు. కాన్పూర్‌లో నిన్న వికాస్ దూబే కోసం వెళ్లిన పోలీసులపై అతని గ్యాంగ్...

చైనాలో పర్యటించనున్న డబ్లూహెచ్‌వో బృందం

కరోనా వైరస్ ఎక్కడ పుట్టింది? ఎలా పుట్టిందనే వివరాలు తెలుసుకునేందుకు డబ్లూహెచ్‌వో బృందం రంగంలోకి దిగనుంది. వైరస్ తొలుత వెలుగుచూసిన చైనాలోని వుహాన్‌లో డబ్లూహెచ్‌వో టీం పర్యటించనుంది. వచ్చే వారంలో...

కరోనా వ్యాప్తిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక ప్రకటన

ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతున్న కరోనా వ్యాప్తిపై వివరాలను అందించడంలో చైనా ఆలస్యం చేసిందనే వివాదం నేపథ్యంలో  డబ్ల్యూహెచ్ఓ కీలక ప్రకటన చేసింది. కోవిడ్‌ పై సమాచారం చైనాలోని ప్రపంచ ఆరోగ్య సంస్థ కార్యాలయమే తెలియజేసిందని...