27.2 C
Hyderabad
Friday, December 4, 2020

రైతుల అభిప్రాయం మేరకే పంటల నియంత్రిత పద్ధతి

కరీంనగర్ ‌: సీఎం కేసీఆర్ రైతులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు, నిపుణుల అభిప్రాయం మేరకే పంటల నియంత్రిత పద్ధతిని అమలులోకి తెస్తున్నారని  వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. కరీంనగర్‌ కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో కరీంనగర్‌, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల అధికారులతో సమగ్ర వ్యవసాయ ప్రణాళికపై మంత్రులు కొప్పుల ఈశ్వర్‌, గంగుల కమలాకర్‌తో కలిసి సమీక్ష నిర్వహించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో మొదటిసారిగా మన అవసరాలకు అనుగుణంగా పంటల సాగు చేస్తున్నామని తెలిపారు. కొత్తగా సంస్కరణలు తెచ్చే సమయంలో సహజంగా కొంత భయం, సందేహం ఉంటుందని, అయితే ఈ విషయంలో రైతులు భయపడాల్సిన పని లేదన్నారు. 

గతంలో వ్యవసాయం అంటే వర్షాల కోసం ఎదురు చూసేవారిమని, ప్రాజెక్టులు అందుబాటులోకి వచ్చిన ప్రస్తుత సమయంలో రోహిణీ కార్తిలోనే పంటలు సాగు చేసుకోవడం మంచిదన్నారు. సీఎం కేసీఆర్‌ ఐదేళ్లలో భగీరథ ప్రయత్నం చేసి ప్రాజెక్టులు నిర్మించి బీడు భూములకు గోదావరి, కృష్ణా జలాలను మళ్లించారని చెప్పారు. నీటిని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలనే లక్ష్యంతో రాష్ర్టానికి అవసరమైన పంటలు పండించాలనే ఆలోచనతో నియంత్రిత సాగు పద్ధతి తెచ్చారని తెలిపారు. కరీంనగర్‌ ఉమ్మడి జిల్లాలో వానకాలం సాగుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచుతున్నామని, వాన కాలం వరిలో సన్నాలు, పత్తి, కంది పంటలను ఎక్కువగా ప్రోత్సహిస్తున్నామని చెప్పారు.

 సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్‌ పంటల నియంత్రిత సాగు పద్ధతిని ముందుకు తెచ్చారని, ఈ విధానం దేశానికి మార్గదర్శకం కాబోతున్నదని తెలిపారు. బీసీ సంక్షేమం, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ మాట్లాడుతూ డిమాండ్‌, ప్రొడక్ట్‌, కంజమ్షన్‌ విధానంలో వ్యవసాయం ఉండాలని సీఎం కేసీఆర్‌ ఆలోచిస్తున్నారని, రైతులు అందుకు అనుగుణంగా పంటలు సాగు చేస్తే మరింత అభివృద్ధిని సాధిస్తారని సూచించారు. 

- Advertisement -

Latest news

Related news

బొంతు శ్రీదేవి విజయం – కొనసాగుతున్న కారు హవా

గ్రేటర్ ఫలితాల్లో కారు టాప్ గేరులో దూసుకుపోతోంది. అత్యధిక స్థానాల్లో టీఆర్ఎస్‌ జోరు చూపిస్తోంది. ఇప్పటికే 29 చోట్ల విజయం సాధించిన గులాబీ...

మహారాష్ట్రలో బీజేపీకి బిగ్ షాక్

మహారాష్ట్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి గట్టిదెబ్బ తగిలింది. మొత్తం ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగితే.. కేవలం ఒకే ఒక్కచోట కష్టపడి విజయం సాధించింది. అది కూడా స్థానిక సంస్థల...

డిప్యూటీ మేయర్ మళ్లీ గెలిచాడు

గ్రేటర్ ఎన్నికల ఫలితాల్లో కారు దుమ్ము రేపుతోంది. అందరూ ఊహించినట్టుగానే.. టీఆర్ఎస్ అభ్యర్థులు విజయ బావుటా ఎగురవేస్తున్నారు.

కూకట్ పల్లిలో.. టాప్ గేర్

ఉత్కంఠ రేకెత్తించిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాల్లో.. కారు జోరు మీదున్నది. పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లలో కాస్త వెనకబడ్డట్టు అనిపించినా.. సాధారణ ఓట్ల లెక్కింపులో.. తొలిరౌండ్ నుంచే దుమ్ము రేపింది.