22.9 C
Hyderabad
Friday, December 4, 2020

రైతు రాజు కావాలన్నది నినాదం కాదు.. మా విధానం

సిద్ధిపేట : నియంత్రిత పంట సాగు కాదు.. ఇవాళ్టి నుంచి ప్రాధాన్య పంట సాగు అందామని, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. జిల్లాలోని  దాతర్ పల్లి గ్రామంలోవాన కాలం -2020 నియంత్రిత పంటల సాగు విధానంపై నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి మంత్రి, జెడ్పీ చైర్ పర్సన్ వేలేటి రోజాశర్మ, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డితో కలిసి హాజరయ్యారు. దాతర్ పల్లిలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ రైతే రాజు కావాలన్నది నినాదం. కానీ  అది విధానంగా మారాలన్నారు. దాతర్ పల్లి అంటే.. ఆదర్శమని, పోయిన యేడాది సన్నరకం వరి పండించి సేంద్రియ ఎవుసం చేశామని, ఈ గ్రామానికి చెందిన సత్యనారాయణ రైతు తనకు బస్తా బియ్యం ఇచ్చారని మంత్రి గుర్తు చేశారు.

పేలిపోయే ట్రాన్స్ ఫార్మర్లు, కాలిపోయే మోటార్లతో ఒకప్పుడు రైతు బతుకు వెళ్లదీసే వారని, సీఎం కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఒక్క గుంట ఎండలేదు, ఒక గంట కరెంటు పోలేదన్నారు. నాడు ఎరువులు కావాలంటే.. క్యూలో నిల్చొవాల్సిన పరిస్థితి. కానీ ఇవాళ మీ ఊర్లకే మందు యూరియా బస్తాలు పంపుతున్నామని మంత్రి పేర్కొన్నారు.  ప్రాధాన్యత పంట సాగులో రాష్ట్రానికే గజ్వేల్ నియోజకవర్గం ఆదర్శమైంది. నియోజక వర్గంలోని 8 మండలాల్లో 5 మండలాలు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపాయని, వాటిలో 173 గ్రామాలకు 167 గ్రామాలు ప్రాధాన్యత పంట సాగుకు ఏకగ్రీవం చేసిన నియోజకవర్గ మండలాలు, గ్రామ ప్రజాప్రతినిధులను మంత్రి అభినందించారు. ఎవుసంలో దాతర్ పల్లిని ఆదర్శంగా చేద్దామని, ఈ వానా కాలం గ్రామంలో 656 ఎకరాల్లో.. 27 ఎకరాలు సన్నరకం, 28 ఎకరాలు దొడ్డు రకం వరి పంట, యాసంగిలోనే మొక్కజొన్న పంట, గతంలో 365 ఎకరాల్లో వేసిన పత్తికి, ఈ వానా కాలంలో 381 ఎకరాల్లో పత్తి పంట వేయాలని నిర్ణయించి తీర్మానించిన గ్రామస్తులను  మంత్రి అభినందించారు.

- Advertisement -

Latest news

Related news

బొంతు శ్రీదేవి విజయం – కొనసాగుతున్న కారు హవా

గ్రేటర్ ఫలితాల్లో కారు టాప్ గేరులో దూసుకుపోతోంది. అత్యధిక స్థానాల్లో టీఆర్ఎస్‌ జోరు చూపిస్తోంది. ఇప్పటికే 29 చోట్ల విజయం సాధించిన గులాబీ...

మహారాష్ట్రలో బీజేపీకి బిగ్ షాక్

మహారాష్ట్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి గట్టిదెబ్బ తగిలింది. మొత్తం ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగితే.. కేవలం ఒకే ఒక్కచోట కష్టపడి విజయం సాధించింది. అది కూడా స్థానిక సంస్థల...

డిప్యూటీ మేయర్ మళ్లీ గెలిచాడు

గ్రేటర్ ఎన్నికల ఫలితాల్లో కారు దుమ్ము రేపుతోంది. అందరూ ఊహించినట్టుగానే.. టీఆర్ఎస్ అభ్యర్థులు విజయ బావుటా ఎగురవేస్తున్నారు.

కూకట్ పల్లిలో.. టాప్ గేర్

ఉత్కంఠ రేకెత్తించిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాల్లో.. కారు జోరు మీదున్నది. పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లలో కాస్త వెనకబడ్డట్టు అనిపించినా.. సాధారణ ఓట్ల లెక్కింపులో.. తొలిరౌండ్ నుంచే దుమ్ము రేపింది.