28.5 C
Hyderabad
Thursday, July 9, 2020

లాక్‌డౌన్‌ 4.0

కరోనాపై పోరులో కునారిల్లిన భారత ఆర్థిక వ్యవస్థను మళ్లీ గాడిలో పెట్టేందుకు ప్రధాని నరేంద్ర మోదీ 20 లక్షల కోట్లతో భారీ ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించారు. కార్పొరేట్‌ రంగం నుంచి రైతుల వరకు, చిన్న పరిశ్రమల నుంచి వలసకూలీల వరకు ప్రతీ ఒక్కరూ తిరిగి పుంజుకునేందుకు అవసరమైన శక్తిని ఈ ప్యాకేజీ ఇస్తుందన్నారు. లాక్‌ డౌన్‌ కారణంగా దెబ్బతిన్న వివిధ వర్గాల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపేందుకు ఆత్మనిర్భర్‌ భారత్‌ అభియాన్‌ పేరుతో భారీ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభిస్తామన్నారు. దేశ జీడీపీలో ఈ ప్యాకేజీ విలువ 10 శాతమని ప్రధాని వెల్లడించారు.

దేశంలో నాలుగోసారి లాక్‌డౌన్‌ విధించబోతున్నామని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. నాలుగో దఫా లాక్‌డౌన్‌ వివరాలు ఈ నెల 18 లోపు వెల్లడిస్తామని చెప్పారు. నాలుగో దశ లాక్‌డౌన్‌ కొత్త రూపంలో ఉంటుందన్నారు. కరోనా సంక్షోభానికి భయపడి మన ప్రయాణాన్ని ఆపేయకూడదన్నారు. కరోనా వైరస్‌ నియంత్రణకు ప్రతి ఒక్కరం మాస్కులు కట్టుకుందాం.. ఆరు అడుగుల దూరం పాటిద్దామని మోదీ పిలుపునిచ్చారు. ఈ విధంగా చేస్తే కరోనాను సాధ్యమైనంత వరకు అరికట్టవచ్చన్నారు.

కరోనా వైరస్‌ నుంచి మనం మనల్ని కాపాడుకుంటూనే ముందుకు సాగాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఇలాంటి పరిస్థితిని మునుపెన్నడూ చూడలేదన్నారు. కరోనాకు ముందు కరోనా తర్వాత విశ్లేషించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. కరోనా తెచ్చిన ఆపదలను అవకాశాలుగా మలుచుకుంటున్నామన్నారు. కరోనాకు ముందు దేశంలో ఒక్క పీపీఈ కిట్టు కూడా తయారు కాలేదన్నారు. దేశంలో ఎన్ -95 మాస్కులు కూడా నామమాత్రంగా తయారయ్యేవని.. ఇప్పుడు పీపీఈ కిట్లు, మాస్కుల తయారీలో స్వయం సమృద్ధి సాధించామన్నారు.

కరోనా సంక్షోభంతో స్థానిక ఉత్పత్తులు, తయారీరంగం ప్రాధాన్యం మరోసారి తెలిసి వచ్చిందన్నారు ప్రధాని నరేంద్రమోదీ. ప్రతి భారతీయయుడు స్థానిక ఉత్పత్తులను విధిగా కొనుగోలు చేసి వాటి గురించి ప్రచారం చేయాలన్నారు. స్థానికత అనేది మన జీవనమంత్రం కావాలని పిలుపునిచ్చారు. ప్రజలంతా స్థానిక ఉత్పత్తులను కొనుగోలు చేసిప్రచారం చేస్తే అంతర్జాతీయ గుర్తింపు వస్తుందన్నారు.

ప్రధానమంత్రి మోదీ ప్రకటించిన 20 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రపంచంలోని అతిపెద్ద ప్యాకేజీల్లో ఒకటిగా నిలిచింది. దీని విలువ మన జీడీపీలో దాదాపు పదిశాతం. అమెరికా ప్రకటించిన ప్యాకేజీ విలువ ఆదేశ జీడీపీలో 13శాతం ఉండగా.. జపాన్‌ ఏకంగా ఆదేశ జీడీపీలో 21శాతంతో సమానమైన మొత్తాన్ని ప్యాకేజీగా ప్రకటించింది.

- Advertisement -

Latest news

గ్రీన్ ఇండియా ఛాలెంజ్…మొక్కలు నాటిన రాకింగ్ రాకేష్

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 3వ విడతలో భాగంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో పౌండర్ రాఘవ విసిరిన గ్రీన్ చాలెంజ్...

Related news

గ్రీన్ ఇండియా ఛాలెంజ్…మొక్కలు నాటిన రాకింగ్ రాకేష్

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 3వ విడతలో భాగంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో పౌండర్ రాఘవ విసిరిన గ్రీన్ చాలెంజ్...

చెట్లును రక్షించకపోతే…. గాలిని కొనుక్కోవాల్సిందే

చెట్లను కాపాడుకోకపోతే, భవిష్యత్తులో గాలిని కూడా కొనుక్కునే రోజులు వచ్చే ప్రమాదముందని మంత్రి కేటీఆర్‌ హెచ్చరించారు. తెలంగాణలోని హరిత శాతాన్ని పెంచేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి అని అన్నారు. ప్రతి...

తెలంగాణ అస్థిత్వాన్ని దెబ్బతీస్తే ఊరుకోం

సొంత గడ్డకు ద్రోహం చేయడమే తెలంగాణ కాంగ్రెస్ నేతల నైజమని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై విషం...

వరుసగా ఆరో రోజు..అదే జోరు

వరుసగా ఆరో రోజు స్టాక్‌ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్‌ 86 పాయింట్ల లాభంతో 36వేల 743 వద్ద కొనసాగుతుండగా.. నిఫ్టీ 22 పాయింట్లు...