27.5 C
Hyderabad
Thursday, July 16, 2020

‘లాక్‌’ ఎత్తేయకుంటే మరిన్ని మరణాలు

వాషింగ్టన్‌: లాక్‌డౌన్‌ ఎత్తివేయకుంటే నిరాశానిస్పృహలతో, ఒంటరితనంతో ప్రజలు మరింతమంది చనిపోతారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆందోళన వ్యక్తంచేశారు. లాక్‌డౌన్‌ను సడలించి వ్యాపారాలను పునరుద్ధరించే అంశంపై వివిధ దేశాలు ఆచితూచి స్పందించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ప్రకటించిన నేపథ్యంలో  ఆయన ఈ వ్యాఖ్య చేశారు.  కరోనా వైరస్‌ వ్యాప్తితో తమకు సంబంధం లేదని ఓ చైనా అధికారి చేసిన ప్రకటనపై ట్విట్టర్‌ వేదికగా ట్రంప్‌ ప్రతిస్పందిస్తూ ఆ దేశం ‘అసమర్థత’ వల్లే కరోనా మహమ్మారితో ప్రపంచ వ్యాప్తంగా సామూహిక మరణాలు సంభవిస్తున్నాయని ఆరోపించారు. కాగా, వివిధ దేశాల్లో సాధారణ పరిస్థితులు నెలకొంటున్న తరుణంలో వచ్చేనెలలో జీ-7 సదస్సు నిర్వహించి, చైనాను ఏకాకిని చేయాలని ట్రంప్‌ తలపోస్తున్నారు. 

3.9 కోట్ల ఉద్యోగాలు ఊస్ట్‌ 

  • కరోనా కారణంగా అమెరికాలో రెండు నెలల్లో ఉద్యోగాలు కోల్పోయిన వారు 3.9 కోట్ల మంది.
  • వీరికి అదనంగా.. సొంతగా వ్యాపారం చేసుకుంటున్న మరో 22 లక్షల మంది కూడా నిరుద్యోగ భృతి పొందనున్నారు.
  • ఇవన్నీ కలుపుకొంటే.. కరోనా వల్ల దాదాపు 4.1 కోట్ల మంది వీధిన  పడ్డట్టు అవుతుంది.
  • నిరుద్యోగిత రేటు ఏప్రిల్‌లో 14.7 శాతం ఉండగా.. ఈ నెలలో  20 శాతానికి, జూన్‌లో 25 శాతానికి పెరుగుతుందని అంచనా
- Advertisement -

Latest news

టర్కీ లో కూలిన విమానం…ఏడుగురు మృతి

టర్కీలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. మిలట్రీ విమానం కుప్పకూలి ఏడుగురు భద్రతా సిబ్బంది మృతి చెందారు. మిలిటెంట్లతో పోరాడుతున్న క్రమంలో 2,200 అడుగుల ఎత్తులో పర్వతంపై నుంచి కుప్పకూలింది.ఈ...

Related news

టర్కీ లో కూలిన విమానం…ఏడుగురు మృతి

టర్కీలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. మిలట్రీ విమానం కుప్పకూలి ఏడుగురు భద్రతా సిబ్బంది మృతి చెందారు. మిలిటెంట్లతో పోరాడుతున్న క్రమంలో 2,200 అడుగుల ఎత్తులో పర్వతంపై నుంచి కుప్పకూలింది.ఈ...

బీహార్‌ లో వరద ఉధృతికి కూలిన బ్రిడ్జ్

బీహార్ ను భారీ వ‌ర్షాలు ముంచెత్తుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో నదులు ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తున్నాయి. వ‌ర‌ద ఉధృతి ఎక్కువ అవ‌డంతో గోపాల్ గంజ్ లో గండ‌‌క్ న‌దిపై...

మధ్యప్రదేశ్‌ లో దారుణం….దళిత దంపతులపై పోలీసులు దాడి

చేతికొచ్చిన పంటను అధికారులు బుల్డోజర్‌ తో నాశనం చేయడాన్ని తట్టుకోలేకపోయిన భార్యభర్తలు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నాం చేశారు. మధ్య ప్రదేశ్‌ లోని గుణ జిల్లాలో పంటను పసిబిడ్డగా భావించి...

ముఖంపై చిరునవ్వు కన్నా మాస్కే అందం: చిరంజీవి

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. రోజురోజుకు రికార్డు స్థాయిలో నమోదు అవుతున్న కొత్త కేసులతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో మెగాస్ఠార్‌ చిరంజీవి మాస్కులపై...