29.6 C
Hyderabad
Wednesday, January 27, 2021

వరంగల్ 20 ఏండ్ల కల.. రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి భూమి అందజేత

రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి కోసం అనేక ఉద్యమాలు చేశామని చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. కాజీపేట జంక్షన్ ను డివిజన్ స్థాయి చేయాలని, వ్యాగన్ ఫ్యాక్టరీ కోసం 150 ఎకరాలను ప్రభుత్వం స్థల సేకరణ చేసేందుకు వీలుగా సీఎం కెసిఆర్ 57 కోట్ల నిధులు కేటాయించారన్నారు.

వరంగల్ ప్రజల 20ఏండ్ల కలైన రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కోసం స్థల సేకరణకు సహకరించిన సీఎం కెసిఆర్, మంత్రి కేటీఆర్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ  వరంగల్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం తరుపున కేంద్రాన్ని కోరుతున్నామన్నారు. విభజన హామీల్లో వరంగల్ కు కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వాలని ఉందని మంత్రి మరోసారి గుర్తుచేశారు.

వరంగల్‌ అర్బన్‌ జిల్లా ఖాజీపేటలో నిర్మించతలపెట్టిన రైల్వే వాగన్‌ ఫ్యాక్టరీ కోసం రాష్ట్ర ప్రభుత్వం భూమిని కేటాయించింది. మొత్తం 150.05 ఎకరాలకు పైగా భూమికి సంబంధించిన పత్రాలను రైల్వే అధికారులకు మంత్రి ఎర్రబెల్లి దయకర్‌ రావు అందచేశారు.

ఈ కార్యక్రమంలో చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎంపీలు బండ ప్రకాష్, పసునూరి దయాకర్, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యేలు అరూరి రమేష్, నన్నపునేని నరేందర్, మేయర్ గుండా ప్రకాష్ , కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు, మున్సిపల్ కమిషనర్, రైల్వే శాఖ అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Latest news

Related news

సీఎం గొప్ప లౌకికవాది.. మంత్రులు

సీఎం కేసీఆర్ గొప్ప లౌకికవాది, అన్ని మతాలను సమానంగా గౌరవం ఇస్తారని మంత్రులు కొప్పుల ఈశ్వర్, మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కొత్త సచివాలయంలో ప్రార్థనా మందిరాలను...

ర్యాలీపై ఆగ్రహం.. రైతుల అరెస్ట్.. ట్విట్టర్ ఖాతాలపై కన్ను

గణతంత్ర దినోత్సవం నాడు ఢిల్లీలో రైతులు చేపట్టిన ట్రాక్టర్ల ర్యాలీ ఉద్రిక్తంగా మారిన విషయం తెలిసిందే. అయితే.. ఈ విషయమై కేంద్ర హోం శాఖ చాలా సీరియస్ గా స్పందించింది....

కూతురుతో రహానె డ్యాన్స్.. వీడియో వైరల్

‘క్వారంటైన్‌లో తొలిరోజు సరదాగా గడిచిందంటూ..’ అజింక్య రహానె భార్య రాధిక ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కూతురుతో రహానె స్టెప్పులు వేస్తుండగా తీసిన వీడియోను ఆమె...

గణతంత్ర దినోత్సవం రోజున.. రణతంత్ర ర్యాలీ!

దేశ రాజధానిలో రైతులు చేపట్టిన ట్రాక్టర్ల ర్యాలీ ఉద్రిక్తతలకు దారి తీసి.. పలు హింసాత్మక ఘటనలకు కారణమయింది. రైతులకు, వ్యవసాయ రంగానికి నష్టం చేకూర్చేలా ఉన్నాయంటూ, మూడు సాగు చట్టాలను...