హైదరాబాద్ లోని వరద ముంపు ప్రాంతాల్లో మంత్రి కేటీఆర్ పర్యటిస్తున్నారు. మూడోరోజు పర్యటనలో భాగంగా.. ఖైరతాబాద్‌లోని బీఎస్ మక్తాలో ఏర్పాటు చేసిన GHMC షెల్టర్ హోమ్‌ను కేటీఆర్ పరిశీలించారు. వరద బాధితులకు అందిస్తున్న సౌకర్యాలపై ఆరా తీశారు. వరద బాధితులకు అవరసరమైన రేషన్ కిట్లతో పాటు అన్ని సౌకర్యాలను కల్పిస్తామని భరోసా కల్పించారు. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో పారిశుద్ధ్యానికి ప్రాధాన్యత ఇస్తామని కేటీఆర్ తెలిపారు. ప్రజలంతా తాగునీటి విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మంత్రి కేటీఆర్ వెంట ఎమ్మెల్యే దానం నాగేందర్‌తో జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ ఉన్నారు.