24.3 C
Hyderabad
Wednesday, November 25, 2020

వానాకాలం పంటల కొనుగోలు, యాసంగిలో నిర్ణీత పంటల సాగు విధానంపై నేడు సీఎం సమీక్ష

వానాకాలం పంటల కొనుగోలు, యాసంగిలో నిర్ణీత పంటల సాగు విధానంపై చర్చించేందుకు ఈ రోజు మద్యాహ్నం 2.30 గంటలకు ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. వ్యవసాయ, పౌర సరఫరాలు, మార్కెటింగ్ శాఖ మంత్రులు, ఉన్నతాధికారులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఈ సమావేశంలో పాల్గొంటారు. వానాకాలం పంటల కొనుగోలు కోసం రాష్ట్ర వ్యాప్తంగా చేసిన ఏర్పాట్లపై సమీక్షిస్తారు. యాసంగిలో  పంటల సాగుపై చర్చిస్తారు. ముఖ్యంగా మక్కల సాగుపై విధాన నిర్ణయం తీసుకుంటారు. గత ఏడాది ఎన్ని ఎకరాల్లో మక్కలు వేశారు? వాటికి ఎంత ధర వచ్చింది? తదితర వివరాలను సమావేశానికి తీసుకురావల్సిందిగా అధికారులను సిఎం ఆదేశించారు. యాసంగిలో మక్కల సాగు చేయడం వల్ల లాభమా? నష్టమా? దేశంలో మక్కల మార్కెట్ పరిస్థితి ఏంటి? తదితర అంశాలపై చర్చించి, నిర్ణయం తీసుకుంటారు.

- Advertisement -

Latest news

Related news

జమ్మూకశ్మీర్‌ ను ముంచెత్తుతున్న మంచు

జమ్మూకశ్మీర్‌ ను ముంచు ముంచెత్తుతుంది. 8 జిల్లాల్లో భారీ హిమపాతం కురుస్తుండటంతో జమ్మూకశ్మీర్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ డిపార్టుమెంట్ జనం బయటికి రావొద్దంటూ హెచ్చరించింది. ఇటు లడఖ్, కుప్వారా, బండిపొరా ప్రాంతాల్లో...

భారత్‌ లో 92లక్షలు దాటిన కరోనా కేసులు

భారత్‌ లో కరోనా తీవ్రత కొనసాగుతోంది. దేశంలో బాధితుల సంఖ్య 92లక్షలు దాటింది. నిన్నటికి నిన్న 44 వేల 376 కొత్త కేసులు వెలుగులోకి రాగా.. మొత్తం కేసుల సంఖ్య...

అహ్మద్‌ పటేల్‌ మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు అహ్మద్ పటేల్ మరణం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అహ్మద్ పటేల్ తో తనకున్న అనుబంధాన్ని గుర్తు...

తమిళనాడు, పుదుచ్చేరిలో భారీ నుంచి అతి భారీ వర్షాలు

నివర్‌ తుపాను తీవ్ర రూపం దాల్చింది. దీని ప్రభావంతో తమిళనాడు. పుదుచ్చేరిలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలు, ఈదురు గాలులతో తీర ప్రాంతాలు అతలాకుతలం...