27.2 C
Hyderabad
Friday, December 4, 2020

విశాఖ ఫార్మా కంపెనీలో భారీ అగ్నిప్రమాదం

విశాఖ పరవాడ ఫార్మా సిటీలో సోమవారం రాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది. రాంకీ కోస్టల్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ ప్రాజెక్టు (సీఈటీపీ) సాల్వెంట్‌ పరిశ్రమలో సోమవారం రాత్రి 10:20 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరికి గాయాలయ్యాయని, మిగతా వారంతా క్షేమంగా ఉన్నారని జిల్లా కలెక్టర్‌ వినయ్‌చంద్, పోలీసు కమిషనర్‌ ఆర్‌కే మీనా తెలిపారు. 

ఫార్మాసిటీలోని వేర్వేరు కంపెనీల్లో మందులు తయారుచేసే క్రమంలో వచ్చే ఓ రకమైన వృథా ఆయిల్‌ను తిరిగి శుభ్రపరిచే ప్రక్రియ ఈ సాల్వెంట్స్‌ కంపెనీలో జరుగుతున్నది. రాత్రి షిఫ్ట్‌ మొదలైన కొద్దిసేపటికే ఈ ప్రమాదం చోటుచేసుకున్నది. అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటలను ఆర్పుతున్నారు. కంపెనీలో రియాక్టర్‌ పేలడంతోనే ప్రమాదం సంభవించిందని స్థానికులు అనుమానిస్తున్నారు. 17 సార్లు పేలుడు శబ్దాలు వినిపించాయని సమాచారం. ఎల్జీ పాలిమర్స్‌ ఘటన నుంచి బయటపడకముందే మరో ప్రమాదం జరుగడంపై విశాఖవాసుల్లో ఆందోళన కనిపిస్తున్నది.

- Advertisement -

Latest news

Related news

మహారాష్ట్రలో బీజేపీకి బిగ్ షాక్

మహారాష్ట్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి గట్టిదెబ్బ తగిలింది. మొత్తం ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగితే.. కేవలం ఒకే ఒక్కచోట కష్టపడి విజయం సాధించింది. అది కూడా స్థానిక సంస్థల...

డిప్యూటీ మేయర్ మళ్లీ గెలిచాడు

గ్రేటర్ ఎన్నికల ఫలితాల్లో కారు దుమ్ము రేపుతోంది. అందరూ ఊహించినట్టుగానే.. టీఆర్ఎస్ అభ్యర్థులు విజయ బావుటా ఎగురవేస్తున్నారు.

కూకట్ పల్లిలో.. టాప్ గేర్

ఉత్కంఠ రేకెత్తించిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాల్లో.. కారు జోరు మీదున్నది. పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లలో కాస్త వెనకబడ్డట్టు అనిపించినా.. సాధారణ ఓట్ల లెక్కింపులో.. తొలిరౌండ్ నుంచే దుమ్ము రేపింది.

కారుకు తొలివిజయం

గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ ఖాతాలో తొలి విజ‌యం న‌మోదైంది. యూసుఫ్‌గూడ డివిజ‌న్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి రాజ్‌కుమార్ ప‌టేల్ విజ‌యం సాధించారు....