19.8 C
Hyderabad
Friday, December 4, 2020

వైద్యశాఖలో సమూల మార్పులు: ఈటెల రాజేందర్‌

రాష్ట్రంలో వైద్యశాఖలో సమూల మార్పులు చేసి,  పేదలకు కార్పొరేట్‌ స్థాయిలో  వైద్యం అందించేందుకు  సీఎం కేసీఆర్‌ ప్రత్యేక ప్రణాళికను రూపొందిస్తున్నారని మంత్రి ఈటెల రాజేందర్‌ చెప్పారు.  శాసనసభలో ప్రభుత్వ  ఆసుపత్రుల్లో  వైద్యం,  మెడికల్‌ కాలేజీల ఏర్పాటుపై పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు.  సంగారెడ్డి జిల్లాలో వైద్య కళాశాల ఏర్పాటుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నరు. గత యాభై ఏళ్లలో ఒక్క మెడికల్‌ కాలేజీ తెలంగాణలో ఏర్పాటు చేయలేదని, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పడ్డ యాభై నెలల కాలంలోనే కొత్తగా ఆరు ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలను ఏర్పాటు చేశామన్నరు. అటు జీహెచ్‌ఎంసీ పరిధిలో ఇప్పటికే 200 బస్తీ దవాఖాలను ఏర్పాటు చేశామని, మరో 150 బస్తీ దవాఖానాల ఏర్పాటుకు కసరత్తు జరుగుతుందని మంత్రి ఈటెల చెప్పారు.

- Advertisement -

Latest news

Related news

ఫ్రంట్ లైన్ సిబ్బంది.. డేటాబేస్ రెడీ చేయండి : సీఎస్ సోమేష్ కుమార్

తెలంగాణ రాష్ట్రంలో కొవిడ్-19 వ్యాక్సినేషన్ నిమిత్తం మొదటి ప్రాధాన్యతగా ఫ్రంట్ లైన్ వర్కర్స్ అయిన ఆరోగ్య కార్యకర్తలు , పోలీస్ సిబ్బంది, శానిటేషన్ సిబ్బంది వివరాలతో కూడిన డేటా బేస్...

కేంద్ర ప్రభుత్వం భోజనాన్ని తిరస్కరించిన రైతులు

కేంద్ర వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీలో ఆందోళన నిర్వహిస్తున్న రైతు సంఘాల ప్రతినిధులను గురువారం కేంద్ర ప్రభుత్వం రెండో విడత చర్చలకు పిలిచింది. ఢిల్లీ విజ్ఞాన కేంద్రంలో కేంద్రమంత్రులు పీయూష్‌...

త్వరలో వరంగల్లో ఎలక్ట్రిక్ బస్సులు

ప్రస్తుతం హైదరాబాద్‌లో 40 ఎలక్ట్రిక్‌ బస్సులు ప్రయాణికులకు సేవలందిస్తున్నాయి. వరంగల్‌ లో కూడా బ్యాటరీ బస్సులు నడిపించాలనుకున్నా సమ్మె, కరోనా కారణాల వల్ల ఆగిపోయింది. తాజాగా కేంద్రప్రభుత్వ గైడ్‌లైన్స్‌ మేరకు...

ఆ అబ్బాయి ఎన్నికల విధులకు రాలేదు : ఈసీ

17 సంవత్సరాల బాలుడిని ఎన్నికల విధుల్లో నియమించినట్లు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు నిజం కాదని ఎన్నికల సంఘం అధికారులు వివరణ ఇప్పారు. ఆ వార్తల్లో నిజం లేదని సదరు...