19.5 C
Hyderabad
Friday, November 27, 2020

వ్యవసాయ రాష్ట్రంగా తెలంగాణ..

వ్యవసాయశాఖపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమీక్ష నిర్వహించారు. అధికారులకు పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో 60 శాతం జనాభా వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నదని.. ఈ రంగం బాగుంటేనే ప్రజలు, రాష్ట్రం బాగుంటాయన్నారు. వ్యవసాయరంగ అభివృద్ధికి మించిన ప్రాధాన్యం ప్రభుత్వానికి మరొకటి లేదని స్పష్టం చేశారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, మిషన్‌ కాకతీయ ద్వారా చెరువుల పునరుద్ధరణ, 24 గంటల ఉచిత విద్యుత్‌, రైతుబంధు, రైతు బీమా, క్లస్టర్ల ఏర్పాటు, సకాలంలో ఎరువులు, విత్తనాలు అందించడం తదితర చర్యల ద్వారా వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయని చెప్పారు. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడక ముందటి పరిస్థితితో పోల్చుకుంటే వ్యవసాయరంగం ముఖచిత్రమే మారిపోయిందన్నారు. దేశంలోనే అత్యధికంగా వరి పండించే రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తున్నదని సీఎం కేసీఆర్‌ చెప్పారు. నిర్ణీత పంటలసాగు విధానం ద్వారా రైతులకు మంచి ధర వస్తుందన్నారు. ఈ నేపథ్యంలో వ్యవసాయశాఖ బాధ్యతలు కూడా ఎంతో పెరుగుతున్నాయన్న సీఎం కేసీఆర్‌ అందుకు తగ్గట్టుగా వ్యవసాయశాఖలో సంస్థాగత మార్పులు జరగాలని చెప్పారు.

వ్యవసాయశాఖలో కొత్తగా  రెండు ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. ఒక విభాగం సాగునీరు, విద్యుత్‌, ఎరువులు, విత్తనాలు తదితర మౌలిక సదుపాయాలను పర్యవేక్షించాలని చెప్పారు. మరో విభాగం మార్కెటింగ్‌పై దృష్టి పెట్టాలన్నారు. రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో ఏ పంటకు ఎక్కువ డిమాండ్‌ ఉంది? ఏ పంటవేస్తే రైతులకు లాభం? తదితర విషయాలను అధ్యయనం చేయాల్సి ఉంటుందన్నారు. మార్కెటింగ్‌శాఖ, పౌరసరఫరాల సంస్థ.. వ్యాపారులతో సమన్వయం కుదుర్చుకొని రైతులకు మంచిధర వచ్చే విధంగా వ్యూహాలు రూపొందించాలని చెప్పారు. ఈ రెండు విభాగాలకు ఐఏఎస్‌ అధికారులు నేతృత్వం వహించాలని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు.

గోదావరిపై నిర్మించిన కాళేశ్వరంతోపాటు ఇతర ప్రాజెక్టుల వల్ల 24 జిల్లాలు సుభిక్షంగా మారాయని సీఎం కేసీఆర్‌ చెప్పారు. ఆ జిల్లాల్లో సాగునీటికి ఢోకా ఉండదని తేల్చిచెప్పారు. ఆదిలాబాద్‌, నిర్మల్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిజామాబాద్‌, కామారెడ్డి, మెదక్‌, సిద్దిపేట, సంగారెడ్డి, కరీంనగర్‌, జగిత్యాల, పెద్దపల్లి, సిరిసిల్ల, వరంగల్‌ అర్బన్‌, వరంగల్‌ రూరల్‌, మహబూబాబాద్‌, ములుగు, జయశంకర్‌ భూపాలపల్లి, జనగామ, భువనగిరి, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మేడ్చల్‌ జిల్లాలు గోదావరి ప్రాజెక్టుల కింద కవర్‌ అవుతున్నాయన్నారు. కృష్ణా నదిపై కట్టే ప్రాజెక్టుల ద్వారా కూడా ఉమ్మడి మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలు సుభిక్షంగా మారబోతున్నాయని చెప్పారు. అయితే, రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టులకు ఒకేసారి నీళ్లు రావని.. ఒక్కో ప్రాజెక్టు ఒక్కో సమయంలో నిండటం వల్ల ఆయా ప్రాంతాల పంటకాలాల్లో స్వల్ప తేడాలు ఉంటాయన్నారు. దీనికి అనుగుణంగానే విత్తనాలు, ఎరువులను అందుబాటులో ఉంచడంతో పాటు.. పంటల కొనుగోళ్లకు ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. రాష్ట్రంలో రైతులు ఇప్పటిదాకా కొన్నిరకాల పంటలే వేయడానికి మాత్రమే అలవాటుపడ్డారని.. ఈ పద్ధతి మారాలని చెప్పారు. మార్కెట్లో మంచి ధర వచ్చే పంటలు వేయాలని సూచించారు. వరి, పత్తితోపాటు కొన్ని పంటల సాగు విస్తీర్ణం పెరగాల్సి ఉందని సీఎం అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో 20 నుండి 25 లక్షల ఎకరాల వరకు కందులు..12 లక్షల ఎకరాల్లో ఆయిల్‌ ఫాం, 15 లక్షల ఎకరాల్లో మిరప, పసుపు, ఇతర పప్పుధాన్యాలు, కూరగాయలు తదితర పంటలు సాగవ్వాలన్నారు. నీటి లభ్యత, భూముల రకం, వాతావరణం, మార్కెటింగ్‌ అంశాలను దృష్టిలో పెట్టుకొని రైతులకు ఎప్పటికప్పుడు ఏ పంటలు వేయాలనే విషయంలో అధికారులు దిశానిర్దేశం చేయాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు.

- Advertisement -

Latest news

Related news

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్

ఆస్ట్రేలియాలో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియాపై టాస్ గెలిచి ఆసీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. కరోనా వైరస్ నేపథ్యంలో చాలా రోజుల తరువాత టీమిండియా బ్లూజెర్సీతో మైదానంలో కనిపిస్తోంది.ఈ మ్యాచ్‌లో టాస్...

దేశంలో 93 లక్షలు దాటిన కరోనా కేసులు

దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. బాధితుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. గడిచిన 24గంటల్లో 43 వేల 082 కొత్త కేసులు వెలుగులోకి రాగా.. మొత్తం కేసుల సంఖ్య 93లక్షల 09వేల...

పీవీ, ఎన్టీఆర్‌కు పురస్కారాలేవి?

దేశ ప్రధానమంత్రి పదవిని అధిష్ఠించిన తొలి తెలంగాణ బిడ్డ పీవీ నరసింహారావు. భారతదేశ అణువిధాన పితామహుడు, ఆర్థికసంస్కరణల సారథి అయిన పీవీ నరసింహారావుకు ఈ దేశంలో దక్కాల్సిన గౌరవం దక్కలేదు....

నిఖార్సయిన హిందుత్వానికి నిర్వచనం కేసీఆర్‌

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఓ గొప్ప హిందువు. సీఎం కేసీఆర్‌ చేసే యజ్ఞయాగాది క్రతువులు తాను ఎలాంటివారో చెప్పక్కనే చెబుతాయి. కేసీఆర్‌ చేపట్టిన ఏ పనిలోనైనా...