22.9 C
Hyderabad
Friday, December 4, 2020

వ్యాధులు ప్రబలకుండా పరిసరాల పరిశుభ్రత పాటించాలి : సబితా ఇంద్రారెడ్డి

రంగారెడ్డి : వర్షాకాలం సమీపిస్తుండటంతో సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా ప్రతిఒక్కరూ పరిసరాల పరిశుభ్రత పాటించాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మంత్రి కేటీఆర్‌ పిలుపుమేరకు ప్రతి ఆదివారం 10 గంటలకు 10 నిమిషాల కార్యక్రమంలో సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. ఇంటి ఆవరణలో ఉన్న పూల కుండీలను శుభ్రం చేశారు. మొలిచిన పిచ్చి మొక్కలను తొలగించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… పరిసరాల పరిశుభ్రతను ప్రతిఒక్కరూ ఓ సామాజిక కార్యక్రమంగా భావించాలన్నారు. సీజనల్‌ వ్యాధుల నివారణకు పురపాలకశాఖ ఇప్పటికే ఓ ప్రత్యేక క్యాలెండర్‌ను రూపొందించిందన్నారు. కరోనా నేపథ్యంలో అలవాటైన వ్యక్తిగత పరిశుభ్రతను ఇక ముందు కూడా కొనసాగించి వ్యాధులను దరిచేరకుండా చూద్దామని పేర్కొన్నారు.

- Advertisement -

Latest news

Related news

బొంతు శ్రీదేవి విజయం – కొనసాగుతున్న కారు హవా

గ్రేటర్ ఫలితాల్లో కారు టాప్ గేరులో దూసుకుపోతోంది. అత్యధిక స్థానాల్లో టీఆర్ఎస్‌ జోరు చూపిస్తోంది. ఇప్పటికే 29 చోట్ల విజయం సాధించిన గులాబీ...

మహారాష్ట్రలో బీజేపీకి బిగ్ షాక్

మహారాష్ట్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి గట్టిదెబ్బ తగిలింది. మొత్తం ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగితే.. కేవలం ఒకే ఒక్కచోట కష్టపడి విజయం సాధించింది. అది కూడా స్థానిక సంస్థల...

డిప్యూటీ మేయర్ మళ్లీ గెలిచాడు

గ్రేటర్ ఎన్నికల ఫలితాల్లో కారు దుమ్ము రేపుతోంది. అందరూ ఊహించినట్టుగానే.. టీఆర్ఎస్ అభ్యర్థులు విజయ బావుటా ఎగురవేస్తున్నారు.

కూకట్ పల్లిలో.. టాప్ గేర్

ఉత్కంఠ రేకెత్తించిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాల్లో.. కారు జోరు మీదున్నది. పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లలో కాస్త వెనకబడ్డట్టు అనిపించినా.. సాధారణ ఓట్ల లెక్కింపులో.. తొలిరౌండ్ నుంచే దుమ్ము రేపింది.