వరంగల్ రూరల్ జిల్లాలోని వర్ధన్నపేట మండలం కట్ర్యాల గ్రామ సమీపంలో ఈరోజు ఉదయం బైక్, ఆటోలను ఓలారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న యువకుడు శ్రీరాముల నాగరాజు (32) అక్కడికక్కడే మరణించగా. ఆటోలో ఉన్న ముగ్గురు గాయపడ్డారు. క్షతగాత్రులను ఎంజీఎం దవాఖానకు తరలించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు లారీ డ్రైవర్‌పై కేసు నమోదు చేశారు.