27.3 C
Hyderabad
Tuesday, November 24, 2020

శంషాబాద్ లోని హెచ్ఎండీఏ నర్సరీని సందర్శించిన మంత్రి కేటీఆర్

శంషాబాద్ లోని హెచ్ఎండీఏ నర్సరీని సందర్శించిన పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, భవిష్యత్‌ తరాలకు పచ్చదనాన్ని కానుకగా అందించే లక్ష్యంతో ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు. ఈసారి హరితహరం కర్యాక్రమాన్ని మరింత పెద్ద ఎత్తున చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని వెల్లడించారు. నగర శివార్లలోని శంషాబాద్‌లో ఉన్న హెచ్‌ఎండీఏ నర్సరీని మంత్రి సందర్శించారు. నర్సరీలో మొక్కల పెంపకాన్ని ఆయన పరిశీలించారు. పురపాలక పట్టణాల్లో మొక్కలు నాటడంతోపాటు మొక్కల పెంపకంపై ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు.   

హైదరాబాద్‌ పరిధిలో ఎవరైనా మొక్కలు కావాలనుకునేవారు నగర పరిధిలోని నర్సరీల నుంచి ఉచితంగా తీసుకోవచ్చని ప్రకటించారు. నగరంలోని నర్సరీల వివరాలను అందరికీ అందుబాటులో ఉంచుతామని చెప్పారు. హరితహారం కార్యక్రమంలో ప్రజలు పెద్దఎత్తున పాల్గొనాలి పిలుపునిచ్చారు. నర్సరీలోని కార్మికులకు ఈఎస్‌ఐ, పీఎఫ్‌ అంశాన్ని పరిశీలించాలని అధికారులను ఆదేశించారు.

- Advertisement -

Latest news

Related news

హైదరాబాద్‌ ని దేశంలోనే సేఫెస్ట్‌ సిటీగా తీర్చిదిద్దం

హైదరాబాద్‌లో పటిష్టమైన శాంతి భద్రతలు ఉన్నాయని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. హైదరాబాద్‌ మహానగరాన్ని దేశంలోనే సేఫెస్ట్‌ సిటీగా తీర్చిదిద్దుతున్నామన్నారు. ఈ మేరకు దేశంలో ఉన్న...

దక్షిణ భారతదేశంలోనే తొలి వేస్ట్‌ ఎనర్జీ ప్లాంట్‌ను ఏర్పాటు చేసినం

ప్రధాని నరేంద్ర మోదీ కంటే ముందుగానే సీఎం కేసీఆర్‌ స్వచ్ఛ్‌ హైదరాబాద్‌ కార్యక్రమాన్ని చేపట్టారని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. పారిశుధ్య నిర్వాహణలో హైదరాబాద్‌ దేశంలోనే ముందుందన్నారు . జీహెచ్‌ఎంసీ పరిధిలో...

ఆరేండ్లలో తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందింది- మంత్రి కేటీఆర్

ఆరేండ్లలో తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందిందని అన్నారు మంత్రి కేటీఆర్. స్వరాష్ట్రం ఏర్పడక ముందు హైదరాబాద్ లో ఉన్న అనిశ్చిత వాతావరణం ఇప్పుడు లేదని...

నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

దేశీయ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. గురువారం ఉదయం. ఉదయం 9.30 సమయంలో సెన్సెక్స్‌ 156 పాయింట్లు కోల్పోయి 44,023 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 37 పాయింట్ల నష్టంతో 12,900 వద్ద...