లాక్డౌన్ సడలింపుల తర్వాత తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది. నిన్న ఆన్లైన్లో 18వేల టికెట్లు జారీ చేయగా నాలుగు గంటల్లోనే అయిపోయాయి. ఈనెల 27న శ్రీవారి దర్శనం కోసం ఆఫ్లైన్లో సర్వదర్శనం టికెట్లకు తిరుపతిలో టోకెన్లు జారీ చేస్తున్నారు. వీటి కోసం భక్తులు బారులు తీరారు. రోజుకు 6750 మంది భక్తులకు శ్రీవారి దర్శనభాగ్యం కల్పించాలని తితిదే నిర్ణయించింది. ఈమేరకు ఉచిత దర్శన టోకెన్ల జారీని తిరుమల తిరుపతి దేవస్థానం శుక్రవారం ఉదయం ప్రారంభించింది