27.9 C
Hyderabad
Tuesday, September 29, 2020

శ్రీశైలం 3 గేట్లు ఎత్తి దిగువకు నీటివిడుదల

ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు ఈ సీజన్లో మొదటిసారిగా శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు తెరుచుకున్నాయి. ఐదారురోజులుగా ఆల్మట్టికి భారీ ఇన్‌ఫ్లో వస్తుండటం.. అప్పటికే కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాలు 75 శాతానికి పైగా నిండి ఉండటంతో వరదంతా దిగువన ఉన్న తెలుగు రాష్ట్రాల పరిధిలోకి వస్తుంది. కర్ణాటకలోని జలాశయాల నుంచి సరాసరి 2.50 లక్షల క్యూసెక్కుల వరద వచ్చింది. ఈ క్రమంలో జూరాల నుంచి కూడా ఇంత కంటే ఎక్కువ ఔట్ ఫ్లో నమోదవుతుండటం.. తుంగభద్ర డ్యాం కూడా నిండుకుండలా మారి దిగువకు 60 వేల నుంచి 70 వేల క్యూసెక్కులు వదులుతుండటంతో కృష్ణమ్మ ఉధృతి గంట గంటకూ పెరుగుతున్నది.             

మంగళవారం రాత్రి వరకు 2.60 లక్షల క్యూసెక్కులకు పైగా ఉన్న శ్రీశైలం ఇన్ ఫ్లో  బుధవారం సాయంత్రానికి 3.60 లక్షల క్యూసెక్కులకు చేరింది.  ఈ నేపథ్యంలో ఏపీ అధికారులు ప్రాజెక్టు 3 గేట్లు ఎత్తి స్పిల్‌వే మీదుగా 79, 131 క్యూసెక్కులను నదిలోకి విడుదల చేస్తున్నారు. అప్పటికే ఎడమ గట్టు విద్యుత్ కేంద్రంలో కరెంటు ఉత్పత్తి ద్వారా తెలంగాణ 40,259 క్యూసెక్కులు, కుడి గట్టులో ఏపీ 31,062 క్యూసె క్కులను దిగువకు వదులుతున్నాయి. ఇలా లక్షా 50 వేల క్యూసెక్కుల కృష్ణాజలాలు శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్‌కు చేరు కుంటున్నాయి.                    

అటు నాగార్జున సాగర్‌లో నీటి నిల్వ 261 టీఎంసీలు దాటింది. సాగర్ పూర్తిస్థాయి నిల్వ సామర్థ్యం 312.05 టీఎంసీలు కావడంతో పూర్తిస్థాయికి మరో 60 టీఎంసీలకుపైగా జలాలు రావాల్సి ఉన్నది. ఈ స్థాయిలో వరద కొనసాగినా రోజుకు 10 టీఎంసీల చొప్పున ఐదు రోజుల్లో నిండుకుండలా మారనున్నదని అధికారులు స్పష్టంచేస్తున్నారు. ఈ నీటి సంవత్సరంలో బుధవారం ఉదయం వరకు దాదాపు 300 టీఎంసీల వరకు కృష్ణాజలాలు వచ్చినట్టు అధికారులు అంచనా వేస్తున్నారు.           

- Advertisement -

Latest news

ఐదేండ్ల మా పనితీరుకు నిదర్శనంగా ప్రగతి నివేదిక ఉండబోతుంది: మంత్రి కేటీఆర్

జీహెచ్‌ఎంసీలో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రజల్లోకి మరింత పెద్ద ఎత్తున తీసుకెళ్లాలని కార్పొరేటర్లకు మంత్రి కేటీఆర్‌ పిలుపునిచ్చారు. జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు, మంత్రులు, ఎమ్మెల్యేలతో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. గత ఐదేండ్లలో...

Related news

ఐదేండ్ల మా పనితీరుకు నిదర్శనంగా ప్రగతి నివేదిక ఉండబోతుంది: మంత్రి కేటీఆర్

జీహెచ్‌ఎంసీలో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రజల్లోకి మరింత పెద్ద ఎత్తున తీసుకెళ్లాలని కార్పొరేటర్లకు మంత్రి కేటీఆర్‌ పిలుపునిచ్చారు. జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు, మంత్రులు, ఎమ్మెల్యేలతో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. గత ఐదేండ్లలో...

అక్టోబర్ 9 నుంచి బతుకమ్మ చీరలు పంపిణీ

తెలంగాణ ఆడబిడ్డలకు బ‌తుక‌మ్మ పండుగ‌కు చిరు కానుక‌గా రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ చీర‌ల‌ను పంపిణీ చేస్తోందని మంత్రి కేటీఆర్ తెలిపారు. బేగంపేట హ‌రిత ప్లాజాలో ఏర్పాటు చేసిన బ‌తుక‌మ్మ చీర‌ల...

న‌వంబ‌ర్ 3న‌ దుబ్బాక ఉప ఎన్నిక‌

మెద‌క్ జిల్లాలోని దుబ్బాక ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుద‌లైంది. ఈ మేర‌కు కేంద్ర ఎన్నిక‌ల సంఘం షెడ్యూల్‌ను విడుద‌ల చేసింది. న‌వంబ‌ర్ 3న దుబ్బాక నియోజ‌క‌వ‌ర్గానికి పోలింగ్ నిర్వ‌హించ‌నున్నారు. 10న...

బాబ్రీ మ‌సీదు కూల్చివేత కేసులో రేపు తుది తీర్పు

బాబ్రీ మ‌సీదు కూల్చివేత కేసులో రేపు సీబీఐ ప్రత్యేక కోర్టు తుదితీర్పు వెలువరించనుంది.ఈ కేసులో రేపు బీజేపీ సీనియ‌ర్ నేత‌లు ఎల్ కే అద్వానీ, ముర‌ళీ మ‌నోహ‌ర్ జోషి, క‌ళ్యాణ్...