19.5 C
Hyderabad
Friday, November 27, 2020

సామాన్యుడికి అండగా తెలంగాణ సర్కారు

రాష్ట్రంలో రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌ ప్రక్రియ కొత్త పుంతలు తొక్కుతున్నది. ధరణి పోర్టల్‌ వల్ల ఈ-టెక్నాలజీ సాయంతో రిజిస్ట్రేషన్‌ సులభతరంగా.. అత్యంత పారదర్శకంగా మారింది. క్రయవిక్రయదారుల ఇబ్బందులను తీర్చింది. గతంలో భూమిని కొనడం ఒక ఎత్తయితే.. దానిపై హక్కులను సంపాదించడం మరో ఎత్తుగా ఉండేది. ధరణి పోర్టల్ సాయంతో చేస్తున్న ప్రతీ రిజిస్ట్రేషన్  పండుగలా మారింది. 

సాధారణంగా కొనుగోలుదారుడే రిజిస్ట్రేషన్‌ ఖర్చులను భరించాల్సి ఉంటుంది. అందుకోసం విక్రయదారుడిని, సాక్షులను రిజిస్ట్రేషన్‌ కార్యాలయానికి తీసుకెళ్లడం, తిరిగి తీసుకురావడం అనేది కొనుగోలుదారుడి బాధ్యత. కొందరు విక్రయదారులు మాత్రం వారే ఆ ప్రక్రియను పూర్తిచేసినా.. ఖర్చును ముందుగా భూమి రేటులోనే కలుపుతారు. రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ఒక్కరోజులో.. అది నిర్ణీత వ్యవధిలో పూర్తయితే ఏం పర్వాలేదు. కానీ, ఈ తతంగమంతా రోజుల తరబడి సాగుతుండేది. ముందుగా ఒకరోజు విక్రయదారుడిని, సాక్షులను ఒక డాక్యుమెంట్‌ రైటర్‌ వద్దకు తీసుకెళ్లి వివరాలను నమోదు చేయించుకునేవారు. అందుకు ఖర్చులన్నీ భూ కొనుగోలుదారే భరించాల్సిన పరిస్థితి. ఆ తర్వాత రిజిస్ట్రేషన్‌ రోజున కూడా అదే పరిస్థితి. అనుకోని కారణాల వల్ల నిర్ణీత సమయానికి విక్రయదారుడు రాలేకపోయినా, సాక్షులు లేకపోయినా, రిజిస్ట్రేషన్‌ అధికారి అందుబాటులో లేకున్నా అంతేసంగతి. మళ్లీ మరో రోజు ఆ పని పూర్తిచేసుకోవాల్సి వస్తుంది. ఇలా కార్యాలయానికి వెళ్లిన ప్రతిసారీ భూ కొనుగోలుదారే ఖర్చులు భరించాల్సిన దుస్థితి. ఇద్దరు సాక్షులు, ఈ ప్రక్రియ పూర్తిచేసేందుకు నియమించుకున్న మధ్యవర్తి/ డాక్యుమెంట్‌ రైటర్‌కు టీలు, టిఫిన్లు.. భోజనాలు.. ప్రయాణ ఖర్చులు.. ఇతరత్ర ఖర్చులన్నీ కొనుగోలుదారే చెల్లించుకునేవాడు. రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తయ్యాక హక్కు పత్రాలను తీసుకునేందుకు సైతం కార్యాలయం చుట్టూ ఒకటికి పదిసార్లు తిరుగాల్సిన దుస్థితి.

రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తవడం ఒక వంతయితే.. భూమి మ్యుటేషన్‌ చేయించుకోవడంలోనూ అదే కాలాయాపన. పనులన్నీ పక్కన పెట్టుకుని కార్యాలయం చుట్టూ తిరుగుతూ, పైసలు ముట్టజెప్పాలిన పరిస్థితి ఉండేది. వ్యవసాయ భూమి మ్యుటేషన్‌ కోసం ఎకరాకు 3 వేల వరకు కూడా వసూలుచేసిన సందర్భాలున్నాయి. అయినా పని పూర్తవుతుందా? అంటే అదీలేదు. అయితే ధరణి పోర్టల్‌ కొనుగోలుదారులకు ఎంతో ఊరటనిస్తున్నది. అదనపు ఖర్చులకు చెక్‌ పెడుతున్నది. కట్టుదిట్టమైన భూహక్కులను కల్పిస్తుండడంతో మానసిక ప్రశాంతతను చేకూర్చుతున్నది. పదిసార్లు కార్యాలయాలకు తిరుగాల్సిన అవసరం లేకుండా చేస్తున్నది. విక్రయదారుడు, సాక్షుల వివరాలు ఉంటే చాలు.. వాటిని ఒక్కరే ఆన్‌లైన్‌లో నమోదుచేసుకునే సౌకర్యాన్ని కల్పిస్తున్నది. ఎక్కడా ఎలాంటి జిరాక్స్‌ కాపీలను, ఫొటోలను సమర్పించాల్సిన అవసరమే లేదు. కేవలం స్లాట్‌బుక్‌ చేసుకున్న రోజున నిర్ణీత సమయానికి రిజిస్ట్రేషన్‌ కార్యాలయానికి వెళితే సరిపోతుంది. అధికారులు బయోమెట్రిక్‌ ద్వారా భూకొనుగోలుదారులు, విక్రయదారుడు, సాక్షుల వివరాలను నమోదు చేసుకుంటారు. తరువాత రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను, మ్యుటేషన్‌ను నిముషాల్లో పూర్తి చేస్తున్నారు. ఒకవేళ అప్పటికే పాస్‌బుక్‌ ఉంటే అందులో కొనుగోలు చేసిన వివరాలను నమోదుచేసి అప్పటికప్పుడు అప్‌డేట్‌ చేసి అందజేస్తున్నారు. లేదంటే అధికారికంగా వెంటనే ఈ-పాస్‌బుక్‌ను ఇస్తున్నారు. తరువాత కొత్త పాస్‌బుక్‌లను తయారుచేసి నేరుగా కొనుగోలుదారుడి ఇంటికే పంపడం విశేషం.

రిజిస్ట్రేషన్‌ కోసం దూరం వెళ్లకుండా సమీప తాసిల్దార్‌ కార్యాలయంలోనే ఆ సౌకర్యాన్ని కల్పించడంతో ప్రయాణభారం తప్పింది. భూ ఆక్రమణలకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా ఆన్‌ లైన్‌ వ్యవస్థను కట్టుదిట్టం చేయడంతో కబ్జాకు గురవుతాయేమోనన్న  ఆందోళన చెందాల్సిన పరిస్థితి లేదు. ధరణితో ఈ కష్టాలన్నింటికీ చెక్ పడింది. ప్రతీ రిజిస్ట్రేషన్ ను పండగలా జరుగుతోందని లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నరు.

- Advertisement -

Latest news

Related news

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్

ఆస్ట్రేలియాలో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియాపై టాస్ గెలిచి ఆసీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. కరోనా వైరస్ నేపథ్యంలో చాలా రోజుల తరువాత టీమిండియా బ్లూజెర్సీతో మైదానంలో కనిపిస్తోంది.ఈ మ్యాచ్‌లో టాస్...

దేశంలో 93 లక్షలు దాటిన కరోనా కేసులు

దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. బాధితుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. గడిచిన 24గంటల్లో 43 వేల 082 కొత్త కేసులు వెలుగులోకి రాగా.. మొత్తం కేసుల సంఖ్య 93లక్షల 09వేల...

పీవీ, ఎన్టీఆర్‌కు పురస్కారాలేవి?

దేశ ప్రధానమంత్రి పదవిని అధిష్ఠించిన తొలి తెలంగాణ బిడ్డ పీవీ నరసింహారావు. భారతదేశ అణువిధాన పితామహుడు, ఆర్థికసంస్కరణల సారథి అయిన పీవీ నరసింహారావుకు ఈ దేశంలో దక్కాల్సిన గౌరవం దక్కలేదు....

నిఖార్సయిన హిందుత్వానికి నిర్వచనం కేసీఆర్‌

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఓ గొప్ప హిందువు. సీఎం కేసీఆర్‌ చేసే యజ్ఞయాగాది క్రతువులు తాను ఎలాంటివారో చెప్పక్కనే చెబుతాయి. కేసీఆర్‌ చేపట్టిన ఏ పనిలోనైనా...