26 C
Hyderabad
Wednesday, January 27, 2021

సిద్దిపేటలో తెలంగాణ భవన్ ప్రారంభించిన సీఎం కేసీఆర్

సిద్దిపేట జిల్లా పొన్నాల శివారులోని నిర్మించిన టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్‌ను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రారంభించారు. భవన నిర్మాణాన్ని, గదులను తిరిగి పరిశీలించారు. అనంతరం టీఆర్‌ఎస్‌ పతాకాన్ని ఆవిష్కరించారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు బలమైన పునాదులు వేసుకున్న టీఆర్‌ఎస్‌ శ్రేణులకు సరైన దిశానిర్దేశం చేసేందుకు అన్ని జిల్లా కేంద్రాల్లో తెలంగాణ భవన్‌లను నిర్మించారు. రాష్ట్రంలోనే మొట్టమొదటి టీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా కార్యాలయ భవనాన్ని సిద్దిపేటలో సీఎం కేసీఆర్ మంత్రి హరీశ్ రావు, జిల్లా తెరాస నాయకులతో కలిసి ప్రారంభించారు.

రూ.60లక్షలతో నిర్మించిన పార్టీ కార్యాలయ భవన నిర్మాణానికి గతేడాది జూన్‌ 24న భూమిపూజ నిర్వహించారు. నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేసి.. నిర్దేశించిన గడువులోగా భవన్ నిర్మాణం పూర్తి చేశారు. సిద్దిపేట జిల్లా టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయ భవన నిర్మాణం రాష్ట్రంలోనే మోడల్‌గా నిలువనున్నది. జీ ప్లస్‌ 1 పద్ధతిలో ఈ భవనాన్ని నిర్మించారు. ఒకేసారి 1,500 మందితో సమావేశం జరిపేందుకు వీలుగా సెమినార్ హాల్ నిర్మించారు. మోడల్‌ కిచెన్‌ షెడ్‌, టాయిలెట్స్‌, విశాలమైన పార్కింగ్‌, ప్రహరీ తదితర పనులన్నీ పూర్తయ్యాయి. భవన్ నిర్మాణానికి రూ.1.5 కోట్లు ఖర్చు అయ్యాయి. హరితహారం, గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా భవన్ చుట్టూ మొక్కలు నాటారు. 

- Advertisement -

Latest news

Related news

మదనపల్లె జంటహత్య కేసు నిందితులకు.. 14రోజుల రిమాండ్

మదనపల్లె జంటహత్యల కేసులో నిందితులైన మృతురాళ్ల తల్లితండ్రులకు కోర్టు 14రోజుల రిమాండ్ విధించింది. నిందితులు పద్మజ, పురుషోత్తం నాయుడులను పోలీసులు మంగళవారం మేజిస్ట్రేట్ ఎదుట హాజరు పరిచారు. కోర్టు నిందితులకు...

ఆకస్మికంగా మార్కెట్‌యార్డుకు సీఎం కేసీఆర్‌

సిద్దిపేట జిల్లాలోని ములుగు మండలం వంటిమామిడి మార్కెట్‌యార్డును సీఎం కేసీఆర్‌ బుధవారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా మార్కెట్‌ను పరిశీలించిన సీఎం అక్కడున్నరైతులతో మాట్లాడారు. పంటల సాగు, ధరలను  అడిగి...

ప్రపంచం అబ్బురపడేలా యాదాద్రి.. మంత్రి వేముల

సీఎం కేసీఆర్ ఆధ్యాత్మికత, అకుంఠిత దీక్షతో ప్రపంచం అబ్బురపడేలా యాదాద్రి ఆలయాన్నినిర్మించారని రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. భూమి మీదనే ఏడు గోపురాలతో నిర్మించిన...

ఎన్టీఆర్ కు గాలమేసిన కేజీఎఫ్ డైరెక్టర్

దేశవ్యాప్తంగా సూపర్ సక్సెస్ సాధించిన కేజీఎఫ్ సినిమాతో ఆ సినిమా దర్శకుడు ప్రశాంత్ నీల్ స్పీడ్ పెంచాడు. కేజీఎఫ్2 పూర్తి కాగానే.. వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు ప్లాన్ చేస్తున్నాడు....