24.3 C
Hyderabad
Wednesday, November 25, 2020

సిద్ధిపేటలో దొరికిన డబ్బు బీజేపీదే: సీపీ జోయల్ డేవిస్

సిద్ధిపేటలో సోదాల ఘటనపై వార్తా ఛానళ్లు, సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు పూర్తిగా అవాస్తవమని పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్‌ స్పష్టం చేశారు. ఈ ఘటన మొత్తం సురభి అంజన్ రావు, అతని భార్య సమక్షంలో, వారి ఇంట్లోనే జరిగిందని స్పష్టం చేశారు. డబ్బు తమదేనని అంజన్ రావు భార్య.. తన బావమరిది నగదు ఇచ్చి వెళ్లాడని అంజన్ రావు సైతం ఒప్పుకున్నారని తెలిపారు. అటు సెర్చ్ వారంట్ ఇచ్చిన తర్వాతే ఎగ్జిక్యూటివ్ అధికారి వాళ్లింటికి వెళ్లాడని.. డబ్బు దొరికిన ఇంటి యజమాని, పంపించిన వ్యక్తి సంతకాలు సైతం తీసుకున్నామని చెప్పారు. ఐతే ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్‌ పంచనామా పూర్తి చేసి బయటకు వచ్చే సమయంలో బీజేపీ కార్యకర్తలు దాడి చేసి డబ్బులు లాక్కెల్లారని.. ఎక్కువ మంది ఉండటం వల్ల ఆపలేకపోయామని చెప్పారు. సీజ్ చేసిన మొత్తాన్ని గుంజుకెల్లడం పెద్ద నేరమన్నారు సీపీ జోయల్ డేవిస్. ఘటనకు సంబంధించిన వీడియో ఫుటేజ్ ను విడుదల చేస్తామని చెప్పారు. దీనికి సంబంధించిన ముందస్తు సమాచారం ఎంపీ బండి సంజయ్‌ కి అందించడంతోపాటు.. శాంతిభద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉందని కూడా  తెలియజేశామని చెప్పారు. ఐతే మా సిబ్బందే డబ్బులు పెట్టినట్లు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు జోయల్ డేవిస్. ఇక దుబ్బాక ఉప-ఎన్నిక కోసం అదనంగా పోలీస్ సిబ్బందిని ఎర్పాటు చేశామని.. ప్రశాంత వాతావరణంలో ఎన్నిక జరిగేందుకు ప్రతీఒక్కరు సహకరించాలని కోరారు.

- Advertisement -

Latest news

Related news

జమ్మూకశ్మీర్‌ ను ముంచెత్తుతున్న మంచు

జమ్మూకశ్మీర్‌ ను ముంచు ముంచెత్తుతుంది. 8 జిల్లాల్లో భారీ హిమపాతం కురుస్తుండటంతో జమ్మూకశ్మీర్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ డిపార్టుమెంట్ జనం బయటికి రావొద్దంటూ హెచ్చరించింది. ఇటు లడఖ్, కుప్వారా, బండిపొరా ప్రాంతాల్లో...

భారత్‌ లో 92లక్షలు దాటిన కరోనా కేసులు

భారత్‌ లో కరోనా తీవ్రత కొనసాగుతోంది. దేశంలో బాధితుల సంఖ్య 92లక్షలు దాటింది. నిన్నటికి నిన్న 44 వేల 376 కొత్త కేసులు వెలుగులోకి రాగా.. మొత్తం కేసుల సంఖ్య...

అహ్మద్‌ పటేల్‌ మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు అహ్మద్ పటేల్ మరణం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అహ్మద్ పటేల్ తో తనకున్న అనుబంధాన్ని గుర్తు...

తమిళనాడు, పుదుచ్చేరిలో భారీ నుంచి అతి భారీ వర్షాలు

నివర్‌ తుపాను తీవ్ర రూపం దాల్చింది. దీని ప్రభావంతో తమిళనాడు. పుదుచ్చేరిలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలు, ఈదురు గాలులతో తీర ప్రాంతాలు అతలాకుతలం...