24.6 C
Hyderabad
Monday, October 26, 2020

సిరిసిల్ల లో ఇప్పటివరకు కోటి 40 లక్షల మొక్కలు నాటాం

రాష్ట్రంలోని వాగులు, చెరువులు, నదులు, కుంటల పక్కన విరివిగా మొక్కలు నాటాలని రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ పిలుపునిచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆరో విడత హరితహారం కార్యక్రమాన్ని స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డితో కలిసి మంత్రి కేటీఆర్‌ నేడు ప్రారంభించారు. ఆవునూరు-వెంకటాపూర్‌ దగ్గర మానేరు వాగులో హరితహారంలో భాగంగా వీరు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ…

హరితహారం కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావరణంలో జరుగుతోందన్నారు. రాజన్న సిరిసిల్లలో లక్ష మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు కోటి 40 లక్షల మొక్కలు నాటినట్లు వెల్లడించారు. సిరిసిల్లలో 19.85 శాతం అడవులు ఉన్నాయన్నారు. రాష్ట్రంలో అడవులు 33 శాతానికి పెంచాలన్నదే సీఎం కేసీఆర్‌ ఆలోచన అన్నారు. సీఎం ఆలోచన మేరకు రాష్ట్రంలో అడవులను పెంచాలన్నారు. 

- Advertisement -

Latest news

Related news

జియాగూడలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ప్రారంభించిన మంత్రి కేటీఆర్

హైదరాబాద్ జియాగూడలోని పేదలకు ప్రభుత్వం దసరా కానుక అందజేసింది. అంబేద్కర్ నగర్ లో ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇండ్లను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. 840 రెండు పడక...

దేశంలో 79లక్షలు దాటిన కరోనా కేసులు

భారత్ లో కరోనా తీవ్రత తగ్గుతుందని తెలిపింది కేంద్ర ఆరోగ్యశాఖ. దేశవ్యాప్తంగా బాధితుల సంఖ్య 79లక్షలకు చేరువైంది. గత 24గంటల్లో 45వేల 149కొత్త కేసులు నమోదు అయితే.. మొత్తం కేసుల...

పాకిస్థాన్‌లో భూకంపం

పాకిస్థాన్‌లో ఇవాళ‌ తెల్లవారుజామున భూకంపం సంభవించింది. దీనితీవ్ర‌త రిక్టర్ స్కేలుపై 4.8గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ ప్ర‌క‌టించింది. ఈరోజు ఉద‌యం 4.14 గంటలకు భూకంపం సంభవించింద‌ని, భూ...