27.7 C
Hyderabad
Thursday, July 2, 2020

సీఎం కేసీఆర్‌ పై నేవీ డిప్యూటీ చీఫ్‌ ప్రశంసల వర్షం

అమర జవాన్లకు సాయంపై సీఎం కేసీఆర్‌ ఔదార్యాన్ని భారత నౌకాదళ డిప్యూటీ చీఫ్‌.. వైస్‌ అడ్మిరల్‌ ఎంఎస్‌ పవార్‌ ప్రశంసించారు. ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రికి ఒక లేఖ రాశారు. ‘కోరుకొండ సైనిక్‌ స్కూల్‌ పూర్వ విద్యార్థి హోదాలో ఈ లేఖ రాస్తున్నట్టు పేర్కొన్న పవార్‌.. సీఎం కేసీఆర్ కు ప్రగాఢ కృతజ్ఞతలు తెలిపారు. చైనా సరిహద్దులో అమరుడైన సూర్యాపేట వీరయోధుడు కర్నల్‌ సంతోష్‌బాబు కూడా కోరుకొండ సైనిక్ స్కూల్‌లో విద్యనభ్యసించారు. కర్నల్‌ సంతోష్‌బాబు అమరుడైన వెంటనే ఆయన కుటుంబానికి మీరు అండగా నిలిచిన తీరు, ఉదారంగా సహాయం ప్రకటించడం, దాన్ని వెంటనే అమలుచేయడం అపూర్వం, అనితర సాధ్యం’ అని వైస్‌ అడ్మిరల్‌ పవార్‌ తన లేఖలో కొనియాడారు.  

మాతృభూమి రక్షణలో భారత సైనికుడు ప్రాణత్యాగానికి సైతం ఎన్నడూ వెరవడన్న వాస్తవాన్ని చరిత్ర అనేకమార్లు రుజువు చేసిందన్నారు వైస్‌ అడ్మిరల్‌ ఎంఎస్‌ పవార్‌. జాతీయ యుద్ధస్మారకంపై మెరిసే అమరుల పేర్లు, ఢిల్లీలోని సౌత్‌బ్లాక్‌ కారిడార్లలో వెలిసిన శౌర్యపతాక విజేతల చిత్రపటాలే ఇందుకు నిదర్శనమన్నారు. ఇటువంటి సాహసిక సైనికుల రుణాన్ని జాతి ఎలా తీర్చుకోవాలన్న దానికి మీరు ఈ రోజు ఒక ఉదాహరణలా నిలిచారని సీఎం కేసీఆర్ పై  ప్రశంసలు కురిపించారు. మీరిచ్చిన భరోసా ఈరోజు యుద్ధ సరిహద్దుల్లో నిలిచిన మన జవాన్ల ఆత్మబలాన్ని రెట్టింపుచేసిందని లేఖలో పేర్కొన్నారు. నాకేమైనా అయితే నా కుటుంబాన్ని చూసుకునేందుకు నా జాతి ఉంది అనే ఆత్మ విశ్వాసాన్ని సైనికుల్లో కలిగించారని .. ఇందుకు మీకు మనఃపూర్వక ధన్యవాదాలు” అంటూ సీఎం  కేసీఆర్‌పై నౌకాదళాధికారి ప్రశంసల వర్షం కురిపించారు. 

ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వ లక్షణాలను, ఒక నాయకుడిగా ఆయనలో ఉన్న ఆర్ద్రతను కూడా వైస్‌ అడ్మిరల్‌ పవార్‌ తన లేఖలో ప్రస్తావించారు. సైనికుడు అమరుడైన ప్రతిసారీ ఆయన కుటుంబాన్ని ఓదార్చడానికి, ఒక ముఖ్యమంత్రి వందల కిలోమీటర్లు ప్రయాణించి, ఊరుదాకా వెళ్లకపోవచ్చు. వెళ్లడం సాధ్యం కూడా కాకపోవచ్చు. కానీ మీరొక ముందడుగు వేసారని సీఎం కేసీఆర్ పై ప్రశంసల జల్లు కురిపించారు. కర్నల్‌ సంతోష్‌బాబు కుటుంబానికి సాయం ప్రకటించిన కొద్దిరోజుల్లోనే మీరు స్వయంగా సూర్యాపేటదాకా వెళ్లి, ఆయన భార్యకు మీ చేతులతో అందజేయడం మాత్రం అపూర్వమన్నారు. ఇది మీ నాయకత్వ లక్షణాలకు, ఔదార్యానికి, ఆర్ద్రతకు, మానవత్వానికి నిదర్శనమని వైస్‌ అడ్మిరల్‌ పవార్‌ తన లేఖలో కొనియాడారు . కర్నల్‌ సంతోష్‌ బాబుతో పాటు అమరులైన 19 మంది సైనికులకు, వారు తెలంగాణకు చెందిన వారు కానప్పటికీ, ఉదారంగా సాయం చేయడం మాటల్లో చెప్పలేని అనుభూతి కలిగించిందన్నారు. ఆర్మీ పట్ల, సైనికుల పట్ల మీకున్న అవగాహనకు ఇంతకు మించి వేరే చెప్పనక్కర్లేదని సీఎం కేసీఆర్‌ను నేవీ డిప్యూటీ చీఫ్‌ ప్రశంసించారు.

సైనికులకు ఉదాత్తమైన సాయం అందడంలో సీఎం కేసీఆర్‌ కూతురు, మాజీ ఎంపీ కవిత కీలక పాత్ర పోషించి, విశేషమైన కృషి చేశారని  వైస్‌ అడ్మిరల్‌ పవార్‌ తన లేఖలో కొనియాడారు. తాను, కర్నల్‌ సంతోష్‌బాబు చదువుకున్న కోరుకొండ సైనిక్‌ స్కూల్‌ను ఒకసారి సందర్శించాల్సిందిగా సీఎం కేసీఆర్ ను పవార్‌ ఆహ్వానించారు. “కోరుకొండ స్కూల్లో తెలంగాణ పిల్లలు కూడా అనేకమంది చదువుకుంటున్నారని తెలిపారు. కోరుకొండ సైనిక్ స్కూల్ లో చదువుకున్న ఎంతోమంది అనేకరంగాల్లో దేశవిదేశాల్లో రాణిస్తున్నారని..  అందువల్ల మీరొక్కసారి ఆ స్కూలును తప్పక సందర్శించాలని  వైస్‌ అడ్మిరల్‌ పవార్‌ సీఎం కేసీఆర్ కు  ఆహ్వానం పలికారు.

- Advertisement -

Latest news

అసోంలో భారీ వర్షాలు, 33మంది మృతి

అసోంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోతవానలతో నదులు ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తున్నాయి. వరదలు పోటెత్తడంతో ఇప్పటికే 33మంది మృతి చెందగా..తాజాగా బార్పేట జిల్లాలో ముగ్గురు, దుబ్రీ, నాగామ్,...

Related news

అసోంలో భారీ వర్షాలు, 33మంది మృతి

అసోంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోతవానలతో నదులు ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తున్నాయి. వరదలు పోటెత్తడంతో ఇప్పటికే 33మంది మృతి చెందగా..తాజాగా బార్పేట జిల్లాలో ముగ్గురు, దుబ్రీ, నాగామ్,...

మెక్సికోలో దుండగుల కాల్పులు, 24 మంది మృతి

మెక్సికోలో దారుణం జరిగింది. దుండగులు జరిపిన కాల్పుల్లో 24 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇరపాటోలోని డ్రగ్స్‌  డీ అడిక్షన్‌ కేంద్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సెంటర్‌ లోకి చొరబడిన...

భారత్‌ లో 6 లక్షలు దాటిన కరోనా కేసులు

భారత్‌ లో కరోనా తీవ్రత అంతకంతకు పెరుగుతూనే ఉంది.గంటగంటకు పెరుగుతున్న కేసులతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. గడిచిన 24గంటల్లో దేశంలో కొత్తగా 19వేల148 మంది కరోనా బారిన పడగా.. మొత్తం...

2036 వరకు రష్యా అధ్యక్షుడిగా పుతిన్‌

వ్లాదిమిర్​ పుతిన్​ రష్యా అధ్యక్షుడిగా 2036 వరకు కొనసాగనున్నారు. పుతిన్‌ అధ్యక్ష పదవీకాలం 2024లో ముగియనుండగా.. మరో 12ఏళ్ల పాటు ఆయనే అధ్యక్షుడిగా ఉండాలంటున్నారు రష్యన్లు. ఈ మేరకు తీసుకువచ్చిన రాజ్యాంగ...