20.3 C
Hyderabad
Tuesday, October 27, 2020

సీఎం కేసీఆర్ దార్శనికతతో తెలంగాణ సస్యశ్యామలం

మహబూబ్‌నగర్‌  : వ్యవసాయ, సాగునీటి రంగానికి సీఎం కేసీఆర్‌ ప్రాధాన్యత ఇవ్వడంతో తెలంగాణ సస్యశ్యామలం అవుతున్నదని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా దేవరకద్ర మండలం కౌకుంట్ల రైల్వే స్టేషన్‌ సమీపంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర గోదాముల్లో నిల్వ ఉంచిన బియ్యాన్ని తమిళనాడుకు తీసుకెళ్తున్న గూడ్స్‌ రైలును సౌత్‌ సెంట్రల్‌ రైల్వే డివిజినల్‌ కమర్షియల్‌ మేనేజర్‌ వెంకన్నతో కలిసి ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగి రాష్ట్రం ధాన్యాగారంగా మారిందని అన్నారు. కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉండటం మనం చేసుకున్న అదృష్టమని ఆయన అన్నారు. కృష్ణా జలాలను రిజర్వాయర్లకు ఎత్తిపోసి చెరువులను నింపడంతో జిల్లాలో బీడు భూములన్నీ పంట పొలాలుగా మారాయని ఆయనన్నారు.

- Advertisement -

Latest news

Related news

జియాగూడలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ప్రారంభించిన మంత్రి కేటీఆర్

హైదరాబాద్ జియాగూడలోని పేదలకు ప్రభుత్వం దసరా కానుక అందజేసింది. అంబేద్కర్ నగర్ లో ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇండ్లను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. 840 రెండు పడక...

దేశంలో 79లక్షలు దాటిన కరోనా కేసులు

భారత్ లో కరోనా తీవ్రత తగ్గుతుందని తెలిపింది కేంద్ర ఆరోగ్యశాఖ. దేశవ్యాప్తంగా బాధితుల సంఖ్య 79లక్షలకు చేరువైంది. గత 24గంటల్లో 45వేల 149కొత్త కేసులు నమోదు అయితే.. మొత్తం కేసుల...

పాకిస్థాన్‌లో భూకంపం

పాకిస్థాన్‌లో ఇవాళ‌ తెల్లవారుజామున భూకంపం సంభవించింది. దీనితీవ్ర‌త రిక్టర్ స్కేలుపై 4.8గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ ప్ర‌క‌టించింది. ఈరోజు ఉద‌యం 4.14 గంటలకు భూకంపం సంభవించింద‌ని, భూ...