28.6 C
Hyderabad
Wednesday, July 8, 2020

సెకను కన్నా తక్కువ వ్యవధిలో వెయ్యి సినిమాల డౌన్‌లోడ్

టెక్నాలజీతో శాస్త్రవేత్తలు అనేక అద్భుతాలు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు వెయ్యి హై డెఫినిషన్‌(హెచ్‌డీ) సినిమాలని సెకను కన్నా తక్కువ సమయంలోనే డౌన్‌ లోడ్‌ చేసుకునే సదుపాయాన్ని తీసుకొచ్చారు. భవిష్యత్‌ తరాలకి ఇది ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని వారు చెప్పుకొచ్చారు.

ఆప్టిక‌ల్ చిప్‌ని ఉప‌యోగించి ఈ ఘ‌న‌త‌ని సాధించిన‌ట్టు శాస్త్ర‌వేత్త‌లు చెబుతుండగా,  సెకనుకు 44.2 టెరాబైట్ల (44.2 TBPS) వేగాన్ని అందుకున్నామని మొనాష్, స్విన్ బర్న్, ఆర్ఎంఐటీ నిపుణుల బృందం వెల్లడించింది. ఆస్ట్రేలియా నేషనల్ బ్రాండ్ బ్యాండ్ నెట్ వర్క్ ఉపయోగించే నెట్ వర్క్ సదుపాయాల్లో ఈ మైక్రో కోంబ్ ను అమర్చి పరీక్షించగా, ఒక ఆఫ్టికల్ చిప్ ఇప్పటి వరకు చేయలేనంత..డేటాను ఉత్పత్తి చేయగలిగారు.

టెలికాం హార్డ్‌వేర్ క‌న్నా మైక్రోబాంబ్ చాలా చిన్న‌ది. ఇది ఇంద్ర‌ధ‌నస్సులా  వందలాది, నాణ్యమైన అదృశ్య పరారుణ లేజర్లని వెదజల్లుతుంది. ఒక్కో లేజర్‌ని ప్రత్యేక కమ్యునికేషన్‌ మార్గంగా ఉపయోగించుకోవచ్చు.  బ్రాండ్ బిడ్త్ సదుపాయాలపై పెరుగుతున్న ఒత్తిడిని తగ్గించేందుకు ఇది ఉపయోగపడుతుందని మొనాష్ యూనివర్సిటీలో ఎలక్ట్రికల్, కంప్యూటర్ సిస్టమ్స్ ప్రొఫెసర్ బిల్ కోర్కోరన్ తెలిపారు.  

లాక్‌డౌన్ వ‌ల‌న చాలా మంది ఇంటి నుండే ప‌ని చేయ‌డం, సామాజిక సంబంధాలు, వీడియో స్ట్రీమింగ్ కోసం ఇంట‌ర్నెట్‌ని ఫుల్‌గా వినియోగిస్తున్నారు. మారుమూల ప్రాంతాల‌లోను వినియోగం ఎక్కువైంది. రానున్న రోజుల‌లో దీనిని సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్‌, ర‌వాణా స‌దుపాయాల‌తో పాటు  ప్రపంచంలో అన్ని అవ‌స‌రాల‌కి  సరిపడేలా..బ్రాండ్ విడ్త్ లను అందించే శక్తి మైక్రో కోంబ్లకు ఉందన్నారు కోర్కోరన్. 

- Advertisement -

Latest news

వరుసగా ఆరో రోజు..అదే జోరు

వరుసగా ఆరో రోజు స్టాక్‌ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్‌ 86 పాయింట్ల లాభంతో 36వేల 743 వద్ద కొనసాగుతుండగా.. నిఫ్టీ 22 పాయింట్లు...

Related news

వరుసగా ఆరో రోజు..అదే జోరు

వరుసగా ఆరో రోజు స్టాక్‌ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్‌ 86 పాయింట్ల లాభంతో 36వేల 743 వద్ద కొనసాగుతుండగా.. నిఫ్టీ 22 పాయింట్లు...

కరోనా మరణాల సంఖ్య తగ్గించడంపై కేజ్రీవాల్‌ సర్కార్‌ ఫోకస్‌

రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులు, మరణాలు దేశ రాజధాని ఢిల్లీని వణికిస్తున్నాయి. దీంతో కరోనా మృతుల సంఖ్యను తగ్గించడంపై కేజ్రీవాల్‌ ప్రభుత్వం దృష్టి పెట్టింది. గడిచిన రెండు వారాల్లో చనిపోయిన...

ఉత్తరప్రదేశ్‌ లో పెరుగుతున్న కరోనా కేసులు

ఉత్తర ప్రదేశ్‌ లో కరోనా తీవ్రత అంతకంతకు పెరగుతోంది. గడిచిన 24గంటల్లో రికార్డు స్థాయిలో 1346కొత్తకేసులు వెలుగులోకి వచ్చాయి.నిన్నటికి నిన్న 18మంది మృతి చెందగా మరణాల సంఖ్య 827కు చేరింది....

హిమాచల్‌ ప్రదేశ్‌ లో వికాస్‌ దూబే అనుచరుడి ఎన్‌ కౌంటర్‌

కాన్పూర్ గ్యాంగస్టర్ వికాస్ దూబే అనుచరుడు పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. హిమాచల్ ప్రదేశ్ లోని హమీర్ పూర్ లో అమర్ దూబేను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో...